
‘మూడేళ్లు పోషకాహారం తీసుకోవాలి’
ఎల్లారెడ్డి : గర్భం దాల్చిన నాటి నుంచి చి న్నారులకు రెండేళ్ల వయసు వచ్చేంతవరకు తల్లులు పోషకాహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. ఇది అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాత్రమే సా ధ్యమవుతుందన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్‌లో భాగంగా సామూహిక సీమంతా లు, అక్షరభ్యాసం, అన్నప్రాసన, గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నామన్నారు. దీనిని తీసుకోవడం వల్ల బిడ్డలు ఆరోగ్యంగా జన్మిస్తారన్నా రు. పిల్లలకు రెండేళ్ల వయసు వచ్చేంత వర కు తల్లిపాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో స్వరూప రాణి, సూ పర్‌వైజర్లు హారతి, భారతి, సీనియర్ అసిస్టెంట్ మహీపాల్, అంగన్‌వాడీ టీచర్లు దేవ కర్ణ, నీలారాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
‘ఉగ్రదాడి
హేయమైన చర్య’
కామారెడ్డి టౌన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇది అమానవీయ చర్య అన్నారు. ఇలాంటివాటిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని కోరారు. కలలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బ్లూ కోల్ట్స్ సిబ్బందికి సన్మానం
కామారెడ్డి టౌన్: పిట్లం మండలంలో ఇటీవల చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది రవిచంద్ర, మారుతిలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అభినందించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు భవనంలో వారిని సన్మానించి, మొక్కలను జ్ఞాపికగా అందించారు.
అకాల వర్షంతో
ఆందోళన
కామారెడ్డి రూరల్/రాజంపేట: కామారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. అరగంట పాటు గాలులతో కూడిన వర్షం కురియడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజంపేట మండలకేంద్రంలో చిరుజల్లులు కురిశాయి. వర్షంతో ఎక్కడ ధాన్యం తడిచిపోతుందోనని రైతులు ఆందోళన చెందారు. వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పారు.
‘మహిళల రక్షణ కోసమే షీటీంలు’
కామారెడ్డి క్రైం: మహిళల రక్షణ కోసమే షీటీంలు ఉన్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. షీటీంలలో కొంతకాలంగా ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు సౌజన్య, ప్రవీణలను అభినందించారు. శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం షీ టీంల ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే 87126 86094 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

‘మూడేళ్లు పోషకాహారం తీసుకోవాలి’

‘మూడేళ్లు పోషకాహారం తీసుకోవాలి’

‘మూడేళ్లు పోషకాహారం తీసుకోవాలి’