
రంగప్పచెరువులో వెంచర్ రాళ్ల తొలగింపు
● ‘సాక్షి’ కథనానికి స్పందన
● కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు
జనగామ: జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న రంగప్ప చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమంగా వేసిన వెంచర్(ప్లాట్లు) రాళ్లను అధికారులు శుక్రవారం తొలగించారు. ‘చెరువమ్మ.. కంట చెమ్మ’ శీర్షికన గత నెల 13న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పురపాలిక, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. రంగప్పచెరువు ఇప్పటికే 15 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైనట్లు అంచనా వేశా రు. కబ్జా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొంతమంది పెద్ద మనుషులు ఇటీవల పాత ఇళ్లను కూల్చివేసిన మట్టితో చెరువును కప్పేస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్న విషయం తెలి సిందే. చెరువు కబ్జాపై కథనాలు ప్రచురించిన ‘సాక్షి’కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

రంగప్పచెరువులో వెంచర్ రాళ్ల తొలగింపు

రంగప్పచెరువులో వెంచర్ రాళ్ల తొలగింపు