
రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ప్రతి ఒక్కరు ట్రాఫిక్
కామారెడ్డి క్రైం : జిల్లా పోలీసు శాఖ ఇటీవలి కాలంలో వాహనాల తనిఖీలను పెంచింది. వాహన పత్రాలు లేకపోయినా, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, త్రిబుల్ రైడింగ్ చేస్తున్నా పోలీసులు ఎడాపెడా జరిమానాలు బాదేస్తున్నారు. మూడు నెలల కాలంలోనే (జనవరి నుంచి మార్చి వరకు) జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,19,606 చలాన్లు విధించారు. వాటిలో హెల్మెట్ లేదని విధించిన జరిమానాలే 89,936. హెల్మెట్ ధరించలేదనే కారణంతోనే రోజుకు దాదాపు వెయ్యి చలాన్లు పడుతున్నాయి.
జిల్లాలో విస్తృతంగా వాహనాల తనిఖీ
హెల్మెట్ లేకుంటే జరిమానా
విధిస్తున్న పోలీసులు
3 నెలల్లో 89,936 మందికి ఫైన్..
అయినా మారని వాహనదారులు