
మే 5న అర్చక పోస్టులకు పరీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టులకు మే 5న రాతి, మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల దేవాదాయశాఖ ఐదు అర్చక పోస్టుల కోసం నోటిఫికేషన్ వేసి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 41మంది దరఖాస్తులు ఈఓ కార్యాలయంలో సమర్పించారు. మే 5న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో పరీక్ష నిర్వహించనున్నారు. మే 15నుంచి జరుగు సరస్వతి పుష్కరాల వరకు అర్చకుల నియామకం చేయడానికి దేవాదాయశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
అకాల వర్షం
కాటారం: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. గ్రామాల్లో రైతులు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొంత మేర తడిసింది. రాత్రిపూట ధాన్యం కుప్పలపై పరదాలు కప్పి తడవకుండా రక్షించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. వర్షాభావ సూచనలతో రైతులు అప్రమత్తమయ్యారు.