
దొడ్డబళ్లాపురం: కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం చెన్నపట్టణలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జమీర్.. ఏయ్ కుమారస్వామి నీ రేటెంత అని హేళనగా మాట్లాడారు. కరియ (నలుపు వ్యక్తి) అని కుమారస్వామిని దూషించారు. కరియ కుమారస్వామి బీజేపీ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని ఆరోపించారు.