
కొత్త కార్డులు 1,017
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రప్రభుత్వం ఇటీవల కొందరికి రేషన్‌కార్డులు మంజూరు చేయగా ఆయా కార్డుదారులకు వచ్చేనెల నుంచి సన్నబియ్యం అందనున్నాయి. జిల్లాలో కొత్తగా 1,017కార్డులు మంజూరయ్యాయని, వీటిపై 40,519మంది లబ్ధిదారులకు ఆరు కేజీల చొప్పున 2,43.114కేజీల బియ్యం అందించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. కొత్తవి కలిపి జిల్లాలో కార్డుల సంఖ్య 4,11,990కు, లబ్ధిదారుల సంఖ్య 11,89,685కు చేరనుందని వెల్లడించారు. కార్డుదారులు బయోమెట్రిక్, ఐరిష్ ద్వారా బియ్యం తీసుకోవచ్చని, ఇద్దరు కుటుంబీకులు ఉన్న వారు మాత్రమే ఓటీపీ ద్వారా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. అలాగే, ఎక్కడైనా బియ్యం తీసుకునేందుకు పోర్టబులిటీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వచ్చేనెల నుంచి లబ్ధిదారులకు బియ్యం