
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
కమాన్‌పూర్(మంథని): కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామం రాజేంద్రనగర్ శివారులో సోమవారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామానికి చెందిన సవలం మల్లేశ్ చింతూరు ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన అలక సందీప్, మద్దెల హరీశ్‌కు అందజేశాడు. ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై గంజాయిని గోదావరిఖని ప్రాంతానికి తరలిస్తుండగా, పక్కా సమాచారంతో కమాన్‌పూర్ ఎస్సై ప్రసాద్ సిబ్బందితో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కిలోల గంజాయి, ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకున్న ఎస్సై ప్రసాద్, సిబ్బందిని ఏసీపీ, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు అభినందించారు.