
తూకాలు ప్రారంభించాలంటూ రైతుల ధర్నా
రామారెడ్డి: రెడ్డిపేట కొనుగోలు కేంద్రంలో తూకాలు ప్రారంభించకపోవడంతో రైతులు మంగళవారం కొంతసేపు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చి పదిహేను రోజులవుతున్నా కాంటాలు చేయడం లేదన్నారు. దీంతో కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద కనీస వసతులు కూడా లేవని, ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేకపోతే రోడ్ బ్లాక్ చేస్తామని డిమాండ్ చేశారు.

తూకాలు ప్రారంభించాలంటూ రైతుల ధర్నా