Khammam District News
-
‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’
●సన్న బియ్యం.. సకల జనుల ఆసక్తినిబద్ధత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయాంప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా ఈనెల నుంచి సన్న బియ్యం పంపిణీ ఆరంభించింది. దీంతో కార్డు ఉన్నా ఇన్నాళ్లు రేషన్‌షాపులకే వెళ్లని పలువురు కూడా ఈసారి ఆసక్తి కనబరుస్తున్నారు. బియ్యం తిన్నా, తినకపోయినా సన్నబియ్యం ఎలా ఉంటాయోననే ఆసక్తితో తీసుకునేందుకు వస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని పలు రేషన్‌షాపుల వద్ద మునుపెన్నడూ లేని విధంగా క్యూలైన్లు కనిపిస్తుండడం విశేషం.– స్టాఫ్ ఫొటోగ్రాఫర్గుర్తు తెలియని వ్యక్తి మృతి కల్లూరు/పెనుబల్లి: తీవ్రగాయాలతో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందిన ఘటన ఇది. పెనుబల్లి మండలం ముత్తగూడెం – కల్లూరు మండలం ముగ్గువెంకటాపురం గ్రామాల మధ్య రోడ్డు పక్కన మంగళవారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో వ్యక్తి పడి ఉన్నాడు. ఆయన ఒంటిపై చొక్కా లేకపోగా, తీవ్ర గాయాలై ఉండడంతో ఓ లారీ డ్రైవర్ పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు 108 సిబ్బందికి తెలపడంతో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సదరు వ్యక్తి పడి ఉన్న ప్రాంతం కల్లూరు మండల పరిధిలోకి రావడంతో ఎస్ఐ హరిత విచారణ చేపట్టారు. మృతుడి కుడి భుజంపై సూర్యుడి గుర్తు పచ్చబొట్టు ఉందని, ఆయన ఆచూకీ తెలిసిన వారు 87126 59171, 87126 59172 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. మతిస్థిమితం లేని వ్యక్తి.. ఏన్కూరు: మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(45) మండలంలోని హిమామ్‌నగర్ సమీపాన మంగళవారం మృతి చెందాడు. గ్రామ సమీపాన కోళ్లఫారం వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకుని పోలీసులు, గుర్తించారు. ఆయనకు కుడి చేయి లేకపోగా, ఒంటిపై నిక్కర్ మాత్రమే ఉండడంతో మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ బాధ్యుల సహకారంతో మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ రఫీ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు...వేంసూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వేంసూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వెంకటాపురంలో బంధువుల ఇంటికి వచ్చిన ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహరావుపురానికి చెందిన నక్క రామస్వామి సోమవారం రాత్రి నడుస్తూ స్వగ్రామానికి వెళ్తున్నాడు.ఈక్రమాన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ వీరప్రసాద్ ఆయన మృతదేహాన్ని సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వడదెబ్బతో వ్యవసాయ కూలీ... తల్లాడ: మండలంలోని మల్లవరంలో వడదెబ్బకు గురైన వ్యవసాయ కూలీ మంగళవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన గుడిపల్లి వెంకమ్మ(60) ఈనెల 4న గ్రామంలో పొలం పనులకు వెళ్లి వచ్చింది. ఆరోజు నుంచి నీరసమై వాంతులు, విరోచనాలు అవుతుండడంతో నారాయణపురంలో చికిత్స చేయించి, మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స మొదలైన గంటలోనే వెంకమ్మ మృతి చెందింది. ఆమె భర్త భాస్కర్‌రావు ఆరు నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందగా, వారికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇంటి ఎదుట నిలిపిన బైక్ చోరీ నేలకొండపల్లి: మండల కేంద్రానికి పిట్టల వినయ్ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్‌ను మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. అందులో ఒకరు హెల్మెట్ ధరించగా, మరొకరు రుమాలు, టోపీతో ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఘటనపై సీసీ పుటేజీలో నమోదైన చిత్రాల ఆధారంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మధిర/ఎర్రుపాలెం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున, ప్రతిఒక్కరు ఆ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రావణ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మధిర, ఎర్రుపాలెంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణుల సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని నిర్వీర్యం బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు నిలుస్తాయని పేర్కొన్నారు. ఈనేపథ్యాన ప్రజలంతా ఏకమై మోదీ ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. ఈ విషయంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఇంటింటా వివరించాలని సూచించారు. ఈసమావేశాల్లో మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఓబీసీ సెల్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, మధిర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణుతో పాటు మండలాల అధ్యక్షులు, నాయకులు సూరంశెట్టి కిషోర్, మిరియాల వెంకటరమణ గుప్తా, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, తూమాటి నవీన్‌రెడ్డి, చావా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఖమ్మం మామిళ్లగూడెం/ఖమ్మం వన్‌టౌన్: సీపీఎం నాయకుడు యర్రా శ్రీకాంత్ మృతితో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గుండెపోటుతో ఆదివారం మృతి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ మృతదేహం వద్ద ఆయన మంగళవారం నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ శ్రీకాంత్ కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమై పనిచేసిందని, దశాబ్దాలుగా కార్మికులు, పేదల సంక్షేమం, హక్కుల సాధనకు పోరాడారని తెలిపారు. వివిధ పార్టీలు, యూనియన్ల నాయకులు బాగం హేమంతరావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, తాటి నిర్మల, ఏనుగు వెంకటేశ్వరరావు, నూనె శశిధర్, జ్వాలా నర్సింహారావు, ఎన్.శంకరరావు, రవీందర్, విజయ్ తదితరులు ఉన్నారు. అలాగే, యర్రా శ్రీకాంత్ మృతదేహం వద్ద ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా నివాళులర్పించారు. వివిధ పార్టీల నాయకులు వై.లెనిన్, నవీన్‌రెడ్డి, జబ్బార్, మిక్కిలినేని నరేందర్, కొప్పుల చంద్రశేఖర్, కానుగల రాధాకృష్ణ, ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ పాల్గొన్నారు. ఖమ్మం మయూరిసెంటర్: సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మంగళవారం ఖమ్మంలో కలిసి యోగక్షేమాలు ఆరా తీశారు. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ ఖమ్మంక్రైం: ఖమ్మం శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను ఎకై ్సజ్ స్టేషన్–1 పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. చింతకాని మండలం బొప్పారానికి చెందిన ఖలీల్ పాషా, ఖమ్మంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పశువుల ఉదయ్‌కుమార్, బత్తుల వెంకటేష్, కొమ్మరబోయిన నవీన్ ఇండస్ట్రియల్ ఏరియాలో గంజాయి విక్రయిస్తుండగా మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 670 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ కృష్ణతో పాటు ఉద్యోగులు సాయిబాబా, రేష్మసుల్తానా తదితరులు పాల్గొన్నారు.‘సంవిధాన్’ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
24గంటల్లోగా మిల్లులకు ధాన్యం
తల్లాడ/పెనుబల్లి/వేంసూరు/కల్లూరు రూరల్: కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోగా రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. తద్వారా అకాల వర్షాల నుంచి పంటను కాపాడొచ్చని తెలిపారు. తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేయడంతో పాటు కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుల పరిశీలనపై ఆరా తీశారు. ఈ మేరకు పెనుబల్లి మండలం నూతనకల్‌లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు గన్నీ బ్యాగ్‌లు, టార్ఫాలిన్ సంచులు, తేమ యంత్రాలు, వేయింగ్ మిషన్లు అందుబాటులో పెట్టాలని తెలిపారు. ఆతర్వాత మిట్టపల్లిలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల విచారణను పరిశీలించారు. పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్‌లోని రైస్ మిల్లును తనిఖీ చేయగా.. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని, రబీ సీజన్ సీఎంఆర్ గడువులోగా అందించాలని సూచించారు. అక్కడి తహసీల్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఇక వేంసూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తహసీల్‌ను తనిఖీ చేశారు. అలాగే, కల్లూరు మండలం పుల్లయ్యబంజరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్, కల్లూరు ఆర్డీఓ రాజేందర్, నూతనకల్ సొసైటీ అధ్యక్షుడు తూము వీరభద్రరావు, సీఈఓ రాకేష్, తహసీల్దార్లు గంటా ప్రతాప్, బాబ్జీప్రసాద్, పులి సాంబశివుడు, ఏఓలు తాజుద్దీన్, ఎం.రూప, దీపిక, ఉమామహేశ్వరరావు ఆర్ఐలు విజయ్‌భాస్కర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
స్లాట్ ఉంటేనే రిజిస్ట్రేషన్
● ప్రతీ డాక్యుమెంట్‌కు తప్పనిసరి చేసిన ప్రభుత్వం ● పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లాలో మూడు కార్యాలయాలు ● ఈనెల 10 నుండి నూతన విధానం అమలుఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండేలా చేస్తూనే త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. తొలుత 19 కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి నూతన విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్నారు. ఈ జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థానం దక్కింది. మూకుమ్మడిగా చేయకుండా.. ప్రస్తుతం ఎవరు ముందు వస్తే వారు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాక దళారులు పదుల సంఖ్యలో డాక్యుమెంట్లు తీసుకొచ్చి వరుసగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటుండడంతో మిగతా వారి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో స్లాట్ బుకింగ్ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 19 కార్యాలయాలను పైలట్గాఎంపిక చేయగా.. ఖమ్మం ఆర్ఓ(జాయింట్ సబ్‌రిజిస్ట్రార్) కార్యాలయం, కూసుమంచి, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి నూతన విధానం అమలు కానుంది. గతంలో స్లాట్ బుకింగ్ విధానం ఉన్నా.. పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సేల్, మార్ట్గేజ్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ మినహా ఇతర డాక్యుమెంట్లకు స్లాట్ బుక్ చేసిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం ఇప్పుడు పారదర్శకత కోసం స్లాట్ బుకింగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ విధానంతో ఒకేసారి 30–40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వీలు ఉండదని.. ఒక స్లాట్‌లో ఒకే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెబుతున్నారు. రోజుకు 48 డాక్యుమెంట్లు కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారు ముందుగా సమయం నిర్ణయించుకుని స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఆ సమయానికి కాస్త ముందు వస్తే 10 నుంచి 15 నిమిషాల్లో పని పూర్తిచేసుకుని వెళ్లిపోవచ్చు. రోజుకు 48 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ చేసేలా ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 10–30నుండి మధ్యాహ్నం 1–30 గంటల వరకు 24, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5గంటల వరకు 24 డాక్యుమెంట్ల చొప్పున స్లాట్లు కేటాయిస్తారు. స్లాట్ బుక్ చేసుకోలేని అత్యవసరమైన వారికి సాయంత్రం 5నుండి 6 గంటల వరకు సమయం ఇస్తారు. కానీ ఈ సమయంలో ఐదు డాక్యుమెంట్ల కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. ‘వాక్ ఇన్ రిజిస్ట్రేషన్’ పేరుతో వీటికి అనుమతి ఇవ్వనుండగా.. కార్యాలయానికి ఎవరు ముందు వస్తే వారికి అవకాశం కల్పిస్తారు. -
అధ్యాపకురాలికి డాక్టరేట్
నేలకొండపల్లి/ఖమ్మం అర్బన్: నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కవ్వంపల్లి జ్యోతిర్మయిరాణికి డాక్టరేట్ లభించింది. ఖమ్మం ఖానాపురానికి చెందిన ఆమె ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వి.నాగరాజు పర్యవేక్షణలో ‘వివిధ రకాల మెట్రిక్ స్థలాల్లో నిర్దిష్ట స్థిర బిందు సిద్ధాంతాలు – అనుసంధాన స్థిర బిందు సిద్ధాంతాలు – వాటి ఉపయోగాలు’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంధానికి ఓయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా మంగళవారం జ్యోతిర్మయిరాణిని కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, అద్యాపకులు, ఉద్యోగులు సన్మానించగా, తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గోపి, డాక్టర్ జె.రమేష్ తదితరులు అభినందించారు. ‘యువిక’కు దమ్మపేట గురుకులం విద్యార్థి దమ్మపేట/నేలకొండపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తున్న యువ విజ్ఞాని కార్యక్రమ్(యువిక)కు నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లికి చెందిన విద్యార్థి బారి ఉదయ్ ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన బారి వెంకన్న–సునీత దంపతుల కుమారుడు ఉదయ్ దమ్మపేటలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పాఠశాల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆసక్తి పెంచేందుకు ‘యువిక’ కార్యక్రమం నిర్వహిస్తుండగా 15రోజుల శిక్షణకు ఆయన ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఉదయ్‌ను జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఎం.ధన లక్ష్మి, గ్రామస్తులు పోలంపల్లి నాగేశ్వరరావు, మరికంటి ఉమ తదితరులు అభినందించారు. రెండు ఉద్యోగాలు సాధించిన యువతి మధిర: మండలంలోని దెందుకూరుకు చెందిన గుర్రం కళాధర్ కుమార్తె నైమిష రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ంది. గత ఏడాది స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించిన పరీక్షలకు హాజరుకాగా ఇటీవల ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఆదాయపన్ను శాఖ, హోం శాఖలో అధికారిగా ఆమె ఉద్యోగాలకు ఎంపికై ంది. ఏదైనా ఒక ఉద్యోగం ఎంచుకుని ఈనెల 10న చేరనున్నట్లు నైమిష వెల్లడించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవడంపై పలువురు అభినందించారు. ‘రాజీవ్ యువవికాసం’పై అవగాహన ఖమ్మం మామిళ్లగూడెం: రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులంతా దరఖాస్తు చేసుకునేలా కుల సంఘాల నాయకులు కృషి చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు పురంధర్, జి.జ్యోతి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో పాటు బీసీ, ఎంబీసీ నాయకులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రేషన్‌కార్డు లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ అవసరమవుతుంని తెలిపారు. ఆన్లైన్లో సమస్య ఎదురైతే దరఖాస్తులను మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ఈనెల 14లోగా అందించాలని సూచించారు. సమాచారం కోసం సంబంధిత కార్యాలయాల్లో సంప్రదించాలే తప్ప దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. అటు విద్యుత్ కోత.. ఇటు గొలుసు చోరీ ఖమ్మంక్రైం: ఖమ్మంలో మంగళవారం రాత్రి గాలిదుమారం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచివేయడంతో ఇదే అదునుగా దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. మామిళ్లగూడెంలోని వీవీసీ ఫంక్షన్ హాల్ సమీపాన నివాసముండే విజయ రోజులాగే రామాలయం సెంటర్లోని టైలరింగ్‌లో దుకాణంలో పని ముగించుకుని వస్తోంది. ఇంటి సమీపానికి చేరుతుండగా కరెంట్ పోవడంతో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండుగుడు కత్తితో బెదిరించి ఆమె మెడలోని రెండున్నర తులాలు గొలుసు లాక్కుని పారిపోయాడు. బాధితులు కేకలు వేస్తుండగానే దుండగుడు క్షణాల్లో మాయమయ్యాడు. ఈమేరకు ఖమ్మం టుటౌన్ పోలీసులకు బాదితురాలు విజయ ఫిర్యాదు చేయగా సీపీఎస్ ఏసీపీ సర్వర్, సీఐ బాలకృష్ణ, సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. -
విద్యార్థి చికిత్సకు ఉపాధ్యాయుల చేయూత
పెనుబల్లి: విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. ఆపదలో వారికి అండగా నిలుస్తామని ఉపాధ్యాయులు నిరూపించారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన విద్యార్థికి చికిత్స చేయించడంలో నిరుపేదలైన తల్లిదండ్రులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిసి ఎంఈఓ సహా ఉపాధ్యాయులు రూ.లక్ష నగదు సమకూర్చారు. వివరాలు... మండలంలోని చౌడవరం గ్రామానికి చెందిన తొమ్మిది తరగతి విద్యార్థి సడియం వంశీ సోమవారం వీఎం బంజర జెడ్పీహెచ్ఎస్ నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్లే క్రమాన లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స ఖర్చుల కోసం ఎంఈఓ సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు రూ.65 వేలు సమకూర్చారు. మండలంలోని మిగిలిన పాఠశాలల ఉపాధ్యాయులు రూ.35వేలు ఇవ్వగా, మొత్తం రూ.లక్షల నగదును ఆస్పత్రి యాజమాన్యానికి చెల్లించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు వీ.వీ.రామారావు, వనమా నాగేశ్వరరావు, జి.వీరస్వామి, నాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రద్ధగా చదివి ఉద్యోగాలు సాధించండి..
సత్తుపల్లిటౌన్: ‘ఏ పరీక్షకు సిద్ధమవుతున్నారు.. సమయం సరిపోతోందా.. అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా.. ఏమైనా సదుపాయాలు కావా లన్నా కల్పిస్తాం.. శ్రద్ధగా చదివి పోటీ పరీక్షల్లో విజ యం సాధించి ఉద్యోగాలకు ఎంపిక కండి’ అని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ సూచించారు. సత్తుపల్లిలోని మోడ్రన్ లైబ్రరీని మంగళవారం సందర్శించిన ఆమె అక్కడి అభ్యర్థులతో మాట్లాడారు. సెల వు రోజుల్లో మూసివేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు చెప్పగా అన్ని రోజులు తెరిచి ఉంచాలని లైబ్రేరియన్ మల్లికార్జున్‌ను ఆదేశించారు. ఉదయం 7నుంచి రాత్రి 7గంటల వరకు పనిచేసేలా ఉద్యోగులు సమయం సర్దుబాటు చేసుకోవా లని, మాక్టెస్టుల నిర్వహణకు నాలుగు కంప్యూటర్లను సమకూర్చి ఇంటర్నెట్ స్పీడ్ పెంచాలని సూచించారు. అభివృద్ధి పనుల పరిశీలన సత్తుపల్లిలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న మోడ్రన్ ధోబీఘాట్‌ను జూలై కల్లా పూర్తి చేసి యంత్రాలు సమకూర్చాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. ధోబీఘాట్‌తో పాటు ఎన్టీఆర్నగర్లో రూ.1.48 కోట్లతో నిర్మిస్తున్న యూపీహెచ్‌సీని పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఆతర్వాత స్వామి వివేకానంద ఎక్స్‌లెన్స్ భవనంలో తనిఖీ చేసి మిగిలిన పనులు పూర్తి చేయాలని తెలిపారు. అర్బన్ పార్క్‌లో బ్యాటరీకారుపై కలియదిగిగిన ఆమె పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు సమకూర్చాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం, ఎస్టీ బాలుర, ఎస్సీ బాలికల హాస్టళ్లను సైతం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ నర్సింహ, రేంజర్ స్నేహలత, ఎంపీడీఓ ఆర్.చిన్ననాగేశ్వరరావు, ఏఈ సురేష్, మేనేజర్ మైసా శ్రీనివాసరావు, హెచ్‌డబ్ల్యూఓలు రాములు, దారుగాబి, ఎంపీఈఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ -
అన్నంలో బొద్దింక.. ఇడ్లీలో ఇసుక
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని సింగరేణి జేవీఆర్ ఓసీ క్యాంటీన్లో సరఫరా చేసే భోజన పదార్థాలు నాసిరకంగా ఉండడమే కాకా పురుగులు వస్తున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు సోమవారం అన్నంలో బొద్దింక రాగా, మంగళవారం ఇడ్లీలో ఇసుక తగిలిందని తెలిపారు. సింగరేణి కార్మికులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో సింగరేణి ఆధ్వర్యాన నడిచిన క్యాంటీన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో ఈ పరిస్థితి నెలకొందని హెచ్ఎంఎస్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, తదితరులు ఆరోపించారు. ఈమేరకు అధికారులతో పాటు గుర్తింపు సంఘాల నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు.ఇదీ సింగరేణి క్యాంటీన్ దుస్థితి -
కల్తీ పాల దందా..
● విక్రేతలపై కొనుగోలుదారుల ఆగ్రహం ● శాంపిళ్లు సేకరించిన ఆహార తనిఖీ అధికారులుఖమ్మంమయూరిసెంటర్: ఆర్గానిక్ పేరుతో కల్తీ పాలు విక్రయిస్తున్నారంటూ పలువురు ఖమ్మంలోని ఓ పాల విక్రయ కేంద్రం వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం ఏసీపీ కార్యాలయం ఎదుట బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక పేరిట ఏర్పాటుచేసిన షాపులో కొన్నాళ్లుగా కొనుగోలు చేస్తున్న పాలు వేడి చేయగానే గడ్డ కడుతున్నాయని ఆరోపించారు. ఈమేరకు బ్యాంక్ కాలనీకి చెందిన కొల్లు రామారావు మంగళవారం లీటరు పాలు రూ.90తో కొనుగోలు చేయగా, ఇంట్లో వేడి చేయగానే గడ్డ కట్టగానే వాసన వచ్చిందని తెలిపారు. దీంతో కేంద్రానికి వచ్చిన ఆయన విక్రయదారులను నిలదీశాడు. ఈ విషయమై ఆహార తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు చేరుకుని శాంపిల్లు సేకరిస్తుండగానే మరో ఇద్దరు వచ్చి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. ఇక ఆర్గానిక్ తేనె అంటూ కల్తీ జరిగిందని అంటగట్టారని షాప్ నిర్వాహకులపై ఖమ్మంకు చెందిన పరమేశ్వర్ అదే సమయాన ఫిర్యాదు చేయడం గమనార్హం. కేఎంసీలో మహిళ ఫిర్యాదు గొల్లగూడెం రోడ్డులోని ఓ డెయిరీ వద్ద అమ్మే పాలలో కల్తీ చేస్తున్నారని కేఎంసీలోని ఆహార తనిఖీ అధికారులకు మౌనిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కల్తీమయం.. జిల్లా కేంద్రంలో వ్యాపారులు లైసెన్స్ తీసుకోకపోవడమే కాక కల్తీ వస్తువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కల్తీపాలు విక్రయించారని ఆరోపణలు వచ్చినబొమ్మిశెట్టి నెలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదికకు కూడా నిర్వాహకులు అనుమతి కానీ లైసెన్స్ కానీ తీసుకోలేదని గుర్తించారు. అయితే, ఈ షాప్ వద్ద మంగళవారం వినియోగదారులు ఆందోళన చేస్తున్న సమయాన అక్కడికి వచ్చిన ఆహార తనిఖీ అధికారులు, సిబ్బంది అందరినీ మేనేజ్ చేసుకోవాలని వ్యాపారికి సలహా ఇచ్చినట్లు పలువురు ఆరోపించారు.శాంపిళ్లు సేకరించాం.. బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదికలో పాలు, తేనె కల్తీ జరుగుతోందన్న ఫిర్యాదులతో శాంపిళ్లు సేకరించాం. గొల్లగూడెం రోడ్డులోని ఓ షాప్‌లో కూడా శాంపిళ్లు తీసుకున్నాం. హైదరాబాద్ ల్యాబ్ నుంచి 15 రోజుల్లోగా ఫలితాలు వస్తాయి. అంతేకాక లైసెన్స్ లేకుండా పాలు విక్రయిస్తున్న వారు 15 రోజుల్లోగా లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించాం. – ఆర్.కిరణ్‌కుమార్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ -
ఈదురుగాలులతో అపారనష్టం
● పలుచోట్ల నేలవాలిన పంటలు ● మామిడికాయలు రాలడంతో రైతుల ఆందోళన సత్తుపల్లి/వేంసూరు/కల్లూరు రూరల్: సత్తుపల్లి నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కువడంతో రైతులకు నష్టం ఎదురైంది. మంగళవారం సాయంత్రం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈదురుగాలుల ప్రభావంతో సత్తుపల్లి మండలం పాకలగూడెంలో సూరిశెట్టి రామారావుకు చెందిన నాలుగు ఎకరాల అరటితోట నేలవాలగా, రుద్రాక్షపల్లిలో ధరావత్ కృష్ణకు చెందిన 30ఎకరాల మామిడితోటలో కాయలు నేలరాలాయని వాపోయారు. గంగారంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవడంతో రైతులు తిరిగి ఆరబోశారు. ఇక వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. శంభునిగూడెంలో మూడెకరాల మొక్కజొన్న పంట పడిపోవడంతో మంగళవారం అధికారులు పరిశీలించారు. మొత్తంగా 120 ఎకరాల్లో వరి, 180 ఎకరాల్లో మామిడి, 220 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అలాగే, కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో కూడా మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. ఈ కాయలు దెబ్బతినడంతో అమ్మే పరిస్థితి లేక నష్టపోయినట్లేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
పేదలందరికీ సంక్షేమ పథకాలు
● ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● మేడేపల్లిలో వంతెనకు శంకుస్థాపన, కేజీబీవీలో భోజనంఏన్కూరు: రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. అయితే, అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. ఏన్కూరు మండలం మేడేపల్లిలో పీఎంజేఎస్వై నిధులు రూ.4.50 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ వంతెనకు ఎంపీ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సీ్త్ర టీ స్టాల్‌ను ప్రారంభించి నిర్వాహకులు నాగేంద్రమ్మను అభినందించారు. ఆతర్వాతఎంపీ మాట్లాడుతూ హెచ్‌సీయూ భూముల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రుణమాఫీ కాని రైతుల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా, జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని ఎంపీ తెలిపారు. అనంతరం రేపల్లెవాడ సమీపంలోని రాజీవ్ లింక్ కెనాల్ పనులను పరిశీలించిన ఎంపీ, ఏన్కూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంటగదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించాక మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను ఆరా తీశారు. ఆపై వారితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశారు. ఈకార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటరెడ్డి, డీఈ కరుణాకర్‌రెడ్డి, నాయకులు గుత్తా వెంకటేశ్వరావు, వేముల కృష్ణప్రసాద్, స్వర్ణ నరేందర్, మేడ ధర్మారావు, చందూలాల్, భూక్యా లాలు, వాసిరెడ్డి నాగేశ్వరావు, కొప్పుల ప్రభావతిరెడ్డి, వాసిరెడ్డి నాగేశ్వరావు, తాళ్లూరి నవీన్, దళపతి భువనేశ్వర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
చాతకొండ బెటాలియన్ అభివృద్ధికి రూ.20 లక్షలు
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్‌లో అభివృద్ధి పనుల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్‌రెడ్డి, ఆర్ఐ జీ.వీ.రామారావుకు మంగళవారం ఖమ్మంలో అందజేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తే బెటాలియన్‌లో సెల్యూటింగ్ డయాస్, గ్యాలరీ నిర్మాణ పనులు చేపడతామని వారు వెల్లడించగా, ఎంపీ రూ.20లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఎంపీకి కమాండెంట్ కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి మే 10న పరీక్ష ఖమ్మంమయూరిసెంటర్/వైరా: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు మే 10న పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ బి.రమ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం(ఇంగ్లిష్ మీడియం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్‌ల్లో ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. మే 10న ఉదయం 10నుండి మధ్యాహ్నం 12–30గంటల జరిగే పరీక్ష కోసం విద్యార్థులు www.tgrjdc. cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఇదే సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 040– 24734899, 94909 67222, 80081 18813 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. వృత్తి శిక్షణా సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: క్రిస్టియన్ మైనార్టీలకు వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డాక్టర్ బి.పురంధర్ తెలిపారు. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ గుర్తింపు లేదా కేంద్రప్రభుత్వ మైనార్టీ శాఖ ద్వారా ట్రైనింగ్ పార్టనర్‌గా ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అర్హత కలిగిన సంస్థల బాధ్యులు పూర్తి వివరాలు, రెండు సెట్ల దరఖాస్తులను ‘తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, గృహకల్ప రెండో అంతస్తు, ఎం.జే.రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్’లో ఈనెల 12 లోగా అందించాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ ఖమ్మంవైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులు, ఉద్యోగులు శ్రద్ధ కనబర్చాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. ఎంఎల్‌హెచ్‌పీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల)లకు మంగళవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆమె మాట్లాడారు. మాతాశిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, ఎయిడ్స్, లెప్రసీ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నిర్వహణ, క్షయ నివారణకు కృషి చేస్తూనే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అంతేకాక వడదెబ్బ బారిన పడకుండా ప్రచారం చేయాలని, ఆస్పత్రుల్లో ఓపీ నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేవంలో వివిధ విభాగాల అధికారులు డాక్టర్ రామారావు, డాక్టర్ చందునాయక్, డాక్టర్ సైదులు, డాక్టర్ వెంకటరమణ, వి.సుబ్రహ్మణ్యం, దుర్గ పాల్గొన్నారు. నేడు వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్ ఖమ్మంవ్యవసాయం: పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించేందుకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జోన్–1 నుంచి జోన్–7 వరకు 373 మంది వెటర్నరీ అసిస్టెంట్ల(పశువైద్య సహాయకులు)లో అర్హులకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లు(పశుసంపద సహాయకులు)గా పదోన్నతి కల్పి స్తారు. జోన్–4లోకి వచ్చే హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి 46 మంది అర్హత సాధించగా, బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌన్సెలింగ్‌లో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.వెంకటనారాయణతో పాటు మరో అసిస్టెంట్ డైరెక్టర్, కార్యాలయ మేనేజర్ పాల్గొననున్నారు. ఈమేరకు రోస్టర్ ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తారు. -
దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వండి..
ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి రశీదు ఇవ్వాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణను మంగళవారం ఆయన పరిశీలించారు. పలువురు దరఖాస్తుదారులతో మాట్లాడి ఏ యూనిట్‌ను ఎంచుకున్నారు, అందులో ఎంత మేర అనుభవం ఉందని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ వరకు గడువు ఉందని, ఆన్లైన్లో సమస్య ఎదురైతే మున్సిపాలిటీ లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు ఇవ్వొచ్చని తెలిపారు. కేఎంసీలో ఐదు కౌంటర్ల ద్వారా దరఖాస్తు తీసుకుంటున్నందున సామాజికవర్గాల వారీగా రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని ఉద్యోగులకు కలెక్టర్ సూచించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా, సుజాత పాల్గొన్నారు.కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు
● మధురై నుంచి ఖమ్మం చేరిన సీపీఎం నేత శ్రీకాంత్ మృతదేహం ● నివాళులర్పించిన వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఖమ్మంమయూరిసెంటర్: మధురైలో జరిగిన సీపీఎం అఖిలభారత 24వ మహాసభలకు ప్రతినిధిగా వెళ్లి ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు మృతదేహం ఇక్కడకు చేరుకోగా, పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా మమత ఆస్పత్రికి, అక్కడి నుంచి సీపీఎం జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈక్రమంలో వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. కాగా, సంతాప సభ అనంతరం శ్రీకాంత్ మృతదేహాన్ని శ్రీనివాస్‌నగర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. శ్రీకాంత్ ముగ్గురు కుమారుల్లో ఒకరు అమెరికాలో ఉన్నందున ఆయన వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీకాంత్ మరణం తీరనిలోటు.. సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సంతాప సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ శ్రీకాంత్ మరణం ప్రజా ఉద్యమాలకే కాక పార్టీకి తీరని లోటన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ మధురైలో శ్రీకాంత్ అస్వస్తతకు గురైనట్లు తెలియగానే అక్కడి అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. కానీ రెండో సారి స్ట్రోక్ రావడంతో మృతి చెందాడని ర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ అఖిలభారత మహాసభలకు మొదటిసారి ప్రతినిధిగా ఎంపిక కావడంపై శ్రీకాంత్ సంతోషపడ్డాడని, అందరం రైలులో వెళ్లి వచ్చేటప్పుడు ఆయన తమతో లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాస్‌లైన్ నాయకుడు గుర్రం అచ్చయ్య తదితరులు మాట్లాడారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కొండబాల కరుణాకర్, దేవరెడ్డి విజయ్, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, మధు, వంగూరి రాములు, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై.విక్రమ్, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, డాక్టర్ సి.భారవి, అఫ్రోజ్ సమీనా, ఆవునూరి మధు, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, అన్నం శ్రీనివాసరావు, లింగాల రవికుమార్, దాసరి పూర్ణచందర్. నాగిశెట్టి రాధాకృష్ణ, ఆకుల గాంధీ, పార నాగేశ్వరరావు, కే.వీ.కృష్ణారావు, పసుపులేటి నాసరయ్య, గులాం జాఫర్ తదితరులు నివాళులర్పించారు. రేపు ఖమ్మం మార్కెట్‌కు సెలవు ఖమ్మంవ్యవసాయం: ీసపీఎం నాయకుడు యర్రా శ్రీకాంత్ అకాల మృతికి సంతాప సూచకంగా.. కార్మిక సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యర్ధనతో బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించాలని సూచించారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
సత్తుపల్లిటౌన్: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ములగలపాటి వారిగూడెంకు చెందిన కంటి వెంకటనారాయణ(70) బైక్‌పై సోమవారం వేంసూరు మండలం కుంచపర్తి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. లారీ ఢీకొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలు పెనుబల్లి: సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఘటన పెనుబల్లిలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని చౌడవరం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సడియం వంశీ వీఎం బంజర్ జెడ్పీహెచ్ఎస్ నుంచి మధ్యాహ్నం పాఠశాల ముగిశాక సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు. పెనుబల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద ఆయనను కొత్తగూడెం వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో నడుము వద్ద తీవ్రగాయాలయ్యాయి. దీంతో వంశీని కానిస్టేబుళ్లు రాజమల్లు, పుల్లయ్య, డ్రైవర్ వీర రాఘవులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. -
జమలాపురంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈసందర్భంగా యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, పలువురు అర్చకులు మహా పూర్ణాహుతి నిర్వహించి ధ్వజపతాకాన్ని అవతనం చేశారు. ఆతర్వాత ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం జరిపించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత గుదే వెంకటేశ్వరరావు దంపతులు, సూపరింటెండెంట్ విజయకుమారి, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ముత్తారంలో పట్టాభిషేకం ముదిగొండ: ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీ సీతారామంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం 7గంటలకే ప్రత్యేక పూజలు మొదలుపెట్టగా, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు ఆధ్వర్యాన పట్టాభిషేకం ముగిశాక తిరువీధి సేవ నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకటనాగేశ్వరరావు, స్థలదాత కంకిపాటి హన్మంతరావు, ఆలయ చైర్మన్ తుళ్లూరి జీవన్, పాలకమండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.శ్రీ వారికి చక్రస్నానం, మహా పూర్ణాహుతి -
‘సహజీవనం’ జంట ఘర్షణ
ఖమ్మంఅర్బన్: భార్యాపిల్లలకు దూరంగా ఆయన, భర్తను వదిలేసిన ఈమె ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందో తెలియదు కానీ సదరు మహిళ చేతిలో ఆ వ్యక్తి హతమయ్యాడు. ఖమ్మం నేతాజీనగర్‌లో ఆదివా రం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా చింతలపుడి మండలం ప్రగడవరానికి చెందిన కోసన రవిప్రసాద్(53)కు భార్య, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. అదే జిల్లా సూరంపాలెంకు చెందిన లావణ్యకు ఓ కుమారుడు ఉండగా భర్తతో విడిపోయి కొన్నాళ్లుగా రవితో సహజీవనం చేస్తోంది. ఏడాదిన్నర పాటు సత్తుపల్లిలో ఉన్న ఈ జంట ఐదు నెలల క్రితం ఖమ్మం నేతాజీనగర్‌కు మకాం మార్చారు. రవిప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, లావణ్య టైలరింగ్‌తో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా లావణ్యను రవిప్రసాద్ తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. దీంతో ఆమె రవిని నెట్టివేయగా తల వెనుకభాగం గోడను బలంగా తాకిందని సమాచారం. ఆపై బనీన్ను ఒడిసి పట్టుకోవడంతో మెడకు బిగుసుకుని ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కింద పడగానే 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తలవెనక భాగం, నుదుటన గాయాలు ఉండడంతో ఖమ్మం అర్బన్ పోలీసులు లావణ్యను అదుపులోకి తీసుకుని మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, లావణ్యే ఉరి వేసి రవిప్రసాద్‌ను హతమార్చిందని ఆయన కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. కాగా, ఘర్షణ జరిగే క్రమాన నెట్టేసరికి గోడకు తగిలాక రవి కింద పడ్డాడని, అంతకు మించి ఏమీ జరగలేదని లావణ్య పోలీసులకు వివరించినట్లు తెలిసింది.మహిళ చేతిలో వ్యక్తి హతం -
కాలేజీ ఇక యూనివర్సిటీ
● ‘గూడెం’ ఇంజనీరింగ్ కాలేజీ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ ● కాకతీయ యూనివర్సిటీ నుంచి విడిపోయి స్వయంప్రతిపత్తి ● త్వరలోనే ఖమ్మం పీజీ సెంటర్ కూడా ఇదే పరిధిలోకి?కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఈ కళాశాల దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉండగా 300ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు సీఎంకు వినతులు ఇవ్వగా ఆయన కృషి ఫలించినట్ట యింది. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లూ ఎర్త్ సైన్సెస్ కోర్సులు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. 2025–2026 విద్యాసంవత్సరం నుంచే యూనివర్సిటీ అంబాటులోకి రానుండడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి. పరిశోధనలకు అనువుగా.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాతావరణం కొంత వేరుగా ఉంటుంది. ఇక్కడ ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. యూనివర్సిటీ ఏర్పాటు, కొత్త కోర్సులు అందుబాటులోకి రానుండడంతో అలాంటి వాటిపై అధ్యయనం చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. సహజ వనరులకు నెలవైన కొత్తగూడెంలో యూనివర్సిటీ ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరవడంతో విద్యార్థులు, అధ్యాపకులు సోమవారం సంబురాలు జరుపుకున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం సింగరేణితో పాటు వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేయూ నుంచి విడిపోనున్న ఇంజనీరింగ్ కాలేజీ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో ఈ కాలేజీ కేయూ నుంచి విడిపోనుంది. 1978లో స్కూల్ ఆఫ్ మైన్స్‌గా ఓయూ పరిధి నుంచి కొత్తగూడెంలో పీజీ సెంటర్ ఏర్పాటైంది. తొలినాళ్లలో బీఈ మైనింగ్‌తో పాటు ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులు ఉండగా, కేయూ ఏర్పాటయ్యాక 1996లో ఈ పరిధిలోకి చేర్చి యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌గా మార్చారు. ఆ సమయాన ఈఈఈ, సీఎస్ఈ కోర్సులు, 2010లో ఐటీ, ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినా మధ్యలో ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు తొలగించారు. ఇప్పుడు కేయూ నుంచి విడిపోతున్నందున బోధన, బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు. ఇక కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో నియామకమైన అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ బిక్షాలు, డాక్టర్ వెంకటరమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రాధిక, డాక్టర్ సుమలత కేయూలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరి డిప్యూటేషన్లు రద్దు చేస్తారా, లేక ఆప్షన్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా, ఖమ్మంలోని కేయూ పీజీ సెంటర్‌ను సైతం కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలోకి బదలాయించే అవకాశముందని చర్చ జరుగుతోంది. -
సంఘాల నాయకులతో నేడు సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల తీరుతెన్నులను వివరించేందుకు మంగళవారం కుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటుచేస్తునట్లు బీసీడబ్ల్యూఓ జి.జ్యోతి తెలిపారు. కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో జరిగే సమావేశానికి బ్రాహ్మణ, కమ్మ, కరణం, రెడ్డి, వెలమ, వైశ్య, ఓబీసీ, బీసీ, ఎంబీసీ ఫెడరేషన్ సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు. ఎంఈఓ, ప్రిన్సిపాల్ సహా ముగ్గురికి షోకాజ్ నోటీసు వైరా: వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో మెనూ సక్రమంగా అమలుచేయడం లేదని తేలడంతో ప్రిన్సిపాల్, ఉద్యోగితో పాటు ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సాయంత్రం పాఠశాలను తనిఖీ చేయగా మెనూ పాటించడం లేదని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ గురుకులానికి చేరుకుని విచారణ చేపట్టారు. మెనూ ప్రకారం ఆదివారం నాన్‌వెజ్ అందించాల్సి ఉన్నా ఎందుకు సమకూర్చలేదని ఆరాతీయగా బర్డ్ ఫ్లూ భయంతో అందించలేదని ప్రిన్సిపాల్ రమ, ఏటీపీ రోహిణి బదులిచ్చారు. దీంతో వీరికే కాక పర్యవేక్షణ లోపం ఉన్న కారణంగా ఎంఈఓ కె.వెంకటేశ్వరరావుకు డీఈఓ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి ఖమ్మం సహకారనగర్: జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని సైన్స్ విద్యార్థులకు ఇస్తున్న ఉచిత ఎప్‌సెట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మం అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించిన ఆమె శిక్షణకు హాజరైన విద్యార్థులోతో మాట్లాడారు. డీఐఈఓ కె.రవిబాబు, కోఆర్డినేటర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రానికి స్థలం, భవన నిర్మాణం మధిర: మండలంలోని మహదేవపురానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ పుతుంబాక సుభాష్ తన తల్లిదండ్రులు రామసీతమ్మ – పురుషోత్తం పేరిట ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి ఐదు సెంట్ల స్థలం వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలం ఇవ్వడమే కాక ఆరోగ్య ఉపకేంద్ర భవనం తామే నిర్మించేలా సోమవారం భూమి పూజ చేశామని వెల్లడించారు. ‘పుతుంబాక రామసీతమ్మ పల్లె దవాఖానా’గా నిర్మించి ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, డాక్టర్ చావా భాస్కరరావు, డాక్టర్ వాసిరెడ్డి శివలింగ ప్రసాద్, పార్వతవర్ధిని, కర్నాటి రామారావు, మంతరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి వీసీలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి హన్మకొండ: ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం ఆయన 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను పరిశీలిస్తూ అంతరాయం ఎదురైతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడినా, ట్రిపింగ్, బ్రేక్డౌన్లు వచ్చినా త్వరగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, పంట కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీసుల మంజూరులో వేగం పెంచాలని, అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సీఎండీ ఆదేశించారు. నవమితో ఆర్టీసీకి ఆదాయం భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఈ నెల 6, 7వ తేదీల్లో జరిగిన శ్రీ రామనవమి, పట్టాభిషేకం సందర్భంగా ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో భద్రాచలం డిపోకు సుమారు రూ.9.5 లక్షల ఆదాయం పెరిగింది. సాధారణంగా భద్రాచలం డిపో పరిధిలో రోజూ 92 సర్వీసులు నడుపుతుండగా, రూ.23 లక్షల వరకు ఆదాయం వస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా 5న అదనంగా మరో 26 సర్వీసులు తిప్పగా రూ.3 లక్షల మేర ఆదాయం పెరిగింది. 6న అదనంగా 30 సర్వీసులు నడపగా రూ.4.50 లక్షలు, 7వ తేదీన అదనంగా 16 సర్వీసులు నడపగా రూ.2 లక్షల వరకు ఆదాయం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం
● అయోధ్యపురిగా మారిన మిథిలా స్టేడియం ● రాజదండం, రాజముద్రిక, రాజ ఖడ్గాలకు పూజలు ● సిరియపాదుక శ్రీ ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు ● పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మమంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పట్టాభిషేకానికి హాజరైన భక్తజనంరాజ లాంఛనాలతో పట్టాభిషేకం.. పట్టాభిషేక రాజ లాంఛనాల అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. ఆ తర్వాత రాజముద్రిక తొడిగారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలు ఉంచి, ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింపజేశారు. స్వర్ణ ఛత్రం నీడలో రాజముద్రిక, రాజదండం, రాజఖడ్గం ధరించిన తర్వాత పట్టాభిషేకం కార్యక్రమాన్ని రుత్విక్కులు ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపి చివరగా మంగళహారతి సమర్పించారు. మండప్రతయ ఆరాధన.. రుత్విక్కరణం తర్వాత పండితులు మండపత్రయ పూజలు ప్రారంభించారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేయడం ఈ మండపత్రయ ఆరాధన ప్రధాన ఉద్దేశం. పట్టాభిషేకం వేదిక దిగువ భాగాన మూడు కలశాలను ఏర్పాటు చేశారు. మధ్య కలశంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. ప్రధానంగా తూర్పున పూరీ, దక్షిణాన ధనుష్కోటీ, పశ్చిమాన ద్వారకకు చెందిన సముద్ర జలాలు అవాహన చేయగా ఆగ్నేయం నుంచి గంగా, నైరుతి నుంచి కృష్ణా, వాయువ్యం నుంచి గోదావరి, ఈశాన్యం నుంచి కావేరీ నదీ జలాలను ఆవాహన చేశారు. నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసిన కలశానికి కుడివైపున ఉన్న కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేశారు. ఇందులో తూర్పున హనుమ, పడమర లక్ష్మణ, ఉత్తరాన శతృఘ్నుడు, దక్షిణాన భరతుడు, ఆగ్నేయంలో అంగదుడు, వాయువ్యంలో సుగ్రీవుడు, ఈశాన్యంలో విభీషణుడు, నైరుతిలో జాంబవతుడిని ఆవాహన చేశారు. ఎడమవైపు కలశంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. పట్టాభిషేకం చేసే రాజముద్రికలో లక్ష్మీదేవిని, రాజదండంలో విశ్వక్సేనుడిని, చామరలో వైనతేయుడు, గరుత్మంతుడు, ఖడ్గంలో నందకుడు, స్వర్ణఛత్రంలో అనంతుడు, పాదుకల్లో ఆదిశేషుడు, దేవేరులు ధరించే ఆభరణాల్లో భూదేవిని ఆవాహన చేశారు. మండపత్రయ ఆరాధాన ముగిసిన తర్వాత శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి ఆనాటి శ్రీరాముడి పాలన విశిష్టతలను వివరించారు. ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి.. పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని సీతాసమేత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి భక్తుల కోలాహలం నడుమ ప్రధాన ఆలయం నుంచి ప్రత్యేక పల్లకీలో ఉదయం 10:17 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అర్చకులు మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం చేసేందుకు వీలుగా పండితులు రుత్విక్కులైన వశిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమలో ఆవాహన చేసుకున్నారు. హనుమంతుని మెడలో ముత్యాల దండ.. రామయ్య పట్టాభిషేకం అనంతరం రామయ్యకు ముత్యాల దండ ధరింప చేశారు. ఇదే దండను సీతాదేవి మెడలోనూ ధరింపచేశారు. చివరకు అదే దండను ఆంజనేయుడి మెడలో వేశారు. దీంతో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ముగియగా.. పట్టాభిషేకం అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు తాతగుడి సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు. రథస్థం రాఘవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అని బ్రహ్మ పురాణం చెబుతోందని, రథోత్సవంలో శ్రీ రాముడిని సేవించిన వారికి ముక్తి లభిస్తుందని అర్చకులు వివరించారు. సిరియ తిరువుడి పట్టాభిషేకం.. వాల్మీకి రామయాణంలో పట్టాభిషేకానికి ముందు రోజు శ్రీరాముడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తారు. దీంతో ముందుగా శ్రీరాముడి పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత రామయణ క్రమంలో సుగ్రీవుడికి, విభీషణుడికీ పట్టాభిషేకాలు జరిగాయి. ఆ తర్వాతే శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అయితే విష్ణువుకు అన్ని అవతారాల్లోనూ గరుత్మంతుడు సేవలు అందించగా రామావతారంలో మాత్రం హనుమంతుడు సేవ చేశాడు. దీంతో గరుత్మంతుడిని పెరియ తిరువుడిగా, హనుమంతుడిని సిరియ తిరువుడిగా కొలుస్తారు. శ్రీరాముడి పాదుకలతో మొదలైన పట్టాభిషేక మహోత్సవం సిరియ తిరువుడైన హనుమంతుడి పట్టాభిషేకంతో ముగిసింది. పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరఫున గవర్నర్ పట్టువస్త్రాలు అందించడం ఆనవాయితీ. ఈ క్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో హెలీకాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే అయోధ్యాపురికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ ఫిర్యాదులు పరిష్కరించండి
● ప్రతీ శుక్రవారం గ్రీవెన్స్ దరఖాస్తులపై సమీక్ష ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష ఉంటుందని, అధికారులు నివేదికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను ప్రజలకు వివరించాలే తప్ప పదేపదే తిప్పించుకోవద్దని సూచించారు. ప్రజావాణి ద్వారా వివిధ శాఖలకు 300పైగా దరఖాస్తులు పంపితే 151మాత్రమే పరిష్కారమయ్యాయని, సీపీఓ, డీఆర్డీఓ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల వద్ద ఎక్కువ పెండింగ్ ఉన్నందున దృష్టి సారించాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వాన
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సోమవారం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల మధ్యాహ్నం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కాగా.. సాయంత్రం తర్వాత ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన వారంతో పోలిస్తే సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగి అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో అత్యధికంగా 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ముదిగొండ మండలం పమ్మిలో 40.3, కొణిజర్లలో 40.2, వైరా, రఘునాథపాలెం, ఖమ్మం ఖానాపురం, మధిరలో 40.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రత ప్రభావం చూపింది. సాయంత్రం తర్వాత మార్పులు పలు ప్రాంతాల్లో వాతావరణంలో సాయంత్రం తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. సత్తుపల్లితో పాటు వైరా, వేంసూరు, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో వర్షం కురిసింది. వైరాలో 11.8, వేంసూరు 9, సత్తుపల్లి 7.8, ఎర్రుపాలెంలో 5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సత్తుపల్లిలో వడగళ్ల వాన కురవగా రైతులు ఆందోళన చెందారు. ఇక రాత్రి ఖమ్మంలోనూ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడా వర్షపు జల్లులు కురిశాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే, వర్షంతో వరి, మొక్కజొన్న కోతలు పూర్తిచేసిన రైతులే కాక మామిడి తోటల యజమానులు ఆందోళనకు గురయ్యారు. చల్లబడిన వాతావరణం సత్తుపల్లి/ఎర్రుపాలెం: సత్తుపల్లి మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులకు తోడు పలు చోట్ల వనగండ్ల వాన కురిసింది. దీంతో మామిడి కాయలు నేలరాలగా, వివిధ ప్రాంతాల్లో ధాన్యం, మిర్చి తడిసిపోయాయి. ఇక తీగలు తెగడం, లైన్లపై చెట్ల కొమ్మలు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా సిబ్బంది మరమ్మతుల్లో నిమగ్నమయ్యారు. కాగా, ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షం కురిసింది. కొన్నిచోట్ల మామిడికాయలు నేలరాలాయి. మిర్చి, ధాన్యం రైతులు పంట తడవకుండా పట్టాలు కప్పుకున్నారు. ఇక కేశిరెడ్డిపల్లిలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత కొన్నిచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వర్షం -
మోడల్ కెరీర్ సెంటర్లో రేపు జాబ్‌మేళా
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో ఈనెల 9వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప న శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. అపోలో ఫార్మా కంపెనీ బాధ్యులు పాల్గొని ఫార్మసిస్ట్, ట్రెనింగ్ ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో బుధవారం ఉదయం 10గంటలకల్లా హాజరుకావాలని సూచించారు. నేడు యూడీఐడీ శిబిరం ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్ల స్థానంలో యూనిక్ డిసేబులిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ)లు జారీ చేయనుండగా, మంగళవారం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటుచేశారు. ఈ కార్డులు జారీ చేయాలన్న ఆదేశాలతో కొంతకాలంగా సదరమ్ క్యాంపులు నిలిపివేశారు. ఈమేరకు తొలిసారి మంగళవారం ఏర్పాటుచేస్తున్న క్యాంప్‌లో 80 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహిస్తామని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ తెలి పారు. ఇందులో అర్హత సాధించిన వారికి కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి ఖమ్మంవైద్యవిభాగం: అనారోగ్యం దరిచేరవద్దంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, నిత్యం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవా లని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతా, శిశు సంరక్షణ కోసం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తూ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రమాదాల నుంచి తప్పించడం, నాణ్యమైన సేవలందించేందుకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ప్రతిన బూనాలని చెప్పారు. ఈసమావేశంలో వివిధ విభాగాల అధికారులు సైదులు, చందునాయక్, వి.సుబ్రహ్మణ్యం, దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ విద్యార్థికి మూడు పుస్తకాలు
వైరా: వేసవి సెలవుల్లో ప్రతీ విద్యార్థికి పాఠశాల నుండి మూడు పుస్తకాలు అందించాలని, తద్వారా సెలవుల్లోనూ చదువుపై ఆసక్తి తగ్గకుండా చూడొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అంతేకాక ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఇంగ్లిష్‌పై భయం తగ్గించి, భవిష్యత్ లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు. వైరాలోని ప్రభుత్వ ఉన్నత పాఠఽశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని పాఠశాలల్లో రీడింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆరో తరగతిలో విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠం చదివించగా, ఒకరు సరిగ్గా చదవకపోవడంతో ఇంగ్లిష్ అంటే భయం విడనాడాలని సూచించారు. అలాగే, క్రీడల్లో ఆసక్తి పెరిగేలా పాఠశాలలో క్రికెట్, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో హెచ్ఎంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, హెచ్ఎం మాధవరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. కెరీర్ గైడెన్స్‌పై అవగాహన ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 8వ తరగతి నుంచే కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి లైబ్రరీ, రీడింగ్ క్లబ్‌ల ఏర్పాటు, మా పాప – మా ఇంటి మణిదీపం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలపై సమీక్షించారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకునేలా కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే, సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లలో ఆడపిల్ల పుడితే వారితో కలిసి అధికారులు భోజనం చేయాలన్నారు. ఈసమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్డీఓ ఎన్.సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ అరుణ పాల్గొన్నారు. సెలవుల్లో చదువుకునేలా ప్రత్యేక దృష్టి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
చిన్నారుల పోషణపై ప్రత్యేక దృష్టి
కొణిజర్ల: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పోషకాహార లోపం ఎదురుకాకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూనే కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సూచించారు. కొణిజర్ల – 2, 4 అంగన్వాడీ కేంద్రాలను సోమవారం తనిఖీ చేసిన ఆమె పిల్లల బరువు, ఎత్తు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాలకు చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా చూడాలని తెలిపారు. సీడీపీఓ కమలప్రియ, ఉద్యోగులు కొమ్మినేని బాబు, కె.జ్యోతి, షాలిని తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ బండ.. భారం
● పెరిగిన గృహావసరాల సిలిండర్ ధరలు ● ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనంఖమ్మం సహకారనగర్: కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయంతో సామాన్యులపై భారం పడనుంది. సుమారు రెండేళ్ల తర్వాత ఒకేసారి గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ.50పెంచుతూ సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఈ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచే అమలవుతుందని కొందరు చెబుతున్నా... ఇంకొందరు డీలర్లు మాత్రం తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పడం గమనార్హం. 4లక్షలకు పైగా కనెక్షన్లు జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 33 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,20,713 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,14,988, డబుల్ సిలెండర్లు కనెక్షన్లు 1,03,876తో పాటు దీపం పథకం ద్వారా 78,456, సీఎస్ఆర్ పథకం కింద జారీ చేసిన 23,393 కనెక్షన్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రూ.834గా ఉన్న సిలిండర్ ధరను రూ.50పెంచడంతో రూ.884కు చేరుతుంది. ఇక రూ.1,929.50గా ఉన్న వాణిజ్య అవసరాల సిలిండర్ ధరలో లాంటి మార్పు చేయలేదు. నెలకు రూ.15కోట్లకు పైగా భారం పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. జిల్లాలోని 4లక్షల మందికి పైగా వినియోగదారుల్లో 3లక్షల మంది నెలకోసారి సిలిండర్ వినియోగించినా రూ.50చొప్పున రూ.15కోట్ల భారం అదనంగా పడడం ఖాయమని తెలుస్తోంది. కానీ డీలర్లు మాత్రం కొత్త ధర అమలుపై స్పష్టత ఇవ్వడం లేదు. కాగా, పెరిగిన ధరలకు అనుగుణంగా వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని కేంద్రప్రభుత్వం సవరిస్తుందని కొందరు చెబుతున్నారు. ఇక రాష్ట్రప్రభుత్వం రూ.500కే కొందరికి సిలిండర్ ఇస్తోంది. వీరి పరిస్థితి ఏమిటో కూడా స్పష్టత రావాల్సి ఉంది. -
పులకించిన భక్త గిరి
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ● అభిజిత్ లగ్నంలో ఒక్కటైన జానకిరాములు ● కల్యాణోత్సవానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ● 11.57 గంటలకు మండపం వద్దకు మఖ్యమంత్రి ● కల్యాణం అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనంకల్యాణ ఘట్టాలు ● ఉదయం 9:50 గంటలు : కల్యాణ మండపానికి దేవేరుల ఆగమనం ● 10:22 : విశ్వక్సేన పూజ ● 10:33 : పుణ్యావాచనం ● 10:49 : శ్రీయోద్వాహం ● 11:13 : యోక్త్రా బంధనం, యజ్ఞోపవీత ధారణ ● 11:17 : శ్రీరాముడికి పాద ప్రక్షాళన ● 11:19 : అలంకరణ ● 11:26 : మధుపర్క నివేదన ● 11:33 : మహా సంకల్పం ● 11: 46 : కన్యాదానం ● 11:57 : పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి ● మధ్యాహ్నం 12:01 గంటలు : అభిజిత్ లగ్నంలో వధూవరుల తలలపై జీలకర్ర బెల్లం ● 12:13 : మాంగళ్య ధారణ ● 12:22 : తలంబ్రాల వేడుక ● 12:36 : స్వామి, అమ్మవార్లకు హారతి సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు తన్మయత్వంతో వేడుకలను కనులారా వీక్షించి పులకించిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీ సమేతంగా వేడుకలకు హాజరై స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు మొదట గర్భగుడిలో మూలవిరాట్‌కు లఘు కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాక అభిజిత్ లగ్నంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచి పెళ్లి తంతు కొనసాగించారు. మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్యధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాల వేడుక, హారతి సమర్పణతో వివాహ తంతు ముగిసింది. చివరగా సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు. లగ్నానికి కొంచెం ముందుగా.. షెడ్యూల్ టైం ప్రకారం ఉదయం 10:45 గంటలకు భద్రాచలం ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకోవాలి, అక్కడ పూజా కార్యక్రమాలు చూసుకుని ఉదయం 11:10 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ ఆయన ఆలయానికి చేరుకునేసరికే ఉదయం 11:32 గంటలైంది. దీంతో అభిజిత్ లగ్నం సమయానికి సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణ మండపానికి చేరుకుని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తారా అనే సందేహాం ఏర్పడింది. సాధారణంగా సీతారాముల వివాహ తంతులో అలంకరణలు, మధుపర్కం నివేదించిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు. మధుపర్కం కార్యక్రమం ముగిసినప్పటికీ సీఎం కల్యాణ మండపానికి చేరుకోకపోవడంతో ఆ తర్వాత ఘట్టమైన కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అర్చకులు ప్రారంభించారు. ఈ క్రమంలో అభిజిత్ లగ్నానికి మూడు నిమిషాల ముందు.. అంటే 11:57 గంటలకు రేవంత్‌రెడ్డి కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. వెంటనే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఘట్టం ముగియగానే అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12:01గంటల సమయంలో వధూవరులైన సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. ఆ తర్వాత ఇతర మంత్రులు, శ్రీరామదాసు, తూమూ నర్సింహదా సు వంశీయులు, త్రిదండి పీఠం, టీటీడీ తరఫున, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వస్త్రాలు సమర్పించారు.ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసే కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మ గుడి దగ్గరున్న నాయక్‌పోడు తెగకు చెందిన బూరం శ్రీనివాస్ ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. ఇంటి ముందు కారు దిగి అక్కడున్న ప్రజలకు అభివాదం, దగ్గరగా ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ లోపలికి వెళ్లారు. శ్రీనివాస్ తల్లి పద్మావతి సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురెళ్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. అప్పటికే సీఎం రాక సందర్భంగా ‘ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దు. రోజు మీ ఇంట్లో ఎలా వంటలు చేస్తారో.. ఎలా తింటారో అవే ఏర్పాట్లు ఉండాలి’ అని జిల్లా అధికారులు సూచించడంతో రెండు గదులు ఉన్న ఆ ఇంట్లో మొదటి గదిలో సీఎం భోజనం చేసేందుకు చాప పరిచారు. మునక్కాయ కూర.. గోంగూర చట్నీ భోజనానికి సీఎం రేవంత్‌రెడ్డి కూర్చున్న వరుసలో బూరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీఎస్ శాంతికుమారి కూర్చోగా ఎదురు వరుసలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కూర్చున్నారు. మంత్రి తుమ్మల భోజనం వడ్డింపు ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో భాగంగా నిల్చునే ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు రోజువారీగా ఉపయోగించే స్టీలు పళ్లెంలో సన్నబియ్యంతో చేసిన అన్నం, పులిహోర, పాయసం, గోంగూర చట్నీ, మునక్కాయ, దోసకాయ, టమాటా కూరలను వడ్డించారు. వీటితో పాటు మజ్జిగ, పెరుగు, పానకం కూడా సిద్ధం చేశారు. ఖమ్మం వంటలు బాగుంటాయి వడ్డింపు మొదలు పెట్టగానే ‘ఖమ్మం వంటలు బాగుంటాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటి ముద్ద తింటూనే.. ‘ఇంతకుముందు తుమ్మలనే ఈ వంటలు నాకు పరిచయం చేశారు’ అని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. భోజనం చేస్తూ మధ్యమధ్యలో ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు ఉచిత బస్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ పథకాలు ఎలా ఉన్నాయంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను సీఎం అడిగారు. పెరుగుతో భోజనం పూర్తి చేశారు. అంతకు ముందే రేవంత్‌రెడ్డికి వడ్డించే భోజనాన్ని ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు (టెస్ట్ అండ్ టే్స్ట్) పరిశీలించారు. వీళ్లకు ఉద్యోగం చూడండి.. భోజనం పూర్తయిన తర్వాత శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి సాయం చేయాలంటూ సీఎంను పద్మావతి కోరారు. దీంతో వారికి అవసరమైన సాయం చేయాలంటూ కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చివరగా శ్రీనివాస్ తల్లిదండ్రులు శంకర్రావు, పద్మావతికి రేవంత్‌రెడ్డి వస్త్రాలు అందజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:21 గంటల వరకు మొత్తంగా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పాటు సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటన కొనసాగింది. -
సన్నాలు పక్కదారి పట్టకుండా..
● బియ్యం పంపిణీపై అధికార యంత్రాంగం నిఘా ● షాపుల్లో రోజువారీ తనిఖీ, నివేదికలుఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి రేషన్‌షాపుల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. జిల్లాలో 748 రేషన్ దుకాణాలు ఉండగా, 4.10,988 కార్డులకు గాను 11,48,031మంది లబ్ధిదారులకు బియ్యం అందజేయాల్సి ఉంది. ఇందుకోసం 7,200మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే షాప్‌లకు చేరవేశారు. అయితే, ఇన్నాళ్లు దొడ్డుబియ్యం కావడంతో షాపులకు రాని వారు కూడా సన్నబియ్యం తీసుకునేందుకు బారులు దీరుతున్నారు. ఈనేపథ్యాన ఎక్కడా బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నిఘా పెంచారు. ప్రతీరోజు తనిఖీలు ఎక్కడ కూడా సన్నబియ్యం పక్కదారి పట్టొదన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రోజువారీగా రేషన్ షాప్‌ల్లో తనిఖీ చేస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ స్వయంగా పలు షాపులను పరిశీలిస్తుండగా, సివిల్ సప్లయీస్ డీటీలతోపాటు తహసీల్దార్లు సైతం తమ పరిధిలోని షాప్‌లను సందర్శిస్తున్నారు. గతంలో మాదిరి ఎవరైనా బియ్యం తీసుకోకపోతే డీలర్లు ఇతరులకు అధిక ధరతో అమ్ముకునే అవకాశం ఏర్పడుతుందనే భావనతో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. షాప్‌కు కేటాయించిన బియ్యం, రోజువారీ పంపిణీ, మిగిలిన స్టాక్ వివరాలు నమోదు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు సమాచారం. దందాకు చెక్‌పెట్టేలా.. గతంలో అక్రమార్కులతో కలిసి కొందరు డీలర్లు చేతులు కలిపి దొడ్డు బియ్యం చేరవేసేవారు. అంతేకాక ఎవరైనా కార్డుదారులు బియ్యం వద్దంటే వారికి డబ్బు ఇస్తూ ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించడం చోటు చేసుకుంది. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యాన అలా జరగకుండా దందాకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉద్యోగులు ముమ్మరంగా తనిఖీలు చేపడు తూ నిఘాను పటిష్టం చేశారు.బియ్యంలో తరుగు నేలకొండపల్లి: పేదలకు ప్రభుత్వం రేషన్‌షాప్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో అక్కడక్కడా తరుగు వస్తోంది. ఇన్నాళ్లు దొడ్డుబియ్యం కావడంతో ఎంత ఇచ్చినా పట్టించుకోని లబ్ధిదారులు.. ఇప్పుడు మాత్రం డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమకు గోదాం నుంచే తరుగుతో వస్తున్నాయని, కాంటా కూడా వేయడం లేదని డీలర్లు వాపోతుండడం గమనార్హం. ఇటీవల నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కార్డుదారులు బియ్యం తీసుకుని మరోచోట కాంటా వేయించారు. ఇందులో ఓ కార్డుదారుడికి 18 కిలోలకు గాను అర కేజీ తక్కువగా వచ్చాయి. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉండడంతో డీలర్లను నిలదీస్తున్నారు. కానీ తమకు బియ్యం కేటాయించే క్రమాన మండల స్థాయి స్టాక్ పాయింట్ వద్ద కాంటా వేయడం లేదని.. చేసేదేం లేక తాము తక్కువగా ఇస్తున్నామని డీలర్లు వాపోతున్నారు. ఈ విషయమై నేలకొండపల్లి తహసీల్దార్ జె.మాణిక్రావ్ను వివరణ కోరగా... కారణాలు ఏమైనా కార్డుదారులకు ఇచ్చే బియ్యంలో గింజ కూడా తగ్గొద్దని, అలా జరిగితే డీలర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాక గోదాంల వద్ద బియ్యం బస్తాలు కాంటా వేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..దుకాణాలు తనిఖీ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఈక్రమంలో ఎక్కడా బియ్యం పక్కదారి పట్టకుండా తనిఖీలు చేస్తున్నాం. షాపుల్లో పరిశీలిస్తూ స్టాక్ వివరాలు నమోదు చేయించడమే కాక ప్రతిరోజు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు పంపిస్తున్నాం. – చందన్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, ఖమ్మం -
జిల్లా జైలులో జైళ్లశాఖ డీజీ తనిఖీ
ఖమ్మంరూరల్: రూరల్ మండలం రామన్నపేటలోని జిల్లా జైలును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఖైదీలతో మాట్లాడి మెనూ, వైద్య సదుపాయం, న్యాయ సాయం అందుతోందా అని ఆరా తీశారు. అలాగే, లైబ్రరీ, వంటగది, ఆస్పత్రిని తనిఖీ చేసిన ఆమె జైలు ఆవరణలో బీరువాలు, బెంచీలు, ఫినాయిల్ తయారీ వివరాలు తెలుసుకున్నారు. తయారీ, అమ్మకం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.సంపత్, జైలు సూపరింటెండెంట్ ఏ.శ్రీధర్, జైలర్లు ఎ.సక్రు, జి.లక్ష్మీనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు. -
విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా బోధన
వైరా: ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల లక్ష్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. భద్రాచలంలో కల్యాణానికి హాజరైన డిప్యూటీ సీఎం హైదరాబాద్ వెళ్తూ తన స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం వచ్చారు. అక్కడ భట్టి విక్రమార్క – నందిని దంపతులు గ్రామంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశాక అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆతర్వాత ఇటీవల గ్రూప్–1లో ర్యాంకు సాధించిన వైరాకు చెందిన సంగెపు లక్ష్మీ సాహితిని భట్టి సన్మానించారు. అనంతరం వైరాకు వచ్చిన డిప్యూటీ సీఎం తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఇదే ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యాన స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆతర్వాత ఆయన అరుగుపై కూర్చుని విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మెనూ సక్రమంగా అమలవుతోందా, రాత్రివేళ కేర్ టేకర్లు ఉంటున్నారా అని తీస్తూ వివరాలు సేకరించారు. ఆపై డైనింగ్ హాల్‌కు వెళ్లి మెనూ చార్జ్ ఆధారంగా ఏమేం వండారో తెలుసుకున్న భట్టి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కాగా, డిప్యూటీ సీఎం వచ్చిన సమయాన పాఠశాల ప్రిన్సిపాల్ రమ లేకపోవడంతో ఇన్చార్జ్ వార్డెన్ వివరాలు వెల్లడించింది. అంతకు ముందు వైరాలో 100 పడకల అస్పత్రి భవన నిర్మాణ స్థలాన్ని కూడా డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈకార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఏసీపీ ఎం.ఏ.రెహమాన్‌తో పాటు నూతి సత్యనారాయణ, శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డపుల్లయ్య, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఏదునూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
కోడి కోయలేం.. తినలేం..!
● బర్డ్‌ఫ్లూ తర్వాత అమాంతం పెరిగిన ధర ● లభ్యత లేకపోవడమే కారణమంటున్న వ్యాపారులు ● కిలో చికెన్ ధర రూ.280 పైమాటే... ఇష్టమున్నా దూరమయ్యాం.. మా ఇంట్లో చికెన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ బర్డ్‌ఫ్లూ భయంతో వండడం మానే శాం. రంజాన్ సమయంలో వాడకం మొదలుపెట్టినా ఇప్పుడు ధర పెరిగింది. బర్డ్‌ఫ్లూ ప్రచారం జరిగినప్పుడు ఫంక్షన్లలోనూ చికెన్ వంటకాలు తగ్గాయి. – ఎం.డీ.ఆబీద్, సత్తుపల్లి మూడు నెలలు నష్టపోయాం.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో అమ్మకాలు లేకున్నా మూడు నెలల పాటు అద్దె, జీతాలు చెల్లించడంతో రూ.2.50 లక్షల మేర నష్టం వచ్చింది. ఇప్పుడు చికెన్ ధరలు పెరిగి వ్యాపారం సాగడం లేదు. ఆదివారాల్లోనే ఓ మోస్తరు వ్యాపారం ఉంటోంది. – ఎస్.కే.ఖాసీం, చికెన్ వ్యాపారి, సత్తుపల్లిసత్తుపల్లి: కోడిని చూడగలం కానీ కోయలేము.. తినలేము అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. చికెన్ ధరలు అమాంతం పెరగడమే ఇందుకు కారణమవుతోంది. జనవరి నెలలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ప్రచారంతో చికెన్ తినడానికి జనం విముఖత కనబరిచారు. ఆ సమయాన చికెన్ కేజీ ధర రూ.140 నుంచి రూ.160 పలకగా.. ఫిబ్రవరిలో కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు మేళాలు నిర్వహిస్తే అక్కడకు పెద్దసంఖ్యలో జనం హాజరైనా కొనుగోలు మాత్రం ముందు రాలేదు. ఇక మార్చిలో రంజాన్ మాసం ప్రారంభమయ్యాక చికెన్ అమ్మకాలు కొద్దికొద్దిగా పెరగడం మొదలైంది. ఆ నెలంతా స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.220 నుంచి రూ.240 వరకు పలకగా.. ఈనెలలో మాత్రం రూ.280 నుంచి రూ.300వరకు పలుకుతుండడం గమనార్హం. దీంతో బర్డ్ ఫ్లూ భయం పోయినా ధర మాత్రం బెంబేలెత్తిస్తున్నట్లవుతోంది. కొందరే పెంచడంతో... బర్డ్‌ఫ్లూకు తోడు రకరకాల కారణాలతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో అమ్మకాలు లేక పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు కోళ్లు పెంచేందుకు వెనుకడుగు వేశారు. ఫలితంగా కొన్ని హెచరిస్ కంపెనీల నిర్వాహకులు మాత్రమే కోళ్లు పెంచారు. ఇప్పుడు తినడానికి జనం ఆసక్తి చూపిస్తున్నా.. కోళ్ల లభ్యత లేకపోవడంతో ధర పెరుగుతోంది. లైవ్ కోడి కేజీ ధర రూ.150 నుంచి రూ.160 పడుతున్నందున తాము ధర పెంచి అమ్మకం తప్పడం లేదని సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మటన్ రూ.వెయ్యి.. రెండు నెలల క్రితం బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో జనం చికెన్ తినకుండా మటన్, చేపల వైపు దృష్టి సారించారు. తద్వారా డిమాండ్ పెరగడంతో రూ.900వరకు ఉన్న మటన్ కేజీ ధర రూ.వెయ్యికి పెంచారు. అలాగే, తెల్ల చేపలు(లైవ్) కూడా కేజీ రూ.200 ధర పలికాయి. ఇప్పుడు చికెన్ ధర కూడా రూ.300 మార్క్‌కు చేరుతుండడంతో అది తినలేక.. మటన్ కొనలేక మాంసం ప్రియుల్లో ఆవేదన వ్యక్తవుతోంది. కాగా, కోళ్ల లభ్యత పెరిగాక మరో చికెన్ ధర తగ్గే అవకాశముందని సెంటర్ల నిర్వాహకుల ద్వారా తెలిసింది. -
సీపీఎం రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ మృతి
● మధురైలో గుండెపోటుతో హఠాన్మరణం ● నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నాయకులు ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్(62) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. మధురైలో జరుగుతున్న పార్టీ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు జిల్లా నాయకులతో కలిసి ఆయన వెళ్లారు. ఈక్రమాన శనివారం గుండెపోటు రావడంతో మధురైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కొనసాగుతుండగానే ఆదివారం మరోమారు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. కాగా, శ్రీకాంత్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన భార్య సుకన్య ఐద్వా నాయకురాలిగా కొనసాగుతుండగా, రెండు సార్లు ఖమ్మం కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. పార్టీలు, సంఘాల నేతల సంతాపం శ్రీకాంత్ మృతి చెందినట్లు తెలియగానే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.సుదర్శన్్రావు తదితరులు మధురైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు ఎం.సాయిబాబు, జూలకంటి రంగారెడ్డి, జ్యోతి, బండారు రవికుమార్, పాలడుగు భాస్కర్, ఎం.డీ.జహంగీర్, డీ.జీ.నర్సింహారావు, భారతి, సుధాకర్‌రెడ్డి తదితరులతో పాటు వివిధ జిల్లాల నాయకులు సైతం నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కాగా, శ్రీకాంత్ మృతిపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు. కార్మిక కుటుంబంలో జన్మించి.. ఖమ్మంలోని సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించిన యర్రా శ్రీకాంత్ విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ ద్వారా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1980లో సీపీఎంలో చేరి 1991నుండి పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నారు. 2019లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తొలిసారి ఎన్నికై న ఆయన 2021, 2025లో జరిగిన రాష్ట్ర మహాసభల్లోనూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు అసంఘటితరంగ కార్మికులు 1,300 మందిని సమీకరించి ఉద్యమించిన శ్రీకాంత్ వారికి పీఎఫ్, ఇతర సౌకర్యాలు సాధించారు. 2000లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్మికుల తరఫున పోరాడమే కాక మార్కెట్ తరలింపును ఆపాలని ఉద్యమించారు. పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాల సాధనకు పదేళ్ల పాటు జరిగిన పోరాటంలో కీలకంగా వ్యవహరించి వెంకటగిరి, కోటనారాయణపురం, సత్యనారాయణపురం తదిత ర ప్రాంతాల్లో స్థలాలు, ఇళ్లు ఇప్పించారు. విద్యుత్ పోరాటంలో జైలు జీవితం కూడా గడిపారు. ఎంపీ పరామర్శ గుండెపోటుతో మధురైలో మృతి చెందిన ఎర్రా శ్రీకాంత్ కుటుంబీకులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఆయన వెంట కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, తోట వీరభద్రం, మాజీ కౌన్సిలర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
కుండలు సరే.. తాగునీరు ఏదీ?
● కేఎంసీ పరిధిలోని అన్ని డివిజనల్లో ఇదే పరిస్థితి ● కొన్నిచోట్ల మాయమవుతున్న కుండలు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఖమ్మం వస్తంటారు. ఎండల నేపథ్యాన వీరి దాహార్తి తీర్చేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. లక్ష్యం మాత్రం చేరే పరిస్థితి కానరావడం లేదు. చలివేంద్రాల్లో మట్టికుండలు ఏర్పాటుచేసి వారం గడుస్తున్నా ఇప్పటి వరకు తాగునీరు నింపకపోవడం గమనార్హం. అయితే, కార్పొరేటర్ల చేతుల మీదుగా ప్రారంభించాలనే భావనతో వేచి ఉన్నారని, అందుకే నీరు నింపడం లేదనే చర్చ జరుగుతోంది. 76 కేంద్రాల్లో ఏర్పాటు ఖమ్మంలోని 60 డివిజన్ల పరిధిలో రద్దీ ఉండే 76 ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ బాధ్యత ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు తెలిసింది. సదరు కాంట్రాక్టర్ అధికారులు చూపించిన ప్రాంతాల్లో చిన్న గుడిసె వేసి నాలుగు చొప్పున కుండలు ఏర్పాటు చేయడమే కాక ప్లాస్టిక్ గ్లాసులు పెట్టారు. ఆపై కుండల్లో రోజూ నీరు నింపే బాధ్యతను లైన్మెన్లకు అప్పగించినట్లు తెలిసింది. కానీ ఇప్పటివరకు ఎక్కడా నీరు నింపకపవడంతో చలివేంద్రం ఉంది కదా అని ఆశగా వచ్చిన వారు నిరాశగా వెనుదిరగక తప్పడం లేదు. ఇక కొన్నిచోట్ల ఒక్కో కుండ మాయమవుతూ నాలుగుకు బదులు రెండు, మూడు కుండలే కనిపిస్తున్నాయి. భారీగా ఖర్చు.. కేఎంసీలో ఏ పని చేసినా.. నాలుగింతలు లాభం ఉండేలా అధికారులు అంచనాలు రూపొందించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చలివేంద్రాల ఏర్పాటులో ఖర్చు భారీగా చూపించేలా బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నాలుగు తడికలు, ఒక షేడ్ నెట్, నాలుగు కర్రలు, నాలుగు కుండలతో ఏర్పాటు చేసిన ఒక్కో చలివేంద్రానికి రూ.15 వేల నుండి రూ.18,750 వరకు ఖర్చయిందని బిల్లుల్లో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా చలివేంద్రాల ఏర్పాటు పేరుతో సుమారు రూ.14 లక్షలకు పైగా బిల్లులు సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతుంది. ఈ అంశంపై కేఎంసీ అధికారులను వివరణ కోరగా.. రెండు రోజుల్లో కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చి చలివేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. కుండల్లో నీరు బాధ్యత లైన్మెన్లకు అప్పగించామని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. -
రిటైర్మెంట్ ఫలితం అందక మనోవేదన
ఖమ్మం సహకారనగర్: విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక మనోవేదనకు గురవుతున్నారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కూరపాటి పాండురంగయ్య మృతిపై వారు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన జూలైలో ఉద్యోగ విరమణ చేసినా నేటికీ రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక మానసికంగా ఇబ్బంది పడ్డారని, అనారోగ్యానికి గురైనా వైద్యం చేయించుకోలేకపోయారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు బెనిఫిట్లు మంజూరు చేయాలని కోరారు. 108లో గర్భిణికి ప్రసవం పెనుబల్లి: ఆస్పత్రికి తరలిస్తున్న గర్భిణి మార్గమధ్యలోనే పురిటినొప్పులు పెరగడంలో 108 వాహనంలో ప్రసవించింది. మండలంలోని తాళ్లపెంట గ్రామానికి చెందిన డి.సుక్కీ పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వాహనంతో వచ్చిన సిబ్బంది ఆమెను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే సుక్కీకి నొప్పుల తీవ్రత పెరగడంతో సిబ్బంది ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగానే ఉండగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ధాన్యం కొనుగోళ్లు పరిశీలించిన డీఎస్ఓ కూసుమంచి/ముదిగొండ: కూసుమంచి, ముదిగొండ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) చందన్‌కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. కూసుమంచి మండలం పాలేరుతో పాటు ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీ చేసిన ఆయన ఇప్పటివరకు చేపట్టిన కొనుగోళ్లపై నిర్వాహకులను ఆరా తీశారు. అలాగే, రైతులతో మాట్లాడి ధాన్యం తేమ శాతం నిర్ధారణ, గన్నీ బ్యాగ్‌ల కేటాయింపు, రవాణాలో సమస్యలు ఎదురవుతున్నాయా అని తెలుసుకున్నారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యాన కేంద్రాల వద్ద టెంట్ వేయించడమేకాక తాగునీరు అందుబాటులో ఉంచాలని, రైతులకు కుర్చీలు వేయించాలని సెంటర్ల ఇన్చార్జిలకు సూచించారు. ఎన్నెస్పీ కాల్వలో పడి వ్యక్తి మృతి తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంకు చెందిన వ్యక్తి ఎన్నెస్పీ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో కాలు జారి పడగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు... అన్నారుగూడెంకు చెందిన కటుకూరి జయరాజు(58) ఈనెల 4న గోపాలపేట సమీపాన పొలంలో పనికి వెళ్లాడు. మధ్యాహ్నం తాగునీటి కోసం గొడ్ల బ్రిడ్జి వద్ద కాలువలోకి దిగగా, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కాలు జారి పడి కొట్టుకుపోయాడు. కుటుంబీకులు, పోలీసులు గాలిస్తుండగా ఆదివారం ఉదయం లోకవరం సమీపాన ఆయన మృతదేహం లభ్యమైంది. ఈమేరకు జయరాజు కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుబాబుల్ లోడింగ్‌కు వచ్చిన లారీ డ్రైవర్ మృతి ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపాన వే బ్రిడ్జి వద్ద ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చౌటిగూడెంకు చెందిన లారీ డ్రైవర్ కొంపల్లి వెంకటేశ్వరరావు(56) శనివారం సుబాబుల్ కర్ర లోడింగ్‌కు వచ్చాడు. ఆయన లారీలో వ్రిశ్రాంతి తీసుకుంటూ మృత్యువాత పడ్డాడు. వే బ్రిడ్జి నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ఆర్కే ఫౌండేషన్ బాధ్యుల సాయంతో మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుండెపోటుతో గ్రానైట్ కార్మికుడు... ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి క్రాస్ వద్ద ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కటింగ్ ఆపరేటర్ కనపర్తి లక్ష్మయ్య(55) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన లక్ష్మయ్య పనిలో ఉండగా, మధ్యాహ్నం కళ్లు తిరిగి కింద పడడంతో సహచరులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో లక్ష్మయ్య కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
వైభవంగా జానకిరాముల కల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని వకుళామాత స్టేడియంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత యాగశాల నుంచి కల్యాణమూర్తులను పల్లకీలో మండపానికి తోడ్కోని రాగా.. పూజల అనంతరం భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం నుండి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి దంపతులు సమర్పించారు. ఆతర్వాత ముఖ్య అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ దంపతుల నేతృత్వాన పురాణం రవికుమార్‌శర్మ కల్యాణక్రతువు నిర్వహించగా వ్యాఖ్యాతగా ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ వ్యవహరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన మధ్యాహ్నం 12గంటల వరకు కల్యాణం పూర్తిచేశారు. ఆతర్వాత భక్తులకు అన్నదానం ఏర్పాటుచేయడమే కాక స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులను హనుమఽత్ వాహనంపై ఊరేగింపు చేశారు. అలాగే, వెంకటాపురంలోని శ్రీవారి దత్తత దేవాలయంలో కూడా సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ ఉప్పల కృష్ణమోహన్‌శర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. సాయంసంధ్యా సమయాన... ముదిగొండ: ముదిగొండ మండలం ముత్తారంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణాన్ని ఆదివారం సాయంసంధ్యా సమయాన నిర్వహించారు. దేశమంతటా శ్రీరాముడి కల్యాణం ఉదయం నిర్వహిస్తే.. వంద ఏళ్లుగా ఇక్కడ సాయంత్రం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకటనాగేశ్వరరావు తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆతర్వాత ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు, శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యాన కల్యాణక్రతువు నిర్వహించారు. ఈ పూజల్లో వనం వెంకటనాగేశ్వరరావు, పరుచూరి ప్రసాదరావు, ఆలయ చైర్మన్ తుళ్లూరి జీవన్, ఈఓ సమత, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు అమ్మయ్య, తిరపయ్య, వీరభద్రం, శ్రీనివాసరావు, మోహన్‌రావు, మమత, అజయ్, నాగయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.జమలాపురానికి వేలాదిగా హాజరైన భక్తులు -
బీజేపీ బలోపేతానికి కృషి
ఖమ్మం మామిళ్లగూడెం/ఖమ్మం అర్బన్: జిల్లాలో బీజేపీ బలోపేతానికి విస్తృత కృషి జరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని కార్యాలయంతో పాటు 9వ డివిజన్ రోటరీనగర్‌లో ఆదివారం ఆయన పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఈనేపథ్యాన ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, అల్లిక అంజయ్య, శ్యాంరాథోడ్, రవీందర్రావు, సుధాకర్, కుమిలి శ్రీనివాసరావు, నీలిమ, సీతారాములు, నరేందర్, హుస్సేన్, రాము తదితరులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో... ఖమ్మంరూరల్/నేలకొండపల్లి: పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ పతాకాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు జాతీయ వాదం, దేశ సమగ్రత, అట్టడుగు వర్గాలకు న్యాయమే లక్ష్యంగా కృషి జరుగుతోందని తెలిపారు. ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ బోర్డు సవరణ బిల్లుతో పేద ముస్లింలకు లబ్ధి జరుగుతుందనే విషయమై పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని సూచించారు. బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు పాగర్తి సుధాకర్, చావా కిరణ్, బానియా నాయక్, రామయ్య, వెంకట్, వెంకన్న, అనంతు ఉపేందర్ గౌడ్, సంతోష్‌రెడ్డి, షేక్ షర్పొద్దీన్, గెల్లా చక్రపాణి, సయ్యద్ మోహినుద్దీన్, మూడ్ రమేష్, ఎలిగేటి గిరి, కందరబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. -
మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలి
● మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి ● జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మంమయూరిసెంటర్ : మనం ఆశించే మార్పు ఇంటి నుంచే ప్రారంభించాలనే సూక్తిని బాబు జగ్జీవన్ రామ్ పాటించారని, తన కుమార్తెను ఉన్నత విద్య చదివించారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందేందుకే ప్రభుత్వం జయంతి వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు. జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు, పెద్దలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడా రని అన్నారు. ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే రోజుల్లోనే తన కుమార్తెను సివిల్ సర్వీస్ వరకు చదివించారని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ బాటలో పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. అంతకుముందు ఎన్టీఆర్ సర్కిల్లోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి కలెక్టర్‌తో పాటు ఉత్సవ కమిటీ బాధ్యులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ, ఈడీ నవీన్‌బాబు, డీఎంహెచ్ఓ కళావతి బాయి, జయంతోత్సవ కమిటీ కన్వీనర్ జమళ్లముడి దాస్ మహారాజ్, అధ్యక్షుడు కొర్లపాటి చిరంజీవి, గౌరవాధ్యక్షుడు జాకబ్ ప్రతాప్, ఇటికల లత పాల్గొన్నారు. లక్ష్యసాధనకు కృషి చేయాలి పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాయుతంగా కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బైసాస్ రోడ్‌లోని జలగం వెంగళరావు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్–డీ, న్యాయ విభాగం, జూనియర్ లెక్చరర్, ఆర్ఆర్బీ, ఐడీబీసీ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఆయన మాట్లాడారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నా రు, ఎలాంటి పుస్తకాలు కావాలి, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వాటర్ కూలర్లు, స్టడీ చైర్లు ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్డేటెడ్ పుస్తకాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత పాల్గొన్నారు. -
క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన యువకుడు హఠాన్మరణం రఘునాథపాలెం: క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని కోటపాడుకు చెందిన కాముని సామేలు, విజయలక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు వినయ్ (22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీలోనే మిత్రులతో కలిసి మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి మిత్రులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. గుండెపోటుతో యువకుడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. కాగా, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదివేందుకు అసరమైన పరీక్షలు రాసి, సిద్ధమవుతున్న తరుణంలో వినయ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏకై క సంతానం మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
బస్సు ఢీకొని మహిళ మృతి
పెనుబల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని వీఎం బంజర్ రింగ్‌సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. వీఎం బంజర్ రింగ్‌సెంటర్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను సత్తుపల్లి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహిళను మండలంలోని పాతకారాయిగూడెం గ్రామానికి చెందిన బాణోతు మారోణి (50)గా గుర్తించి.. పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు. -
తొమ్మిదేళ్ల తర్వాత..
సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రాక ● సీఎం రేవంత్‌రెడ్డితోపాటు హాజరుకానున్న పలువురు మంత్రులు ● సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం భద్రాచలం: నేడు భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భద్రాచలం సమీపంలోని టోబాకో బోర్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని పది నిమిషాలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని మిథిలా స్టేడియానికి చేరుకుని కల్యాణ వేడుకల్లో భాగం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కాగా 2016లో సీఎం హోదాలో చివరిసారిగా కేసీఆర్ ఈ సంప్రదాయం పాటించారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన హాజరుకాలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత సీఎం హోదాలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు రేవంత్‌రెడ్డి ఆదివారం వస్తున్నారు. వీఐపీల తాకిడి గతేడాది నవమి వేడుకల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ వర్తించలేదు. కొందరు ఎమ్మెల్యేలు సాధారణ భక్తుల్లాగే వేడుకలకు హాజరయ్యారు. కానీ, ఈసారి ఉత్సవాలకు వీఐపీల తాకిడి పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రానుండటంతో వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు కిక్కిరిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ దాతల కోటా కింద జారీ చేసే టికెట్లను కూడా తగ్గించారు. సన్నబియ్యంతో భోజనం రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యంతో వండిన అన్నంతో మధ్యాహ్న భోజనం సీఎం రేవంత్‌రెడ్డి చేయనున్నారు. ఇందుకోసం బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూరం శ్రీనివాస్ అనే లబ్ధిదారుడి ఇంటిని అధికారులు ఎంపిక చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో గతేడాది ఏప్రిల్‌లో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభానికి, ఆ తర్వాత కొత్తగూడెంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార సభకు.. రెండుసార్లు వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత జిల్లాకు మూడోసారి వస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత రిజర్వ్ చేసిన 45 నిమిషాల వ్యవధిలో సీఎంను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాగా భద్రాచలంలో మెరుగులు దిద్దిన ట్రైబల్ మ్యూజియంతోపాటు మాఢవీధుల విస్తరణ పనులను ప్రారంభిస్తారని ప్రచారం సాగినా సీఎం టూర్ షెడ్యూల్లో వీటి ప్రస్తావనలేదు. సీఎం పర్యటన షెడ్యూల్ ఉదయం 8:45 గంటలకు బేగం పేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10 గంటలకు భద్రాచలం హెలిప్యాడ్‌కు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 10:10 నుంచి 10:30 గంటల వరకు రిజర్వ్ టైం కాగా, 10:30 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి 10:45 గంటలకు ఆలయానికి వస్తారు. 10:45 గంటల నుంచి 11:00 గంటల వరకు దర్శనం చేసుకుని, అనంతరం మిథిలా స్టేడియం చేరుకుంటారు, 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కల్యాణ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిథిలా స్టేడియం నుంచి సారపాకకు బయల్దేరుతారు. 12:35 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంట ల వరకు సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తర్వాత ఐటీసీ గెస్ట్‌హౌజ్ చేరుకోనుండగా, 1:15 నుంచి 2 గంటల వరకు రిజర్వ్ టైం. 2:15 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్ బయలుదేరతారు.సీతమ్మ అందాలు.. రామయ్య గోత్రాలు.! అలరించిన ఎదుర్కోలు ఉత్సవం భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. శ్రీరామనవమికి ముందు రోజు వారి వంశాల విశిష్టతలను, గొప్పద నాన్ని వివరించే ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంత వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం మా వంశం గొప్పదంటే ... కాదు మా వంశమే గొప్పదని చెబుతూ సీతమ్మ వారివైపు అర్చకులు, స్థానాచార్యులు స్థలశాయి, దేవాదాయ శాఖ ప్రినిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రామయ్య తరఫున పండితులు ఎస్టీజీ కృష్ణమాచార్యుల బృందంతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ చేరి వేడుక నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి ౖవైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే ఎదుర్కోలు ఉత్సవ కార్యక్రమం జరిపినట్లు పండితులు తెలిపారు. హిందూ, ముస్లింల మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరు చల్లారు. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. కాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషర్ శ్రీధర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, వేదపండితుడు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, రామకోటి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘పది’ మూల్యాంకనం
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగియగా.. ఈ నెల 7వ తేదీ నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాల్యూయేషన్ (మూల్యాంకనం) ప్రక్రియను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వాల్యూయేషన్ కార్యక్రమం ప్రారంభం కానుండగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. జిల్లాకు 2,13,000 సమాధాన పత్రాలు వచ్చాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం చేయనుండగా.. డీఈఓ క్యాంపు ఆఫీసర్‌గా ఉంటారు. రేషన్ దుకాణాల పరిశీలన రఘునాథపాలెం: మండలంలోని రేషన్ దుకాణాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ శనివారం పరిశీలించారు. హరియాతండాలో రేషన్ బియ్యం వండించి, రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 1వ తేదీ నుంచి కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నామని, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీటీ వెంకటేశ్వర్లు, ఆర్ఐ నరేశ్ పాల్గొన్నారు. -
● శుభలేఖలు పంచుతూ రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి ● అతడి తండ్రితో పాటు మరో ఇద్దరికి గాయాలు
హైకోర్టు జడ్జిని కలిసిన ‘బార్’ అధ్యక్షుడుఖమ్మంలీగల్ : హైకోర్టు జడ్జి నందాను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం వచ్చిన ఆమెను బార్ అధ్యక్షుడితోపాటు జాయింట్ సెక్రటరీ గద్దల దిలీప్‌కుమార్, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ బిచ్చాల తిరుమలరావు, దిరిశాల కృష్ణారావు, కర్లపూడి శ్రీనివాసరావు, పొన్నెకంటి నరసరావు, మల్సూరు తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ముగిసిన మత్స్యకారుల శిక్షణ కూసుమంచి: పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు, వలలను అందజేశారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కేవీకే సీనియర్ సైంటిస్ట్ లవకుమార్, పాలేరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డాక్డర్ జి.విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడారు. చేపల పెంపకంలో, ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు పాటించాలని, అందుకు తగిన శిక్షణ అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నాగరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆరురోజుల్లో పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు.. కల్లూరు: మరో ఆరు రోజుల్లో వివాహం కావాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన కల్లూరు మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని ఓబులరావుబంజర గ్రామానికి చెందిన బానోత్ వేణు(24)కు ఈనెల 11న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై తండ్రి చిన్నికృష్ణతో కలిసి బంధు, మిత్రులకు పెళ్లి పత్రికలు పంచి తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో కల్లూరులోని ఓ రెస్టారెంట్ సమీపంలో మరో ద్విచక్ర వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బైక్‌పై ఉన్న బయ్యారపు జస్వంత్ సాయి, ఇందుకాంత్కు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. వేణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గిరిజనుడి ఇంట సీఎంకు భోజనం
● ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో.. ● ఏర్పాట్లను పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్బూర్గంపాడు: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణం అనంతరం సారపాకకు చెందిన గిరిజనుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఆదివారం భోజనం చేయనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో పేదల ఇంట్లో భోజనం చేసి లబ్ధిదారులతో మాట్లాడాలనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎంఓ నుంచి శనివారం టూర్ షెడ్యూల్ కూడా విడుదలైంది. కాగా, శ్రీనివాస్ ఇంటిని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఇతర అధికారులు శనివారం పరిశీలించి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతోనే అన్నం వండి పప్పు, చారు, కూర, పచ్చడితో భోజనం వడ్డిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యాన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నాయకపోడు తెగకు చెందిన గిరిజనుడి ఇంట భోజనానికి సీఎం రావడం సంతోషకరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం గిరిజనుడి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. -
అన్ని గురుకులాలు ఒకేచోట..
వైరా: నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు.వైరాలోని కేవీసీఎం డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల ప్రాంగణాలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇంటిగ్రేడెట్ గురుకుల భవనాలు ఎక్కడ నిర్మించాలనే అంశంపై స్థలాల పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంగణాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా భవనాలు నిర్మిస్తామని, నెలలోగా స్పష్టత వస్తుందని చెప్పారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమతో మాట్లాడిన కలెక్టర్ పదో తరగతి విద్యార్థినులు పరీక్షలు ఎలా రాశారో ఆరాతీయడమే కాక ఫలితాలు వచ్చాక ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను కలెక్టరేట్‌కు తీసుకురావాలని సూచించారు. ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీకాంత్, విక్రమ్ ఉన్నారు. సన్న బియ్యం రవాణాలో వేగం ఖమ్మం సహకారనగర్: జిల్లాల్లోని అన్నిరేషన్ షాపులకు సన్న బియ్యం త్వరగా చేరవేసి పంపిణీలో జాప్యం జరగకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వివిధ అంశాలపై కలెక్టర్లేతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో ఇన్నాళ్లు దొడ్డు బియ్యం సరఫరా చేసినా చాలా మంది తీసుకోలేదన్నారు. దీంతో ఉచితంగా సన్న బియ్యం సరఫరాకు నిర్ణయించామని తెలిపారు. ఈమేరకు రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి త్వరగా షాపులకు చేర్చడంతో పాటు సరఫరాలో అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ షాప్‌ల వద్ద రద్దీ దృష్ట్యా అవసరమైన బియ్యం సమకూర్చాలని, నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనలో పెంచాలని తెలిపారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు.‘ఇంటిగ్రేటెడ్’ స్థల పరిశీలనలో కలెక్టర్ -
నవమి భక్తులకు ప్రత్యేక బస్సులు
● భద్రాచలానికి 197, అక్కడి నుండి పర్ణశాలకు 30 ● హైదరాబాద్ భక్తులకు రిజర్వేషన్ కూడా.. ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం, పట్టాభిషేకానికి హాజరయ్యే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి భద్రాచలానికి ఈ సర్వీసులు ఉంటాయి. అలాగే, హైదరాబాద్ నుండి భద్రాచలం, భద్రాచలం నుండి హైదరాబాద్‌కు సైతం బస్సులు ఏర్పాటు చేసి, రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవి కాక ఖమ్మం నుండి హైదరాబాద్‌కు ప్రతీ పది నిమిషాలకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. ఖమ్మం రీజియన్‌లోని డిపోల నుండి భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులు, భద్రాచలం నుండి పర్ణశాలకు 30 బస్సులు నడిపించనుండగా, భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ నేతృత్వాన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోజు వారి సర్వీసులకు అదనం భద్రాచలం నుండి హైదరాబాద్, భద్రాచలం నుండి ఖమ్మంకు రోజువారి తిరిగే వంద సర్వీసులతో పాటు అదనంగా సర్వీసులు నడిపిస్తారు. ఈనెల 6వ తేదీన అదనంగా 35సర్వీసులు, భద్రాచలం నుంచి కొత్తగూడెంకు నిత్యం తిరిగే సర్వీసులకు తోడు అదనంగా పది బస్సులు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి భద్రాచలానికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు నడుస్తాయి. భద్రాచలం నుండి మణుగూరుకు రోజు వారీగా తిరిగే ఎనిమిది బస్సులతో పాటు అదనంగా పది బస్సులు, సత్తుపల్లి నుండి 20 బస్సులు, మధిర నుండి 17 బస్సులు, ఇల్లెందు నుండి భద్రాచలానికి ఐదు బస్సులు నడిపించనున్నారు. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు కేంద్రాలకే కాక భద్రాచలం నుండి హనుమకొండ, కరీంనగర్‌కు సర్వీసులు ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కాగా, భద్రాచలం నుండి విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం వైపు వెళ్లే బస్సుల కోసం జూనియర్ కాలేజ్ మైదానంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు రెండు బస్సులు నడిపిస్తామని అధికారులు వెల్లడించారు.ప్రత్యేక సర్వీసుల సమాచారం కోసం ఫోన్ నంబర్లు డిపో సెల్ నంబర్ భద్రాచలం 99592 25987ఖమ్మం కొత్త బస్టాండ్ 99592 25979మణుగూరు 89853 61796కొత్తగూడెం 99592 25982ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో స్వామివారి కల్యాణం తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. రాకపోకల సమయాన ఎవరూ ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తాం. ఈనెల 6న భక్తుల కోసం అన్ని బస్టాండ్ల నుండి రద్దీకి అనుగుణంగా బస్సులు ఉంటాయి. అంతేకాక భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్‌కు రెగ్యులర్ సర్వీసులు తోడు అదనపు సర్వీసులు నడిపిస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తి ఉన్న సీనియర్ క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణా శిబిరాల ఏర్పాటుపై దృష్టి సారించగా, ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలని తెలిపారు. నిర్వాహకులకు గౌరవ వేతనంగా రూ.4వేలు చెల్లిస్తామని, దరఖాస్తులను ఖమ్మం పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. హెచ్‌సీ కుటుంబానికి భద్రతా పరిహారం చెక్కు ఖమ్మంక్రైం: ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ పాపా కుటుంబానికి రూ.8లక్షల భద్రతా పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా చెక్కును సీపీ సునీల్‌దత్ శుక్రవారం అందజేసి మాట్లాడారు. శాఖాపరంగా కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీకి 29 మంది ఎస్‌ఆర్‌లు ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 29 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించారు. ఇటీవల పీజీ పూర్తి చేసిన వీరు ఏడాది పాటు వైద్యసేవలు అందించనుండగా, ఇప్పటికే 26 మంది విధుల్లో చేరారు. అనస్తీసియా, జనరల్ సర్జరీ విభాగాల్లో ముగ్గురు చొప్పున, రేడియో డయాగ్నసిస్, ఆప్తమాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, గైనిక్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో ఇద్దరు చొప్పున, రెస్పిరేటర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పిజియాట్రిక్, మైక్రోబయాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున విధుల్లో చేరారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత నేపథ్యాన ఎస్‌ఆర్‌ల కేటాయింపుతో వైద్యసేవల్లో ఇబ్బందులు తొలగనున్నాయి. విద్యుత్ సరఫరాను పరిశీలించిన సీఈ ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులు, సబ్స్టేషన్లలో అభివృద్ధి పనులను ఎన్పీడీసీఎల్ సీఈ రాజుచౌహాన్ శుక్రవారం పరిశీలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి సబ్ స్టేషన్లో రూ.1.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించిన ఆయన ఖిలా ఏరియాలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వేసవిలో ఎంత డిమాండ్ పెరిగినా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యాన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి సూచించారు. ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈ నంబూరి రామారావు, ఏడీఈలు నాగార్జున, యాదగిరి, ఏఈలు పాల్గొన్నారు. మక్కల కొనుగోళ్లు ప్రారంభం చింతకాని: మొక్కజొన్నలకు మద్దతు ధర దక్కేలా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యాన కొనుగోళ్లు ప్రారంభించారు. ఈసందర్భంగా చింతకానిలో ఏర్పాటుచేసిన కేంద్రాన్ని శుక్రవారం మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత ప్రారంభించి మాట్లాడారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. తేమ 14శాతంలోపు ఉన్న మొక్కజొన్నలు క్వింటాకు రూ.2,225 మద్దతు ధర లభి స్తుందని తెలిపారు. తహసీల్దార్ కె.అనంతరాజు, ఏఓ మానస, సొసైటీ చైర్మన్, వైస్చైర్మన్లు కె.శేఖర్‌రెడ్డి, ఎం.రవి, సీఈఓ శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ డైరక్టర్ కె.గోవిందరావుతో పాటు కోటేశ్వరరావు, మనోహర్‌బాబు, కోటయ్య, వెంకటేశ్వర్లు, గోపి పాల్గొన్నారు. -
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
కూసుమంచి: మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో 50మంది మత్స్యకారులకు వలలు, చేపలు పట్టే సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందిన మత్స్యకారులకు న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆర్థిక సహకారంతో వీటిని సమకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యరంగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేలా ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ, చేయూతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత పలువురు దివ్యాంగులకు త్రీ వీలర్ మోపెడ్ వాహనాలను మంత్రి అందజేశారు. అంతేకాక సబ్ స్టేషన్ ఆవరణలో రూ.35 లక్షలతో నిర్మించే కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి.. సంక్షేమం నేలకొండపల్లి: అభివృద్ధి పనులు చేపడుతూనే సంక్షేమ పథకాలు నిరాటంకంగా సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి, బోదులబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో అనంతనగర్‌లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం అప్పుల భారాన్ని మోపితే వడ్డీలు కడుతూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఎన్పీడీసీఎల్ సీఈ రాజుచౌహాన్, ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, డీఏఓ పుల్లయ్య, పౌర సరఫరా సంస్థ మేనేజర్ శ్రీలత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ కరుణశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్యాంప్రసాద్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు వి.రమ్య, భద్రయ్య, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, రాయపూడి నవీన్, బొందయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ, గుండా బ్రహ్మం, కడియాల నరేష్, బోయిన వేణు, బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పైనంపల్లి కార్యదర్శిపై సీరియస్ నేలకొండపల్లి మండలం పైనంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్.నరసింహారావుపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, కార్యదర్శి అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా కార్యదర్శిని పిలిపించిన మంత్రి మందలించారు. ఆయనను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఎంపీడీఓ ఎం.ఎర్రయ్యను వివరణ కోరగా కార్యదర్శిని డీపీఓ కార్యాలయానికి సరెండర్ చేశామని తెలిపారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
అకాల వర్షం
ఆగం చేసిన●అప్రమత్తంగా ఉండాలి... అకాల వర్షాలతో జిల్లాలో పంట నష్టం జరగలేదు. అయినప్పటికీ రైతులు వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలి. పంటలను రక్షించుకునే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. – ధనసరి పుల్లయ్య, డీఏఓ ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షం పంటలను ఆగం చేస్తోంది. యాసంగిలో సాగు చేసిన పలు పంటలు చేతికందే దశలో ఉండగా.. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో పలు చోట్ల దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి 12:45 గంటల సమయం నుంచి వర్షప్రభావం జిల్లాలో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయానికి జిల్లాలో సగటు వర్షపాతం 13.9 మి.మీ.గా నమోదైంది. కామేపల్లి మండలంలో భారీ వర్షం కురవగా, పెనుబల్లి, సింగరేణి, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈదురుగాలులు, అకాల వర్షాలతో కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న వంటి పంటలు నేలవాలగా.. మామిడి కాయలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిర్చి పంటలు తడిశాయి. దీంతో రైతులు పంటలను రాశులుగా చేర్చి టార్పాలిన్లతో రక్షణ కల్పిస్తున్నారు. ప్రతికూల వాతావరణం జలాశయాల్లో సమృద్దిగా నీరు ఉండడం, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయగా ఈ ఏడాది యాసంగిలో జిల్లా రైతులు 3.53 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 2.25 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 1.15 లక్షల ఎకరాలు ఉంది. సత్తుపల్లి, కూసుమంచి వ్యవసాయ డివిజన్లలో వరి పంట చేతికందుతుండగా, మధిర, కూసుమంచి, ఖమ్మం, వైరా డివిజన్లలో మొక్కజొన్న కోతలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు వానాకాలంలో సాగు చేసిన మిర్చి పంట కోతలు చివరి దశకు చేరాయి. ధాన్యం, మొక్కజొన్న, మిర్చి పంటలను రైతులు కల్లాల్లో ఆరబెట్టిన నేపథ్యాన వర్షంతో నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అన్నదాతల్లో ఆందోళన పంటలు చేతికందుతున్న సమయాన అకాల వర్షాలు కురవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఓ వైపు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటు చేస్తోంది. దీంతో రైతులు పంట కోతలను ముమ్మరం చేసి కల్లాల్లో ఆరబెట్టారు. ఇప్పుడు వర్షం కారణంగా పలుచోట్ల వరి చేన్లు నేలవాలగా, మొక్కజొన్నలు, మిర్చి తడిసిపోయాయి. దీంతో రైతులు శుక్రవారం ఉదయం నుంచి నీరు తొలగిస్తూ పంటలు ఎండబెట్టుకోవడంలో నిమగ్నయ్యారు. అయితే, శుక్రవారం సాయంత్రం కూడా తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో వర్షం కురవగా.. ఇంకా ఆకాశం మేఘావృతమై ఉండడంతో రైతులు కుటుంబాలతో సహా కల్లాల వద్దకు చేరుకుని పంట ఉత్పత్తులపై టార్పాలిన్లు కప్పుతున్నారు.పంటలు చేతికందే దశలో అకాల వర్షం నేలవాలిన వరి, మొక్కజొన్న, రాలిన మామిడి ధాన్యం, మక్కలు, మిర్చి తడవడంతో రైతుల ఆందోళన -
కమనీయం... శ్రీవారి కల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణం జరిపించారు. ఇటీవల నిర్మించిన వకుళామాత స్టేడియానికి శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చిన అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించాక కల్యాణ క్రతువు ఆరంభించారు. ఈక్రమాన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈఓ జగన్మోహన్రావు దంపతులు సమర్పించగా, గ్రామపంచాయతీ అధికారులు, తుళ్లూరు కోటేశ్వరరావు దంపతులు సైతం నూతన వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అనంతరం ప్రధాన, ముఖ్య అర్చకులు పురాణం రవికుమార్‌శర్మ, ఉప్పల శ్రీనివాసశర్మ, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరుల నేతృత్వాన మధ్యాహ్నం 12–01 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామి కల్యాణ తంతు పూర్తిచేశారు. ఈసందర్భంగా స్టేడియం ప్రాంగణం గోవింద నామ స్మరణతో మార్మోగింది. అలాగే, గ్రామోత్సవం అనంతరం స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల దంపతుల ఆధ్వర్యాన పెద్ద చెరువులో శ్రీవారి తెప్పోత్సవం నిర్వహించగా, కుర్నవల్లికి చెంది శీలం వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యాన అన్నదానం చేశారు. ఆలయ ఽవ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, ఎంపీడీఓ సురేంద్రనాయక్, సొసైటీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు, ఉద్యోగులు విజయకుమారి, జి.కుమార్, సుజాత తదితరులు పాల్గొన్నారు.జమలాపురంలో తిలకించి పులకించిన భక్తజనం -
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
కూసుమంచి: మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో 50మంది మత్స్యకారులకు వలలు, చేపలు పట్టే సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందిన మత్స్యకారులకు న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆర్థిక సహకారంతో వీటిని సమకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యరంగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేలా ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ, చేయూతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత పలువురు దివ్యాంగులకు త్రీ వీలర్ మోపెడ్ వాహనాలను మంత్రి అందజేశారు. అంతేకాక సబ్ స్టేషన్ ఆవరణలో రూ.35 లక్షలతో నిర్మించే కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి.. సంక్షేమం నేలకొండపల్లి: అభివృద్ధి పనులు చేపడుతూనే సంక్షేమ పథకాలు నిరాటంకంగా సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి, బోదులబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో అనంతనగర్‌లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం అప్పుల భారాన్ని మోపితే వడ్డీలు కడుతూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఎన్పీడీసీఎల్ సీఈ రాజుచౌహాన్, ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, డీఏఓ పుల్లయ్య, పౌర సరఫరా సంస్థ మేనేజర్ శ్రీలత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ కరుణశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్యాంప్రసాద్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు వి.రమ్య, భద్రయ్య, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, రాయపూడి నవీన్, బొందయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ, గుండా బ్రహ్మం, కడియాల నరేష్, బోయిన వేణు, బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పైనంపల్లి కార్యదర్శిపై సీరియస్ నేలకొండపల్లి మండలం పైనంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్.నరసింహారావుపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, కార్యదర్శి అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా కార్యదర్శిని పిలిపించిన మంత్రి మందలించారు. ఆయనను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఎంపీడీఓ ఎం.ఎర్రయ్యను వివరణ కోరగా కార్యదర్శిని డీపీఓ కార్యాలయానికి సరెండర్ చేశామని తెలిపారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
అందరూ ఐకమత్యంతో ఉండాలి..
ఖమ్మం మామిళ్లగూడెం: ముస్లింలు ఐకమత్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. ఖమ్మం షాదీఖానాలో శుక్రవారం ఏర్పాటుచేసిన ఈద్ మిలాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏ మతమైనా అందరి మంచినే కోరుకుంటుందని తెలిపారు. ఈవిషయాన్ని గుర్తించి అందరూ సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలని, అన్ని మతాల వారు ఎదుటివారి సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. ఈకార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండీ.ఖమర్, కార్పొరేటర్లు, నాయకులు కర్నాటి కృష్ణ, షేక్ మగ్బూల్, కూరాకుల వలరాజు, కోటేశ్వరావు, జ్యోతిరెడ్డి, షంసుద్దిన్, ముజాహిద్, ఫిరోజ్, ఇజార్, ఛోటు, మున్నా, చంటి, పగడాల నాగారాజు, విజయ్‌కుమార్, ఎండీ.తాజుద్దీన్, న్యాయవాదులు కొల్లి సత్యనారాయణ, ఎం.డీ.తౌఫిక్, సీపీఎం, సీపీఎం నాయకులు నాగుల్‌మీరా, సీపీఐ నాయకులు షేక్ జానీమియా, అబ్దుల్ ఘనీ, సుధాకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.‘ఈద్ మిలాప్’లో మాజీ మంత్రి పువ్వాడ -
రహదారి విస్తరణలో ఇళ్ల కూల్చివేత
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేటలో రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న ఇళ్లను కూల్చివేయడాన్ని శుక్రవారం మొదలుపెట్టారు. ఈక్రమంలో నిర్వాసితులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే మూడో లైన్ నిర్మాణంలో భాగంగా ఖమ్మం – కామంచికల్లు మధ్య ప్రధాన రహదారి స్థలాన్ని సేకరించారు. దీంతో రహదారిని విస్తరించాల్సి రావడంతో 42 ఇళ్లుగా ఉన్నాయని ఏడాది క్రితమే గుర్తించిన అధికారులు చదరపు గజానికి రూ.6,200లే కాక నిర్మాణాలు, చెట్లకు సైతం పరిహారం అందించారు. కానీ తాము అంత్యంత విలువైన స్థలాలు కోల్పోయినందున ప్రత్యామ్నాయ స్థలం చూపాలని 15 మందికిపైగా కోరడంతో రెవెన్యూ అధికారులు స్థలం ఎంపిక చేశారు. కానీ ఆ స్థలం నచ్చలేదని చెప్పడంతెఓ ఏడాదిగా సమస్య కొనసాగుతోంది. ఈనేపథ్యాన శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, ఆర్అండ్ శాఖ అధికారులు వాహనాలతో చేరుకుని కూల్చివేత పనులు చేపట్టారు. ఈక్రమంలో కొందరు వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా.. వారిని వాహనాల్లో తరలించి కూల్చివేత కొనసాగించారు. అర్బన్ తహసీల్దార్ రవికుమార్, డీటీ వెంకటేశ్వరరావు, ఆర్ఐలు వహీద్, నరేశ్, ఖానాపురం హవేలి సీఐ భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బాధితులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత -
బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే
ఖమ్మంఅర్బన్: వరద ముంపు ఎదురుకాకుండా మురుగునీరు సాఫీగా సాగేలా ఖమ్మంలోని ఖానాపురం అలుగు వాగు సమీపాన రూ.290 కోట్ల అంచనా వ్యయంతో పైపులైన్ పనులు చేపడుతున్నారు. వాగుకు ఇరువైపుల కాలనీల నుంచి మురుగు నీటిని ఈ పైపులైన్ ద్వారా తరలించడంతో పాటు శుద్ధిచేసేలా ప్లాంట్లు సైతం నిర్మించనున్నారు. ఈక్రమంలోనే వాగు రికార్డుల ప్రకారం ఎంత మేర విస్తీర్ణంలో ఉండాలనే అంశాన్ని తేల్చేందుకు సర్వే చేపట్టారు. సుమారు 9కి.మీ. మేర ప్రవహించే వాగు సమగ్ర రూపాన్ని సర్వే చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. రెండు రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ ఉద్యోగులతో కూడిన ఈ బృందాలు సర్వే చేస్తున్నారు. వాగుకు ఇరువైపులా బఫర్‌జోన్‌లో ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, అందులో పేదల ఇళ్లు ఎన్ని, ఎన్ని ఇళ్లలో నివాసం ఉంటున్నారనే వివరాలు ఆరా తీస్తుండగా, పది రోజుల్లో నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.అలుగువాగు పరీవాహకంలో ఆక్రమణల గుర్తింపుపై దృష్టి -
కర్షకుల కళ్లలో కన్నీళ్లు
ఆకాల వర్షంతో పంటలకు నష్టంఅనుకోని వర్షం అన్ని పంటలను దెబ్బకొట్టింది.. మండే వేసవిలో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి.. ఇక పంట చేతికి వస్తుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆకాలంగా వచ్చిన వాన అన్నదాతల కంట కన్నీళ్ల వరదలు పారించింది. జిల్లాలోని తిరుమలాయపాలెం, వైరా, తల్లాడ, ఏన్కూరు, కల్లూరు, కామేపల్లి, కొణిజర్ల, కూసుమంచి మండలాల్లో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం సాయంత్రం వర్షప్రభావం కనిపించింది. ఆతర్వాత కూడా ఆకాశం మేఘావృతమై ఉండగా, పంటలు రక్షించేందుకు రైతులు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు. -
పామాయిల్ ఫ్యాక్టరీపై హైకోర్టులో రిట్
వేంసూరు: కనీస నిబంధనలు పాటించకుండా పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని పేర్కొంటూ కొందరు రైతులు హైకోర్టులో ఈనెల 2న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటీషన్ కాపీని బండి శ్రీనివాసరెడ్డి తదితరులు కల్లూరు ఆర్డీఓ కార్యాలయంతో పాటు వేంసూరు తహసీల్దార్ బాబ్జీప్రసాద్కు శుక్రవారం అందజేశారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ వేంసూరు మండలం కల్లురుగూడెంలోని 42 ఎకరాల్లో రూ.87 కోట్ల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉగాది రోజున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు శంకుస్థాపన చేశారు. అయితే, ఫ్యాక్టరీ ఏర్పాటుతో గ్రామంలోని సామూహిక పట్టా భూమి కోల్పోవడమే కాక ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంతో అనారోగ్యం పాలవుతామని, భూగర్భ జలాలు అడుగంటనున్నందున ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయించాలని పిటీషన్లో కోరినట్లు తెలిపారు. ఈమేరకు ఐదుగురు రైతులు పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. మెడిసిన్ విద్యార్థినికి చేయూత కల్లూరు: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న మెడిసిన్ విద్యార్థినికి స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున చేయూతనందించారు. టేకులపల్లికి చెందిన శిరసాని ఇమ్మానియేల్ కుమార్తె ప్రీతి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసెన్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఆమె కుటుంబ పరిస్థితి బాగుండకపోవడంతో హాస్టల్ ఫీజు ఇతర అవసరాలకు ఇబ్బంది పడుతున్నట్లు స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన దాతల సాయంతో శుక్రవారం రూ.85 వేల చెక్కు అందచేశారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర ముదిగొండ: రైతులు తాము సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని, తద్వారా మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ముదిగొండ మండలం వల్లభి, మల్లారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వల్లభిలో సీ్త్ర టీ సెంటర్, మల్లారంలో సన్నబియ్యం పంపిణీని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రమేష్‌బాబు, సీసీ రామారావుతో పాటు బిచ్చాల బిక్షం, ఇలవల పుల్లారెడ్డి, బిచ్చాల అన్వేష్, తదితరులు పాల్గొన్నారు. పార్క్‌లో మంటలపై అటవీశాఖ, పోలీసుల ఆరా ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ అటవీ పార్క్‌లో గురువారం రాత్రి మంటలు చెలరేగిన ఘటనపై శుక్రవారం అటవీశాఖ, పోలీసు అధికారులు ఆరా తీశారు. పార్క్‌ను ఆనుకుని ఉన్న పొలాల్లో రైతులు చెత్తకుప్పలకు నిప్పంటించడంతో మంటలు వచ్చాయా, ఇతర కారణాలు ఉన్నాయా అనే సమాచారం సేకరిస్తున్నారు. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ పార్క్‌ను పరిశీలించగా, అటవీశాఖ ఎఫ్ఆర్ఓ నాగేశ్వరరావు కూడా మంటల ధాటితో ఎన్ని మొక్కలు కాలిపోయాయనే అంశంపై ఆరా తీశారు. మంటలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. -
రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత బీజేపీదే..
ఖమ్మంమామిళ్లగూడెం: కరోనా కాలం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందిస్తున్న ఘనత బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికే దక్కుతుందని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం నిధులతో సరఫరా చేసే రేషన్ బియ్యానికి కిలో కలిపి రాష్ట్రప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని ఎద్దేవాచేశారు. కాగా, కాంగ్రెస్ నియంతృత్వ పాలనను చూస్తున్న ప్రజలు పొరపాటున పట్టం కట్టామని ఆందోళన చెందుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్, గెంటేల విద్యాసాగర్, నున్నా రవి, కూసంపూడి రవీందర్, ఈ.వీ.రమేష్, వేల్పల సుధాకర్, విజయ్‌రాజ్, చింతమళ్ల వీరస్వామి, తాటికొండ రవి, కొదుమూరి రాజయ్య, తక్కెళపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు -
మనోళ్లే ఇచ్చేయండి..
● కొందరికే కేఎంసీ పనుల అప్పగింత ● టెండర్ పెట్టాల్సి వచ్చినా వారి వైపే మొగ్గు ● ఆపై హడావుడిగా బిల్లులు చెల్లింపు ● సీరియల్ కేటాయించాలని కమిషనర్ నిర్ణయం?ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ప్రతీ పనిని అత్యవసరంగా చూపించి బిల్లులు డ్రా చేస్తుండడం ఇందుకు కారణమవుతోంది. శానిటేషన్ విభాగానికి సంబంధించి పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే పనులను కూడా విభజించి నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండడం.. అదీ కొందరికే ఇస్తుండడంపై కేఎంసీలో చర్చ జరుగుతోంది. అధికారులు కావాలనే నామినేషన్ పద్ధతిలో, ఓచర్ విధానంలో పనులు చేయిస్తున్నారని.. టెండర్లు ఆహ్వానించకుండా కానిచ్చేస్తున్నారని తెలిసింది. అంతేకాక పనులు కాగానే బిల్లుల చెల్లింపునకు హడావిడి చేస్తున్నారని సమాచారం. ఒకరికేనా పనులన్నీ.. కేఎంసీ పరిధిలో పదుల సంఖ్యలో కాంట్రాక్టర్లు ఉన్నారు. సివిల్ వర్క్స్ మొదలు కార్మికులను ఏర్పాటు చేయడం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, వాహనాలు సమకూర్చడం, యంత్రాల మరమ్మతు తదితర పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల అందరినీ పక్కన పెట్టిన అధికారులు తమకు అనుకూలంగా ఉన్న ఒకరిద్దరికే అప్పగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. శానిటేషన్ విభాగంలో కీలక పనులన్నీ ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తుండడం.. ఇందుకు ఓ కీలక అధికారి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు పనులు ఇచ్చేలా పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన పనులను సైతం రెండు, మూడుగా విభజిస్తున్నారని సమాచారం. టెండర్ ద్వారా పనులు చేయిస్తే ఎంబీల్లో రికార్డు చేయాల్సి ఉంటుందని, తద్వారా బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉంటాయని ఈ విధానం అవలంబిస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు కాంట్రాక్టర్ పెత్తనం కేఎంసీలో పెరిగిందని, అధికారులనే దబాయించే స్థాయికి వెళ్లారని కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. అనుకూలమైన వ్యక్తులకే.. చిన్న పనులను నచ్చిన వ్యక్తులకు అప్పగిస్తున్న అధికారులు.. పెద్ద పనులకు టెండర్లు ఆహ్వానించినా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రూ.75 లక్షల పనులకు సంబంధించిన ఓ పనికి టెండర్లు పిలవగా, ముగ్గురు కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారు. ఈ ముగ్గురిలో తమకు నచ్చిన వ్యక్తికే కాంట్రాక్ట్ దక్కేలా మిగిలిన ఇద్దరి సర్టిఫికెట్లపై కావాలనే ఫిర్యాదు చేయించి పక్కకు తప్పించారని తెలిసింది. అధికారులకు అనుకూలమైన వ్యక్తికి లైసెన్సు లేకున్నా వేరే కాంట్రాక్టర్ లైసెన్సు ద్వారా టెండర్ వేయించి, ఆయనకు పనులు అప్పగించారని సమాచారం. పెరుగుతున్న ఓచర్ చెల్లింపులు ఖమ్మం నగర పాలకసంస్థలో రూ.5లక్షల లోపు పనులైతే అధికారులు నామినేషన్ పద్ధతిన చేయిస్తారు. అంత కంటే విలువైన పనులపై టెండర్లు నిలుస్తారు. కానీ ఇటీవల నామినేషన్ పద్ధతిలో చేపడుతున్న పనులకే కాక ఇతర పనులకూ ఓచర్ విధానంలో చెల్లింపులు చేస్తున్నట్లు సమాచారం. శానిటేషన్ అధికారులు, సిబ్బంది చిన్నచిన్న పనులు ఉన్నాయని, మరమ్మతులు చేయించాలని చెబుతూ కమిషనర్ వద్ద నోట్ ఫైల్ తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారని తెలిసింది. ఇది తప్పు కాకున్నా పనులన్నీ ఒకరే చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇక రొటేషన్ పద్ధతిలో.. కేఎంసీ పరిధిలో గత మూడు నెలల కాలంలో చేపట్టిన పనులు, సమర్పించిన బిల్లులపై కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బిల్లులు, వాటి తాలుకా పనుల నివేదికలను తనకు సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. వీటిని పరి శీలించాక కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాక ఇక నుండి నామినేషన్ పద్ధతిలో ఇచ్చే పనులకు రొటేషన్ విధానంలో కాంట్రాక్టర్లకు గుర్తించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లకు సీరియల్ నంబర్లు కేటాయించి ఒకరి తర్వాత మరొకరికి పనులు కేటాయించేలా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిసింది. -
బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే
ఖమ్మంఅర్బన్: వరద ముంపు ఎదురుకాకుండా మురుగునీరు సాఫీగా సాగేలా ఖమ్మంలోని ఖానాపురం అలుగు వాగు సమీపాన రూ.290 కోట్ల అంచనా వ్యయంతో పైపులైన్ పనులు చేపడుతున్నారు. వాగుకు ఇరువైపుల కాలనీల నుంచి మురుగు నీటిని ఈ పైపులైన్ ద్వారా తరలించడంతో పాటు శుద్ధిచేసేలా ప్లాంట్లు సైతం నిర్మించనున్నారు. ఈక్రమంలోనే వాగు రికార్డుల ప్రకారం ఎంత మేర విస్తీర్ణంలో ఉండాలనే అంశాన్ని తేల్చేందుకు సర్వే చేపట్టారు. సుమారు 9కి.మీ. మేర ప్రవహించే వాగు సమగ్ర రూపాన్ని సర్వే చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. రెండు రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ ఉద్యోగులతో కూడిన ఈ బృందాలు సర్వే చేస్తున్నారు. వాగుకు ఇరువైపులా బఫర్‌జోన్‌లో ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, అందులో పేదల ఇళ్లు ఎన్ని, ఎన్ని ఇళ్లలో నివాసం ఉంటున్నారనే వివరాలు ఆరా తీస్తుండగా, పది రోజుల్లో నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.అలుగువాగు పరీవాహకంలో ఆక్రమణల గుర్తింపుపై దృష్టి -
రైతులకు గుర్తింపు కార్డులు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో కూరగాయలు సాగు చేస్తూ ఖమ్మం రైతుబజార్లో విక్రయించే రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తెలిపారు. మండలంలోని రైతులకు ఆయన శుక్రవారం కార్డులు పంపిణీ చేశాక మాట్లాడారు. అర్హులైన రైతులకు కార్డులు జారీ చేయడం ద్వారా, రైతుబజార్‌లోకి దళారులు రాకుండా అడ్డుకట్ట వేయనున్నామని తెలిపారు. ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం సొసైటీ చైర్మన్ తాత రఘురాంతో పాటు శివరామకృష్ణ, వాంకుడోత్ దీప్లానాయక్, చెరుకూరి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన డీసీసీబీ లావాదేవీలు
● రూ.2,984 కోట్ల నుంచి రూ.3,460 కోట్లకు టర్నోవర్ ● రూ.9.64 కోట్ల లాభాల్లోకి బ్యాంకుఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రగతిబాట పట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లావాదేవీలతో పాటే లాభాలూ పెరిగాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,984.31 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.3,460.70 కోట్లకు చేరింది. ఏడాది కాలంలో రుణాలు, అడ్వాన్సులు, డిపాజిట్ల రూపంలో రూ. 476.39 కోట్ల టర్నోవర్ పెరిగినట్లయింది. దీంతో 2023–24లో రూ.3.89 కోట్లుగా ఉన్న లాభాలు 2024–25 నాటికి రూ.9.64కోట్లకు చేరాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన డీసీసీబీ 100 పీఏసీఎస్‌లు, 50 బ్రాంచ్‌లతో కొనసాగుతుండగా ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. బ్యాంకు ద్వారా రైతులకు స్వల్ఫ, మధ్య, దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నారు. అన్నదాతతో పాటు వివిధ వర్గాల ప్రజలకు గృహ, మార్ట్గేజ్, వాహన రుణాలు ఇస్తుండడమే కాక బంగారం తాకట్టుపై రుణాలు కూడా జారీ చేస్తున్నారు. మరోపక్క పీఏసీఎస్‌ల ద్వారా ఎరువులు, పురుగు మందుల వ్యాపారం, ధాన్యం, మొక్కజొన్నలు వంటి పంట ఉత్పత్తులు కొనుగోళ్లు చేస్తుండగా ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. ఇక బ్రాంచ్‌ల సంఖ్యను 50 నుంచి 54కి పెంచడంపై అధికారులు దృష్టి సారించారు. కాగా, రుణాల రికవరీతో బ్యాంకు ఎన్పీఏ సైతం 1.86 నుంచి 1.27కు తగ్గడం విశేషం.ఉద్యోగుల కృషి ఫలితంగానే ప్రగతి డీసీసీబీ అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితంగానే బ్యాంకు ప్రగతిపథంలో సాగుతోంది. రుణాలు, డిపాజిట్లు తదితర అంశాల ద్వారా లావాదేవీలతో పాటు లాభాలూ పెరిగాయి. ఈ ప్రగతిని మరింత పెంచేలా పాలకవర్గం, ఉద్యోగుల సహకారంతో ముందుకు సాగుతాం. – ఎన్.వెంకట్ ఆదిత్య, సీఈఓ, డీసీసీబీ -
●వెలుగుమట్ల అటవీపార్కులో మంటలు
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల అటవీ పార్కులో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్క్‌ను ఆనుకుని ఉన్న రైతుల పొలాల్లో చెత్తకు నిప్పు పెట్టగా.. గాలిదుమారంతో ఆ మంటలు పార్క్ వైపునకు వ్యాపించాయి. దీంతో చెట్లు, ఎండుగడ్డి తగలబడుతూ మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అటవీ, అగ్నిమాపక శాఖల ఉద్యోగులు మూడు ఫైరింజన్లు ద్వారా మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. తొలుత ఒక ఫైర్ ఇంజన్ రాగా, మరో రెండు వాహనాలను కూడా తెప్పించినట్లు ఖమ్మం ఎఫ్ఆర్ఓ నాగేశ్వరరావు తెలిపారు. రాత్రి కావడం, గాలికి మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో అటు సిబ్బంది, ఇటు వాహనాలు లోపలకు వెళ్లే పరిస్థితి లేకున్నా అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాద సమాచారం తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు. -
రైతు బజార్లలో దళారులకు స్థానం లేదు..
ఖమ్మంవ్యవసాయం: రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను రైతుబజార్లో నేరుగా అమ్ముకునేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ పక్కన నిర్మించిన రైతుబజార్‌ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఉన్న స్థానంలోనే రైతులకు ఉపయోగపడేలా కలెక్టర్ ప్లాట్ ఫామ్స్, షెడ్లను నిర్మించడం అభినందనీయమన్నారు. అయితే, పంట పండించే రైతులకే ఇక్కడ స్థానం కల్పించాలే తప్ప దళారులకు చోటు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. కాగా, మొక్కజొన్న కొనుగోళ్లు త్వరగా మొదలుపెట్టేలా చూస్తామని మంత్రి తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లో రూ.35 లక్షల వ్యయంతో మరో రైతుబజార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేశానికి ఎనలేని సేవ చేసిన కాంగ్రెస్ స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాక దేశాభివృద్ధికి కాంగ్రెస్ ఎనలేని సేవలు చేసిందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేలా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర నిర్వహించాలని సూచించారు. ఇదే సమయాన రాష్ట్రంలో కాంగ్రెస్ అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు కార్పొరేటర్లు కమర్తపు మురళి, గజ్జల లక్ష్మీవెంకన్న, కన్నం వైష్ణవిప్రసన్న, నాయకులు యర్రం బాలగంగాధర్ తిలక్, కొత్తా సీతారాములు, బాణాల లక్ష్మణ్, బోజెడ్ల సత్యనారాయణ, నల్లపు శ్రీనివాస్, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
రేపు జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 5న ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతలు అప్పగించే విషయమై కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈనెల 5న ఉదయం 10గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి ఎంపీలతో పాటు ఎమ్మెల్సీ, జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు రావాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. శిక్షణతో నాయకత్వం, మెరుగైన బోధన ఖమ్మంసహకారనగర్: పదోన్నతి పొందిన ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా మెరుగైన బోధన చేయొచ్చని ఇన్చార్జి డీఈఓ సామినేని సత్యనారాయణ తెలిపారు. ఇటీవల పదోన్నతి పొందిన ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు 1,078 మందికి రెండు రోజుల పాటు ఇచ్చే శిక్షణ గురువారం మొదలైంది. ఖమ్మంలోని ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తుండగా ఇన్చార్జ్ డీఈఓ మాట్లాడారు. హెచ్ఎంలకు నాయకత్వం, పాఠశాల అభివృద్ధి, లక్ష్యాల సాధన, బోధనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ, తల్లిదండ్రులతో సంబంధాలు, ఆదర్శ పాఠశాలల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే, సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు బోధన లక్ష్యాలు, పాఠ్యపుస్తకాలపై అవగాహన, పాఠ్యప్రణాళిక రూపకల్పన, మూల్యాంకన పద్ధతులపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. తెలంగాణను అగ్రగామిగా నిలపాలి కూసుమంచి: మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవడం ద్వారా చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులునాయక్ సూచించారు. పాలేరులోని పీ.వీనర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం ప్రారంభం కాగా ఆయన మాట్లాడారు. పాలేరులో మత్స్యకారులకు శిక్షణ ఇస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, భార్గవి, అశ్వారావుపేట ఆత్మా బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శ్రీనివాసరావు చేపల పెంపకం, దాణా తయారీపై అవగాహన కల్పించారు. జేఈఈ మెయిన్స్‌కు 49మంది గైర్హాజరు ఖమ్మంసహకారనగర్: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన గురువారం ఉదయం సెషన్లో 543 మందికి 512 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 533 మందిలో 515 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు విజయ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య, బొమ్మ, ఎస్బీఐటీ కళాశాలల్లో నిర్వహిస్తుండగా రెండు సెషన్లలో కలిపి 49మంది గైర్హాజరయ్యారని నిర్వాహకులు వెల్లడించారు. జిల్లాలో రెండు బార్లకు నోటిఫికేషన్ ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో ఎనిమిదేళ్ల క్రితం మూతపడిన రెండు బార్లను కొత్త వారికి అప్పగించేలా ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలుచోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించకుండా మూతపడిన బార్లు తిరిగి తెరిచేలా నోటిఫికేషన్ ఇవ్వగా జాబితాలో జిల్లా కూడా ఉంది. ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్ –1 పరిధిలో రెండు బార్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు రూ.లక్ష చెల్లించి ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ఆధారంగా వేలం నిర్వహించి ఖరారు చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 37బార్లు కొనసాగుతుండగా, కొత్తవి ఏర్పాటైతే ఈ సంఖ్య 39కు చేరుతుంది. -
ఆడపిల్ల ఉన్నవారు అదృష్టవంతులు
కామేపల్లి: ఆడపిల్ల ఇంటికి వరమని, ఆడపిల్ల జన్మించిన కుటుంబీకులు అదృష్టవంతులని కల్టెకర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. మండలంలోని కొత్తలింగాల, గోవింద్రాల గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. కొత్తలింగాలకు చెందిన ఉండేటి అమృత–సుధాకర్ దంపతులకు ఇటీవల ఆడపిల్ల జన్మించగా వారితో పాటు సుధాకర్ తల్లిదండ్రులను కలెక్టర్ ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ లో భాగంగా సన్మానించి స్వీట్లు, పండ్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలే ముందు నిలుస్తున్నందున ఆడపిల్లలను చిన్నచూపు చూడకుండా చదివించాలని సూచించారు. ఆతర్వాత ఖమ్మంకు చెందిన డాక్టర్ జానకీరామయ్య–సరోజని మనమడు అభి కొత్తలింగాల అంగన్వాడీ కేంద్రాలకు రూ.5 లక్షల విలువైన సోలార్ ఇన్వెర్టర్లు అందించగా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం గోవింద్రాలలో బానోత్ లక్ష్మణ్‌నాయక్ సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించారు. సాగు విధానం, సేంద్రియ విధానంలో పండ్లు మాగబెట్టడం, మార్కెటింగ్‌పై ఆరాతీశారు. ఈ కార్యక్రమాల్లో డీడబ్ల్యూఓ రామ్‌గోపాల్‌రెడ్డి, ఉద్యాన శాఖాధికారి మధుసూదన్‌రావు, ఏడీఏ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్, ఏఓ తారాదేవితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, నాయకులు శ్రీనివాసులు, సతీశ్, వేణు, శ్రావణి, సక్రు, ప్రభాకర్‌రెడ్డి, ఉషా, జగదీశ్వర్, వెంకటమ్మ, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ -
దళారులను నమ్మి నష్టపోకండి..
● ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి బోనస్ ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికూసుమంచి: రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ధాన్యం కోతలు ముమ్మరంగా సాగుతున్నందున ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభిస్తోందని, ఏదైనా గ్రామంలో ఆలస్యమైనా దళారులకు అమ్మి నష్టపోకుండా వేచి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మడం ద్వారా మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి బోనస్ అందుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల రుణాలు మాఫీ చేయడమే కాక రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఇప్పుడు సన్నధాన్యం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని చెప్పారు. కాగా, కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని గంగమ్మతల్లి ఆలయంలో పూజలు చేసిన మంత్రి ఆలయ అభివృద్ధికి విరాళం అందజేశారు. అలాగే, నాయకన్,గూడెం, జుజుల్‌రావుపేట, పెరికసింగారం, ధర్మాతండా గ్రామాల్లో పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎస్ఓ చందన్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, ఆర్డీఓ నర్సింహారావు, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, తహసీల్ధారు కరుణశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఖమ్మంరూరల్: వేసవిలో ఎంత డిమాండ్ పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టర్ ముజుమ్మిల్ఖాన్తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో గురువారం ఆయన పర్యటించారు. మద్దులపల్లిలో మద్దులపల్లి నుండి తల్లంపాడు వరకు రూ.1. 80కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, వరంగల్ క్రాస్‌లో రూ.2కోట్లతో ఏర్పాటు చేసే సబ్‌స్టేషన్, గూడూరుపాడు నుంచి గోళ్లపాడు వరకు రూ.2.37కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరిగేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఐడీసీ, గిడ్డంగుల సంస్థల చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ హరినాధ్‌బాబు, డీఈ హీరాలాల్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. నేలకొండపల్లి మండలంలోని కట్టుకాచారం, అనంతనగర్‌లో రోడ్లు, సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు బోదులబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఆతర్వాత కూసుమంచిలో విద్యుత్ రెవెన్యూ కార్యాలయ నిర్మానానికి శంకుస్థాపన చేశాక మత్య్సకారులకు వలలు పంపణీ చేస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో సీసీ రోడ్డు, పీఏసీఎస్ కార్యాలయం, గోదాం, షాపింగ్ కాంప్లెక్స్, పిండిప్రోలు, తెట్టెలపాడు, మేడిదపల్లిలో సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. ఆతర్వాత దమ్మాయిగూడెం–కాకరవాయి మధ్య డ్రెయిన్లు, ఇస్లావత్‌తండా వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. -
జమలాపురంలో ఎదుర్కోలు ఉత్సవం
ఎర్రుపాలెం: శ్రీ వేంంకటేశ్వర స్వామి కొలువైన జమలాపురం ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు ఉత్సవం జరిపించారు. స్వామి తరఫున ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్‌శర్మ, వేద పండితులు సాయి అభిలాష్, అమ్మవార్ల తరఫున వేద పండితులు విజయకృష్ణ, అర్చకులు కాసులనాటి రామకృష్ణశాస్త్రి, మారుతీ రఘురామకృష్ణ, మారుతి వెంకటరమణ చేరి వారి గోత్రప్రవరలు, గుణగణాలను ఆసక్తిగా వివరించారు. ఇరువర్గాల నడుమ సంవాదం ఉత్సాహంగా కొనసాగింది. క్రతువు బ్రహ్మగా శ్రీపురాణం రవికుమార్‌శర్మ వ్యవహరించగా ఈఓ కె.జగన్మోహన్రావు, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తులు.. బారులు
స్వయం సంవృద్ధి సాధించేలా.. నిరుద్యోగులు సొంతంగా యూనిట్లు స్థాపించుకుని ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా అర్హులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేస్తారు. వందశాతం సబ్సిడీతో రూ.50వేల యూనిట్, 90 శాతం సబ్సిడీతో రూ.లక్ష, 80 శాతం సబ్సిడీతో రూ.2 లక్షలు, 70 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల విలువైన యూనిట్ల ఏర్పాటుకు అవకాశముంటుంది. వెల్లువలా దరఖాస్తులు.. యూనిట్ల కోసం ఇప్పటికే ఆన్లైన్లో యువత దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా 18,525 దరఖాస్తులు వచ్చా యి. ఇందులో అత్యధికంగా ఖమ్మంఅర్బన్ నుంచి 1,788, ఖమ్మం రూరల్‌లో 1,433, కేఎంసీ పరిధిలో 1,361 దరఖాస్తులు రాగా, చింతకాని మండలంలో 1,069 దరఖాస్తులు నమోదవడం గమనార్హం. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యాన యూనిట్లకు 13,272, ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 5,350, మైనార్టీలకు సంబంధించి 2,301 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14తో గడువు ముగిశాక దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఆతర్వాత వారికి యూనిట్ గ్రౌండింగ్, నిర్వహణలో శిక్షణ ఇవ్వనున్నారు. సర్టిఫికెట్ల కోసం హడావుడి.. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. రేషన్‌కార్డు లేకపోతే ఆదాయ ధ్రువీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఆసక్తి ఉన్న వారు దరఖాస్తుకు మీ సేవ కేంద్రాల వద్ద బారులు దీరుతున్నారు. ఆపై తహసీల్దార్ కార్యాలయాల వద్ద కూడా రద్దీ ఉంటోంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 65,679 దరఖాస్తులు రాగా.. కుల ధ్రువీకరణ పత్రాల కోసం 13,566 దరఖాస్తులు రావడంతో తహసీల్దార్ కార్యాలయాల ఉద్యోగులు ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులకు జారీ చేస్తున్నారు. ఆ మండలాల్లోనే పెండింగ్.. జిల్లాలో మొత్తం 164 మీసేవ సెంటర్లు ఉండగా.. అన్ని కేంద్రాలు రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని మండలాల్లో ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం అర్బన్ మండలంలో 9,243 దరఖాస్తులు అందగా 3,070 పెండింగ్‌లో ఉన్నాయి. రఘునాథపాలెం మండలంలో 2,264 దరఖాస్తులకు 1,002 మందికి మంజూరు చేశారు. ఇంకా 1,253 పెండింగ్‌లో ఉన్నాయి. సత్తుపల్లి మండలంలో 3,467దరఖాస్తులకు 2,180 మందికి జారీ చేయగా, 1,262 పెండింగ్‌లో ఉన్నాయి. తిరుమలాయపాలెం మండలంలో 2,829 దరఖాస్తులు అందగా, ఇంకా 906 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. కుల ధ్రువీకరణ అంతే.. కుల ధ్రువీకరణ పత్రాల జారీలోనూ ఖమ్మం అర్బన్ మండలంలోనే ఎక్కువగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ 2,276 దరఖాస్తులు అందితే 1,025 మందికి జారీ చేయగా, 1,236 పెండింగ్ ఉన్నాయి. రఘునాథపాలెం మండలంలో 480 దరఖాస్తులకు 440, తిరుమలాయపాలెం మండలంలో 634కి 412, ఏన్కూరు మండలంలో 265 దరఖాస్తులకు గాను 155 పెండింగ్ ఉన్నాయి.రాజీవ్ యువ వికాసం పథకం.. నిరుద్యోగులను దౌడ్ తీయిస్తోంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల్లో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై యూనిట్లు అందజేయనుంది. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ చదివిన వారంతా అర్హులేనని ప్రకటించిన నేపథ్యాన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఈనెల 14తో గడువు ముగియనుండగా ఇప్పటివరకు 39,448 మంది దరఖాస్తు చేసకున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం‘రాజీవ్ యువ వికాసం’పై నిరుద్యోగుల ఆసక్తి ఇప్పటి వరకు జిల్లాలో 39,448 దరఖాస్తులు గడువు పెంపుతో మరింతగా పెరగనున్న దరఖాస్తులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం హైరానా సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నా.. రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశా. గత నాలుగు రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చివెళ్తున్నా. సర్టిఫికెట్ అందితే దరఖాస్తు చేసుకోవాలి. రుణం మంజూరైతే గేదెల యూనిట్ ఏర్పాటు చేసుకుంటా. – కుంచం భిక్షం, భైరవునిపల్లి, నేలకొండపల్లి మండలం -
ఈ నెల 10 నుంచి ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు
తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు వేంకటాచలపతి దేవస్థానం కమిటీ బాధ్యులు వెల్లడించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జట్లు పాల్గొంటాయని తెలిపారు. మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లకు దాతల చేయూతతో రూ.70,116, రూ.50116, రూ.40116, రూ.30116, రూ.25,116, రూ.20116, రూ.15,116, రూ.10,116 అందజేస్తామని పేర్కొన్నారు. ఒకేషనల్ పరీక్షకు 733 మంది హాజరు ఖమ్మంసహకారనగర్: ఎస్సెస్సీ ఒకేషనల్ పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 751 మంది విద్యార్థులకు గాను 733 మంది హాజరు కాగా, 18 మంది గైర్హాజరయ్యారని డీఈఓ తెలిపారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు తాను పలు సెంటర్లలో పరిశీలించామని వెల్లడించారు. కలెక్టరేట్లో కార్మికురాలికి పాముకాటు ఖమ్మంసహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని గార్డెన్‌ను శుభ్రం చేస్తున్న క్రమాన ఓ కార్మికురాలిని పాము కాటు వేసింది. కార్మికులంతా గురువారం గార్డెన్లో పనిచేస్తుండగా రఘునాథపా లెం మండలం వీ.వీ.పాలెంకు చెందిన ఆదిలక్ష్మి కాలిపై పాముకాటు వేయడంతో ఆమె ఆందోళ నకు గురైంది. దీంతో కలెక్టరేట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మిని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు చెప్పగా మెరుగైన వైద్యం అందించాలని సూచించిన కలెక్టర్ ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కలెక్టరేట్ ఏఓ అరుణ, హార్టికల్చర్ ఆఫీసర్ మధుసూదన్, కలెక్టరేట్ కేర్ టేకర్ వెంకన్న పాల్గొన్నారు. ‘యువ వికాసం’కు దరఖాస్తు చేసుకోండి ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ నిరుద్యోగులు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్ సూచించారు. అర్హత కలిగిన వారు టీఎస్ఓబీఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలు నేలకొండపల్లి: శ్రీరామనవమి సందర్భంగా మండల కేంద్రంలోని రామదాసు ధ్యాన మందిరంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల భక్తులు మూడు రోజుల నుంచి గోటి తలంబాలు చేస్తుండగా, గురువారం పసుపు, కుంకుమ కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు. అనంతరం శ్రీరామ నామంతో ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు సౌమిత్రి రమేశ్, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి ఆలయంలో చోరీపెనుబల్లి: మండలంలోని పాతకారాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు బుధవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగులగొట్టి సుమా రు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయా న్ని గురువారం ఉదయం గమనించిన నిర్వాహకులు గ్రామపెద్దలకు సమాచారం ఇవ్వగా వీఎం బంజర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరముందని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ అన్నారు. హెచ్‌సీయూ భూముల వేలాన్ని నిలిపివేయాలనే డిమాండ్‌తో గురువారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ మేరకు శ్రీశ్రీ సర్కిల్ నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వైపు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకుని అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత రామకృష్ణతో పాటు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శులు ప్రవీణ్, మస్తాన్, ఎం.సురేశ్ మాట్లాడారు. అక్రమ అరెస్టులను నిలిపివేసి యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాగం లోకేశ్, సుధాకర్, శివ, నాగుల్‌మీరా, రాజు, అజయ్, వంశీ, వినోద్, మనోజ్, సాగర్, భాను, ఉదయ్, ప్రతాప్, గోపి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు -
‘రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ’
సత్తుపల్లి/వేంసూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు సృష్టించడమే కాక రాజ్యాంగాన్ని అవమానిస్తోందని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు వేంసూరులో గురువారం జై బాపు, జై భీం, జైసంవిధాన్పై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గాంధీ, అంబేడ్కర్‌ను పార్లమెంట్లో అవమానించిన బీజేపీ పెద్దలు, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యాన బీజేపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక కాంగ్రెస్ పథకాలను వివరించాలని సూచించారు. నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ముక్కా శేఖర్‌గౌడ్, శివవేణు, గాదె చెన్నారావు, మందపాటి ముత్తారెడ్డి, ఆనంద్‌బాబు, తోట సుజలారాణి, చల్లగుండ్ల కృష్ణయ్య, అలవాల కరుణాకర్, కుమారి, కమల్‌పాషా, ఉడతనేని అప్పారావు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య లోపం ఎదురుకావొద్దు
ముదిగొండ: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం ఎదురుకాకుండా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. ముదిగొండ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేసిన ఆమె రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, పారిశుద్ధ్య సమస్య, నీటిఎద్దడి ఎదురుకాకుండా చూడాలని సూచించారు. డీఎల్పీఓ రాంబాబు, ఎంపీఓ వాల్మీకి కిశోర్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ట పాల్గొన్నారు. షాదీఖానా వద్ద ముస్లింల ఆందోళన ఖమ్మంమయూరిసెంటర్: ఏటా రంజాన్ తర్వాత జరుపుకునే ఈద్ మిలాప్ కార్యక్రమానికి అధికారులు కావాలనే అడ్డుపడుతున్నారని ముస్లింలు ఆందోళనకు దిగారు. ఖమ్మంలోని షాదీఖానాలో శుక్రవారం సాయంత్రం నిర్వహించుకునేందుకు తొలుత అనుమతి ఇచ్చిన అధికారులు రద్దు చేయడంపై గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేతల వైఖరితోనే ఇలా జరుగుతోందని వారు ఆరోపించారు. చివరకు షాదీఖానాలో శుక్రవారం ఈద్ మిలాప్ నిర్వహించుకునేందుకు తహసీల్దార్ అనుమతి ఇవ్వగా వారు ఆందోళన విరమించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. బధిరురాలి గర్భానికి కారణమైన బంధువు ● అరెస్ట్ చేసిన పోలీసులు తిరుమలాయపాలెం: పింఛన్ కోసం వచ్చే బంధువు, బధిరురాలైన మహిళను నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మండలంలోని సుబ్లేడులో మినీ ఏటీఎం నిర్వహిస్తున్న కామళ్ల వీరయ్య వద్దకు ఆయన బంధువు, 34 ఏళ్ల మూగ, చెవిటి మహిళ పింఛన్ కోసం వచ్చేది. ఈ క్రమంలో ఆమెను నమ్మించిన వీరయ్య శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులకు విషయం తెలియగా ఇటీవల ఆయనను నిలదీశారు. కానీ, ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించడంతో వారు పోలీ సులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత 25న కేసు నమోదు చేయగా, గురువారం వీరయ్యను అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. అసత్యప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు ఖమ్మంక్రైం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన కొందరు నాయకులు.. జేఏసీలో భాగస్వామ్య పక్షమైన టీఎన్జీవోస్ యూనియన్, హౌస్ బిల్డింగ్ సొసైటీపై అసత్యప్రచారం చేస్తున్నారని అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు వారిపై గురువారం ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఓ ప్రకటనలో వెల్లడించారు. -
దాచుకున్న డబ్బు బలవంతంగా ఎత్తుకెళ్లారు..
కొణిజర్ల: వృద్ధాప్యంలో తమకు అండగా నిలిచే వారికి ఇచ్చేలా దాచుకున్న నగదును మనవళ్లు లాక్కెళ్లారని వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని గద్దలగూడెంనకు చెందిన దేవళ్ల వెంకయ్య – గురువమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగగా, ముగ్గురు కొడుకులకు నాలుగెకరాల చొప్పున పొలం పంచి ఇచ్చారు. ఆపై అవసరాలకు రెండెకరాలు ఉంచుకోగా, ఇటీవల ఇద్దరూ అనారోగ్యం పాలవడంతో చికిత్స నిమిత్తం ఎకరంన్నర పొలం అమ్మగా వచ్చిన రూ.4.50 లక్షలు ఇంట్లో భద్రపరిచారు. ఈ నెల 2న వెంకయ్య పెద్ద కొడుకు రాములు కొడుకులైన నవీన్, శ్రీకాంత్ ఇంట్లోకి జొరబడి తమను కొట్టి డబ్బు ఎత్తుకెళ్లారని వాపోయారు. దీన్ని అడ్డుకున్న గురవమ్మను నెట్టివేయడంతో కాలు విరిగిందని తెలిపారు. కాగా, చాలాకాలం కిందటే రాములు మృతి చెందాడని వృద్ధులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు.మనవళ్లపై పోలీసులకు వృద్ధ దంపతుల ఫిర్యాదు -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..
నేలకొండపల్లి/ముదిగొండ: అభిృవృద్ధి పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో గురువారం పర్యటించిన ఆమె తొలుత నేలకొండపల్లిలో ఏళ్లుగా సాగుతున్న గ్రంథాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇకనైనా పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువశక్తి పథకం కౌంటర్, ఎంఈఓ కార్యాలయంలో యూనిఫాం వస్త్రం పరిశీలించగా, పలుచోట్ల డ్రెయినేజీలు, రోడ్లను శుభ్రం చేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని ఆమె ఆదేశించారు. ఆ తర్వాత ముదిగొండ మండలంలోని ముదిగొండ, గోకినేపల్లిల్లో గ్రంఽథాలయాలను అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించి, ముదిగొండలో భవనం శిథిలావస్థలో ఉన్నందున కొత్త భవనం నిర్మించే వరకు ఇతర చోటకు మార్చాలని సూచించారు. ఎంపీడీఓలు యం.యర్రయ్య, శ్రీధర్‌స్వామి, ఎంపీఓ సీహెచ్ శివ, ఐకేపీ ఏపీఎం శ్రీనివాసరావు, లైబ్రేరియన్ మచ్చా సత్యనారాయణ పాల్గొన్నారు. -
లక్ష్యాన్ని అధిగమించి..
● అధిక ఆదాయం సాధించిన మార్కెట్లు ● మార్కెట్ల ఫీజు రూ.65.56 కోట్లుగా నమోదు ● ఇందులో ఖమ్మం మార్కెట్ వాటా రూ.30.57 కోట్లు ● కాస్త వెనుకబడిన నేలకొండపల్లి, ఏన్కూరు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెరిగింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి మించి మార్కెట్ ఫీజులు వసూలయ్యాయి. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ల ఫీజు లక్ష్యం రూ.63.94 కోట్లు కాగా రూ.65.56 కోట్లు అంటే అదనంగా రూ.1.62 కోట్లు వసూలయ్యాయి. నేలకొండపల్లి, ఏన్కూరు మినహా అన్ని మార్కెట్లు లక్ష్యాన్ని దాటడం విశేషం. పంట విక్రయాల ధర ఆధారంగా కొనుగోలు చేసిన వ్యాపారులు, సంస్థల నుంచి మార్కెటింగ్ శాఖ ఒక శాతం పన్ను వసూలు చేస్తుంది. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవటం, జలాశయాల్లో నీరు ఉండడంతో పంటలు, ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. మిర్చితో పోలిస్తే మిగతా పంటలు ధరలు బాగానే ఉండడంతో పన్ను అదేస్థాయిలో వసూలైంది. మిర్చి ధర కూడా బాగుంటే మార్కెట్ల ఆదాయం మరింత పెరిగేది. సగం ఖమ్మం నుంచే.. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో సగభాగం ఖమ్మం మార్కెట్ నుంచే వసూలైంది. రాష్ట్రంలో పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం ఒకటి కాగా, ‘తేజా’ రకం మిర్చి కొనుగోళ్లు జోరుగా సాగుతుండడంతో ఈ మార్కెట్ ఫీజు లక్ష్యాన్ని దాటింది. ఖమ్మం మార్కెట్‌కు రూ.30.02 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా.. రూ.55 లక్షలు అదనంగా కలిపి రూ.30.57 కోట్లు వసూలవడం విశేషం. ఇది గతేడాదితో పోలిస్తే రూ.3 కోట్లు అదనమని అధికారులు వెల్లడించారు. ఇవి కూడా ముందుకొస్తే.. ఖమ్మం, మధిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లు లక్ష్యానికి మించి ఫీజు వసూలు చేయగా, నేలకొండపల్లి, ఏన్కూరు మార్కెట్లు వెనుకబడ్డాయి. నేలకొండపల్లి మార్కెట్‌కు రూ.3.78 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.66 కోట్లు, ఏన్కూరు మార్కెట్ రూ.4.87 కోట్లకు గాను రూ.3.43 కోట్లు వసూలయ్యాయి. ప్రభుత్వ సంస్థల నుంచి ఫీజులు పూర్తిస్థాయిలో వసూలైతే మార్కెట్లకు మరింతగా ఆదాయం పెరిగే అవకాశముంది.2024–25లో మార్కెట్ల వారీగా ఆదాయం (రూ.లక్షల్లో) మార్కెట్ లక్ష్యం వసూలు ఖమ్మం 3002.85 3057.91 మధిర 475.19 484.20 నేలకొండపల్లి 378.34 366.48 కల్లూరు 567.38 678.28 వైరా 673.58 694.93 ఏన్కూరు 487.70 343.18 సత్తుపల్లి 494.79 601.44 మద్దులపల్లి 315.10 330.04 మొత్తం 6,394.93 6,556.46 -
యూవీకెన్ సేవలు అభినందనీయం
కామేపల్లి: మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు యువరాజ్‌సింగ్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని డీఎంహెచ్ఓ కళావతిబాయి తెలిపారు. యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యాన కామేపల్లి మండలంలోని మహిళలకు ఉచితంగా రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, ఫౌండేషన్ సిబ్బందికి గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రతీ మహిళ రొమ్ము కేన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మండలంలో యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా 3,997 మందికి పరీక్షలు చేయగా, 48 మంది అనుమానితులకు నిర్ధారణ కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశాలకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. డిప్యూటీ డీంహెచ్ఓ డాక్టర్ సైదులు, డీఐఓ చందునాయక్, డీపీఓ దుర్గ, ఫౌండేషన్ జిల్లా మేనేజర్ హరిత భూపాలన్, సిబ్బంది సత్యవతి, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
గల్లాపెట్టె గలగల..!
ఉమ్మడి జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది గణనీయమైన ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2024 – 25 ఏడాదిలో 45,783 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.206.25 కోట్లు వచ్చాయి. 2023 – 24తో పోలిస్తే ఇది రూ.8 కోట్లు అదనమే అయినా.. 2022 – 23తో పోలిస్తే మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక గత ఆర్థిక సంవత్సరం కంటే తాజాగా ముగిసిన సంవత్సరంలో డాక్యుమెంట్లు పెరగడంతో అదేస్థాయిలో ఆదాయం నమోదైంది. 2024 – 25లో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మూడు జిల్లాల్లోనే రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగ్గా.. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా ఉంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంస్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు పెరిగిన ఆదాయం ● గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.206.25 కోట్ల రాబడి ● ఉమ్మడి జిల్లాలో 45,783 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ● గత ఏడాదితో పోలిస్తే రూ.8 కోట్లు అ‘ధనం11 కార్యాలయాలు.. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తోపాటు ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 45,783 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా రూ.206.25 కోట్ల ఆదాయం వచ్చింది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ఈ ఆదాయం నమోదైంది. 2023 –24లో 44, 201 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.198.21 కోట్ల ఆదాయం సమకూరింది. తగ్గిన రియల్ బూమ్.. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల తర్వాత ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగేది. కానీ కొద్ది నెలలుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది. ఖమ్మం చుట్టుపక్కల, రూరల్ ప్రాంతాల్లో కొద్దో గొప్ప వ్యాపారం నడుస్తున్నా.. జిల్లా కేంద్రంలో మాత్రం నామమాత్రమైంది. భూముల క్రయవిక్రయాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లూ జరగలేదు. రెండేళ్ల క్రితం 50వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగితే, గతేడాది నుంచి 50 వేల లోపే అవుతుండడం గమనార్హం. అయితే ఖమ్మంలో ప్రధాన రహదారుల వెంట ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే మళ్లీ వ్యాపారం ఊపందుకుంటుందని, తద్వారా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.2020–21 నుంచి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, ఆదాయం ఇలా.. ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం (రూ.ల్లో) 2020-21 50,276 100,05,20,114 2021-22 57,570 206,68,18,974 2022-23 47,102 227,34,80,000 2023-24 44,201 198,21,00,000 2024-25 45,783 206,25,00,000రూ.250 కోట్ల లక్ష్యం ప్రభుత్వం ఈ ఏడాది (2025–26) స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఆ మేరకు ఆదాయం వచ్చేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లకు పైగా ఆదాయం వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు అందనున్నట్లు తెలిసింది. -
ముందుకొస్తే.. రాయితీ
● ఈ నెల 30లోగా ఆస్తి పన్ను కడితే ఐదు శాతం రిబేట్ ● కేఎంసీ, మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపుదారులకు అవకాశం ఖమ్మంమయూరిసెంటర్: పుర, నగర పాలక సంస్థలకు నిధుల లేమి నుండి ఊరట లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రకటించింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఈ పథకం ద్వారా ఐదు శాతం రాయితీ లభిస్తుంది. దీంతో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఎక్కువ మొత్తంలో ఇంటి పన్నులు వసూలు చేసేలా ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 82,148 అసెస్మెంట్లు ఉండగా.. 51,771 అసెస్మెంట్లకు 5శాతం రాయితీ దక్క నుంది. దీంతో వీరందరూ ఈ నెలలోనే పన్ను చెల్లించేలా అవగాహన కల్పించనున్నారు.ఈనెలాఖరు వరకు రాయితీ.. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మధిర, వైరా, సత్తుపల్లి, ఏదులాపురం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ యా ప్రాంతాల్లో ఆస్తిపన్ను ఈనెలలో చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చే ఐదు శాతం రాయితీ అమలవుతుంది. 2024–25 ఏడాది వరకు పూర్తిగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి మాత్రమే పన్ను రాయితీ అందుతుందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ మార్చి వరకు ఉన్న బకాయిలను జరిమానాతో చెల్లించి, 2025–26 ఏడాదికి సంబంధించిన పన్ను చెల్లించినా ఐదుశాతం రాయితీ వస్తుందని తెలిపారు. ఈమేరకు ఈనెల 30వ తేదీ లోగా సీడీఎంఏ వెబ్సైట్ ద్వారా పన్ను చెల్లించాలని సూచించారు. -
రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగపడనున్నందున యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీ వరకు వరకు రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆన్లైన్లో లేదా ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీ యూనిట్లు మంజూరవుతాయని, వ్యవసాయేతర యూనిట్లకు 21–55 ఏళ్లు, వ్యవసాయ యూనిట్లకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఆధాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. పత్రాల అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు మూడు రోజుల్లో జారీ చేసేలా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మండల, గ్రామ జనాభాకు అనుగుణంగా కేటాయించిన లక్ష్యాల ప్రకారం యూనిట్ల మంజూరు ఉంటుందని, పత్రాల కారణంగా మంజూరు ఆపబోమని తెలిపారు. స్క్రూ టినీని ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనుండగా.. యూనిట్ల ఆధారంగా అభ్యర్థులకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. అర్హులందరికీ బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరిగా పనిచేయని డీలర్లపై చర్యలు జిల్లాలోని అన్ని రేషన్‌షాప్‌ల ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వెల్లడించారు. ఇదేసమయాన డీలర్ల యాజమాన్య వివరాలను తనిఖీ చేస్తూ, సరిగ్గా పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీ నవీన్‌బాబు, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ అధికారులు జి.జ్యోతి, ఎన్.విజయలక్ష్మి, డాక్టర్ బి.పురంధర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి.శ్రీలత పాల్గొన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరుపై దృష్టి అన్ని రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30గంటల కు కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని గంగమ్మతల్లి ఆలయంలో పూజలు చేయనున్న మంత్రి, ఆతర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జుజ్జుల్‌రావుపేట, తుమ్మలతండా, ధర్మాతండా మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లికి చేరుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత వరంగల్ క్రాస్‌రోడ్డులో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, గూడూరుపాడు–గోళ్లపాడు ఊటవాగు తండాకు బీటీ రోడ్డు, కస్నాతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్ధాపన చేశాక కాచి రాజుగూడెం మీదుగా ఖమ్మం చేరుకుంటారు.మంత్రి తుమ్మల...రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటిస్తారు. ఖమ్మం 44డివిజన్ శ్రీరాంనగర్‌లో రైతుబజార్ ను ప్రారంభించనున్న మంత్రి, ఆతర్వాత మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ప్రయాణికులు, సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లుకల్లూరు: ఎండల కారణంగా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా కల్లూరు కొత్త బస్టాండ్‌లో ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీని ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా ఏటా మాదిరిగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మూడు నెలలుగా దాతల సాయంతో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఆ తర్వాత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ వీఎస్ఆర్.ప్రసాద్ కుటుంబాన్ని రీజినల్ మేనేజర్ సరిరామ్ పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబీకులతో మాట్లాడారు. సంస్థ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈకార్యక్రమాల్లో సత్తుపల్లి, ఖమ్మం డిపో మేనేజర్లు యు.రాజ్యలక్ష్మి, దినేష్‌కుమార్, కల్లూరు మెడికల్ ఆఫీసర్ నవ్యకాంత్, వీబీఓ కిన్నెర ఆనందరావు, కంట్రోలర్ యంగళ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.నేడు, రేపు ఉపాధ్యాయులకు శిక్షణనేలకొండపల్లి: గత ఏడాది జూన్‌లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపుదల, పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,087 మంది పీజీ హెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. వీరిని కేటగిరీల వారీగా విభజించి ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఖమ్మం రోటరీనగర్‌లోని జెడ్పీహెచ్ఎస్తో పాటు ఎన్నెస్పీ కాలనీ, రాజేంద్రనగర్, రిక్కాబజార్, శాంతినగర్, ఇందిరానగర్, ఖాజీపుర జీహెచ్ఎస్ల్లో శిక్షణకు అధికారులు నిర్ణయించారు.జేఈఈ మెయిన్స్ ప్రారంభంఖమ్మంసహకారనగర్: జిల్లాలో జేఈఈ మెయి న్స్ రెండో పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలోని విజయ, శ్రీచైతన్య, బొమ్మ, ఎస్బీఐటీ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయగా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం పరీక్షకు 498మందిలో 454 మంది, మధ్యాహ్నం సెషన్లో 534మంది కి గాను 490మంది విద్యార్థులు హాజరయ్యారు.ఎరువుల దుకాణాల్లో డీఏఓ తనిఖీఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని తల్లంపాడు, ముత్తగూడెం, నాయుడుపేట, ఆరేకోడులోఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా షాపుల్లో నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన ఆయన ప్రతీ అమ్మకంపై బిల్లు ఇవ్వాలని, స్టాక్ వివరాలతో రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. డీలర్లు అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏఓ ఉమానగేష్ తదితరులు పాల్గొన్నారు. -
మరో 28 రోజులు ఎల్ఆర్‘ఎస్’
● ఈనెల 30 వరకు గడువు పెంచిన ప్రభుత్వం ● జిల్లాలో ఇప్పటివరకు రూ.66.32 కోట్ల ఆదాయం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్ఆర్ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ద్వారా స్థలాల క్రమబద్ధీకరణకు ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం ఈ గడువును మరికొద్ది రోజులు పొడిగించింది. ఏళ్లుగా పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కరించేలా ప్రభుత్వం ఫిబ్రవరి 20న రాయితీ ప్రకటించింది. గత నెల 31వ తేదీతో గడువు ముగియగా ఆశించిన స్థాయిలో స్పందన రాని కారణంగా గడువు పెంచింది. ఖమ్మంకు రాష్ట్రంలో రెండో స్థానం.. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లలో దరఖాస్తుల పరిశీలన, అనుమతి, ఫీజు చెల్లింపుల్లో వరంగల్ తర్వాత ఖమ్మం కార్పొరేషన్ రెండో స్థానంలో నిలిచింది. కేఎంసీ పరిధిలో 40,182 దరఖాస్తులు రాగా.. 28,783 మంది ఫీజు చెల్లించేందుకు అనుమతి లభించింది. ఇందులో 7,071 మంది ఫీజు చెల్లించారు. 25శాతం రాయితీ అమల్లోకి వచ్చిన నాటినుంచి ఫ్లెక్సీలు, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో లబ్ధిదారులు ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చినా మార్చి నెలాఖరులో కొన్ని సమస్యల కారణంగా ఇబ్బంది ఏర్పడింది. మున్సిపాలిటీల్లో నత్తనడకన కేఎంసీలో ఈ ప్రక్రియ వేగంగానే ఉన్నా, మున్సిపాలిటీల్లో మాత్రం నత్తనడకన కొనసాగుతోంది. సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లించేందుకు పలువురు ఇంకా ముందుకు రావడం లేదు. ఈ మున్సిపాలిటీల్లో 25,002 దరఖాస్తులకు గాను 19,443 దరఖాస్తులకు అనుమతి జారీ చేసి లబ్ధిదారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఇందులో కేవలం 3,220 మందే ఫీజు చెల్లించడం గమనార్హం. ప్రస్తుతం గడువు పెంచిన నేపథ్యాన మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది ఫీజు చెల్లించేలా అవగాహన కల్పించాల్సిన అవసరముంది. లబ్ధిదారులు కూడా ముందుకొస్తే వారి స్థలాలపై చట్టబద్ధమైన హక్కులు దక్కనున్నాయి. కార్పొరేషన్‌దే సింహభాగం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా నమోదైన ఆదాయంలో అత్యధిక భాగం ఖమ్మం కార్పొరేషన్ నుంచే వచ్చింది. ఖమ్మం కార్పొరేషన్, సుడా, సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో కలిపి ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.66.32 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.39.93 కోట్లు కేఎంసీ పరిధి నుంచే రావడం విశేషం. ఖమ్మం కార్పొరేషన్లలో స్థలాలు ఉండి క్రయవిక్రయాలకు ఇబ్బంది ఎదురవుతుండడంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ వైపు మొగ్గు చూపారు. కాగా, వైరా మున్సిపాలిటీలో రూ.1.58 కోట్లు, మధిర మున్సిపాలిటీలో రూ.3.2 కోట్లు, ఏదులాపురంలో రూ.7.25 కోట్లు, సత్తుపల్లి మున్సిపాలిటీలో రూ.2.39 కోట్లు ఆదాయం రాగా, సుడా పరిధిలో రూ.11.97 కోట్లు లభించాయి.గత నెల 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు అనుమతి చెల్లించింది ఖమ్మం 40,182 28,783 7,071 వైరా 3,529 3,125 400 మధిర 4,287 3,744 602 ఏదులాపురం 13,496 9,459 1,726 సత్తుపల్లి 3,690 3,115 492 సుడా 21,021 19,482 4,664 -
ముంచెత్తిన ఎర్రబంగారం
● ఖమ్మం మార్కెట్‌కు 70వేలకు పైగా బస్తాల మిర్చి ● ధర పతనంతో రైతుల్లో ఆవేదనఖమ్మంవ్యవసాయం: నాలుగు రోజుల సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నలమూలల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి సైతం రైతులు మిర్చితో మంగళవారం సాయంత్రం నుంచే రావడం మొదలుపెట్టారు. దీంతో బుధవారం ఉదయంకల్లా 70వేలకు పైగా బస్తాల మిర్చి రావడంతో మార్కెట్ నలుమూలలా ఎర్రబంగారంతో నిండిపోయింది. పురోగతి లేని ధర మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది. ఓ పక్క విదేశీ ఎగుమతులు లేకపోవడం, మరోవైపు విక్రయాలు పెరగడం ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ సాగు చేసే తేజా రకం మిర్చిని చైనా దేశానికి ఎగుమతి చేస్తారు. గత ఏడాది ఆర్డర్లు ఉండడంతో క్వింటాకు రూ.20నుంచి రూ.23 వేల మేర ధర పలికింది. ఈసారి చైనాలోనే పంట సాగవడంతో ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక ధరపై ప్రభావం చూపిస్తోంది. ఈ సీజన్ ఆరంభంలో రూ.16వేల వరకు నమోదైన ధర మార్చి 10వ తేదీ వరకు గరిష్టంగా రూ.14వేలు పలికింది. ఆతర్వాత ఇంకా తగ్గుతూ రూ.13,300కు చేరడం గమనార్హం. అయితే, గరిష్ట ధరతో పొంతన లేకుండా నాణ్యత పేరిట దాదాపు రూ.2వేలకు పైగా తగ్గించి ఎక్కువ సరుకును రూ.11వేల నుంచి రూ.11,500తోనే కొనుగోలు చేస్తున్నారు. ఏపీ ప్రభావం కూడా.. ఖమ్మం మార్కెట్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని పలు జిల్లాల నుంచి రైతులు మిర్చి తీసుకొస్తున్నారు. సగటున లక్ష బస్తాల వరకు మిర్చి విక్రయానికి వస్తున్న నేపథ్యాన విదేశీ ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు తక్కువ ధర నిర్ణస్తున్నారు. దీనికి తోడు ఏపీ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం పీడీపీసీ(ప్రైస్ డిఫరెన్స్ పేమెంట్ స్కీం)ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మిర్చి క్వింటా ధర రూ.11,718గా నిర్ణయించారు. ఏపీ రాష్ట్రం ఖమ్మంకు పొరుగునే ఉండడంతో అక్కడి ధర చెల్లించినా ఇబ్బంది లేదనే భావనతో వ్యాపారులు కాస్త అటూఇటుగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.కొద్దినెలలుగా ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు (రూ.ల్లో) తేదీ గరిష్టం మోడల్ డిసెంబర్ 9 16,500 16,000 20 16,000 15,600 జనవరి 17 15,500 15,000 24 15,000 14,800 ఫిబ్రవరి 2 14,200 13,700 24 14,125 13,600 మార్చి 10 14,000 13,300 18 13,700 12,000 19 13,500 11,500 25 13,350 11,000 ఏప్రిల్ 2 13,300 12,000ఈ ఏడాది నష్టమే... ఈ ఏడాది ఎకరాకు శ్రమ కాక రూ.30వేల నుంచి రూ.50వేల వరకు నష్టం వాటిల్లింది. రెండు ఎకరాల్లో మిర్చి సాగుచేయగా, 55 బస్తాలు విక్రయానికి తీసుకువచ్చా. నాణ్యత లేదని క్వింటాకు రూ.12 వేల నుంచి రూ.13 వేలే చెల్లించారు. అయినా అవసరాల రీత్యా అమ్మక తప్పలేదు. – బ్రహ్మయ్య, చిమ్మపుడి, రఘునాథపాలెం మండలంధర బాగా పడిపోతోంది.. వ్యాపారులు చెప్పిన ధరకు అమ్మక తప్పని పరిస్థితి ఉంది. 13 బస్తాల మిర్చి విక్రయానికి తీసుకువచ్చా. రూ.12వేల ధర పెట్టారు. నాణ్యత లేదని మరో ఆరు బస్తాల మిర్చి క్వింటాకు రూ.10వేలే చెల్లించారు. ఈ ధరతో పెట్టుబడులు కూడా పూడవు. నెల క్రితం కన్నా ధర మరింత పడిపోయింది. – భూక్యా అమ్రు, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా -
ఏ.ఐ. బోధన ఎలా అమలవుతోంది?
నేలకొండపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విధానంలో బోధన ఎలా సాగుతోందని విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మిబాయి ఆరా తీశారు. నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని ప్రాథమిక పాఠశాలను బుధవారం తనిఖీ చేసిన ఆమె ఏ.ఐ. బోధన అమలు, విద్యార్థులను ప్రగతిని పరిశీలించారు. కంప్యూటర్లపై పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ అభినందించారు. కాగా, చదువులో వెనుకబడిన విద్యార్థులు సైతం ముందు వరుసకు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఏడీ సూచించారు. అనంతరం స్థానిక పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన ఆమె రామదాసు ధ్యాన మందిరం, బౌద్ధక్షేత్రాన్ని సందర్శించి నేపథ్యాన్ని తెలుసుకున్నారు. ఎంఈఓ బి.చలపతిరావు, సింగారెడ్డిపాలెం హెచ్ఎం హరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసం రీచ్‌ల పరిశీలన
బోనకల్: ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తుండడంతో లబ్ధిదారులు ఇసుక కోసం ఇబ్బంది పడకుండా అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా బోనకల్ మండలంలోని వైరా ఏరు పరీవాహక గ్రామాలైన బ్రాహ్మణపల్లి, రాయన్నపేట, కలకోట, మోట మర్రిల్లో రీచ్‌లను మైనింగ్, రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. రీచ్‌ల్లో నాణ్యతతో పాటు లభ్యతను సర్వేయర్ సమక్షాన పరిశీలించినట్లు మైనింగ్ ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు. మండలంలోని 22గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక సరఫరాపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆర్ఐ మైథిలి, సర్వేయర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. కండక్టర్ నిజాయితీ.. మధిర: ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన పర్స్, నగదును ఆయనకు అందజేసిన కండక్టర్ నిజాయితీ చాటుకుంది. మధిర డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు బుధవారం విజయవాడ నుంచి మధిర వస్తోంది. మార్గమధ్యలో దిగిన అల్లూరి వెంకట కృష్ణారావు తన పర్స్ మర్చిపోగా, మధిర వచ్చాక కండక్టర్ ఇ.రాధిక గమనించింది. అందులో రూ.10,500 నగదు, ఇతర కార్డులు ఉండడంతో అందులోని నంబర్ ఆధారంగా వెంకటకృష్ణారావుకు ఫోన్ చేయగా, ఆయన రావడంతో పర్స్ అందజేశారు. దీంతో ఆయన కండక్టర్, డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ నాయకులపై కేసు కొట్టివేత ఖమ్మం లీగల్: పెట్రోల్ ధరలను అదుపు చేయాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలో పాల్గొన్న నాయకులపై నమోదైన కేసును ఖమ్మం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 2020 ఫిబ్రవరి 21న పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ సీపీఐ నాయకుడు భాగం హేమంతరావు ఆధ్వర్యాన నిరసన తెలపగా అప్పటి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, జానీమియా, పోటు కళావతి, సింగు నరసింహారావు, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొనగా ఖమ్మం టూటౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా సరైన సాక్షాధారాలు లేనందున నాయకులపై కేసు కొట్టివేస్తూ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. ముద్దాయిల తరఫున న్యాయవాదులు ఓరుగంటి శేషగిరిరావు, తోట రామాంజనేయులు వాదించారు. మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్ తిరుమలాయపాలెం: ఎలాంటి అనుమతులు లేకుండా మట్ట తరలిస్తున్న రెండు డంపర్లతో పాటు రెండు ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. తిరులాయపాలెం సమీపాన చేపట్టిన తనిఖీల్లో మట్టి తరలిస్తున్న వాహనాలకు అనుమతి లేదని గుర్తించారు. ఈసందర్భంగా వాహనాలను పోలీసులకు అప్పగించగా సీజ్ చేశారు. జిల్లాకు ఈదురుగాలులు, వర్ష సూచన ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని వాతావరణంలో బుధవారం సాయంత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 5వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో బుధవారం సాయంత్రం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గగా.. వాతావరణ కేంద్రం ప్రకటించిన జాబితాలో ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలు కూడా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 2నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశముందని వెల్లడించడంతో ఉమ్మడి జిల్లాలో 40 – 41 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయితే, యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న చేతికి వస్తున్న వేళ ఈదురుగాలులు వీస్తాయని, వర్షం కురిసే అవకాశముందన్న సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వరి, మొక్కజొన్న కోతలు పూర్తిచేసి కల్లాల్లో ఆరబెట్టారు. అలాగే, మిర్చి కోతలు కూడా చివరి దశకు చేరాయి. ఈ సమయంలో వర్షం కురిస్తే నష్టపోయే ప్రమాదమున్నందున పంటల రక్షణలో రైతులు నిమగ్నమయ్యారు. ఇక ఈదురుగాలులు వీస్తే మామిడికాయలు రాలే ప్రమాదమున్నందున రైతులు, కౌలుదారుల్లో ఆందోళన నెలకొంది. 1.20 కేజీల గంజాయి స్వాధీనం ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి క్రాస్‌లో బైక్‌పై తరలిస్తున్న 1.20 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఆర్.కే.బజార్‌కు చెందిన ఎండీ.అబ్దుల్ ఫైసల్, బల్లేపల్లికి చెందిన ఎస్.కే.జమాల్, ఎస్.కే.సమీర్, ప్రకాష్‌నగర్‌కు చెందిన నల్లగట్ల దీపక్ ఖమ్మం నుండి ముదిగొండ వైపు ఒకే బైక్‌పై వెళ్తుండగా పోలీసులు తనిఖీచేశారు. వీరి వద్ద గంజాయి లభించడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
పది.. పరీక్షలు ముగిసాయోచ్!
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించగా, 16,417 మంది విద్యార్థుల్లో 16,383 మంది హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. జిల్లా స్థాయి పరిశీలకులు నాలుగు సెంటర్లు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఒక సెంటర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో 39 సెంటర్లతో పాటుతాను ఏడు సెంటర్లలో తనిఖీ చేశామని డీఈఓ వెల్లడించారు. కాగా, చివరి పరీక్ష రాసి సెంటర్ల నుంచి బయటకు రాగానే విద్యార్థులు స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారిని తల్లిదండ్రులు, బంధువులు లగేజీతో సహా స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మిత్రులకు భారంగా వీడ్కోలు పలుకుతూ సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. – ఫొటోలు : స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
నెలాఖరులోగా ప్లాస్టిక్ రహితం
ఖమ్మంసహకారనగర్: ఈ నెలాఖరు నాటికి అన్ని మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్లాస్టిక్ నియంత్రణపై సమీక్షించారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని, ఏప్రిల్ తర్వాత ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని తెలిపారు. అలాగే, కార్యాలయాల వద్ద చలివేంద్రాల నిర్వహణను పర్యవేక్షించాలని, గ్రామాలు, మున్సిపాలిటీల్లోని బస్టాప్‌లు, ఆటో స్టాండ్ల వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీ నవీన్‌బాబు, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ అధికారులు జ్యోతి, విజయలక్ష్మి, డాక్టర్ బి.పురంధర్, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళి ఖమ్మంమయూరిసెంటర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నివాళులర్పించారు. కలెక్టరేట్లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, కలెక్టరేట్ ఏఓ అరుణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గౌడ సంఘం నాయకులు మిత్రు గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన అవసరం ఖమ్మంమయూరిసెంటర్: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మంజూరు చేస్తున్న యూనిట్లలో నాణ్యత పాటిస్తూ వ్యాపారాలు విస్తరించుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్ బస్టాప్ వద్ద ఇందిరా మహిళా శక్తి సీ్త్ర టీ స్టాల్‌ను పరిశీలంచిన ఆయన నిర్వాహకురాలితో మాట్లాడారు. వేసవి దృష్ట్యా బటర్ మిల్క్, పండ్ల రసాలు, లస్సీ అమ్మకాలపై దృష్టి సారించాలని సూచించిన ఆయన ఆమె వినతితో టీ తాగారు. మహనీయుల జయంతి వేడుకలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో సూచించారు. ఈనెల 5న జగ్జీవన్ రామ్, 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని మండల కార్యాలయాల్లో అమలు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ప్రజల్లోకి ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’
ఖమ్మంవన్‌టౌన్/నేలకొండపల్లి: దేశ ఉజ్వల భవిష్యత్ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సంవిధాన్ కోఆర్డినేటర్ మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఖమ్మం 18వ డివిజన్‌తో పాటు నేలకొండపల్లిలో నిర్వహించిన సంవిధాన్ యాత్రలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి ఆమిత్‌షా వ్యాఖ్యలు అహంకారపూరితమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి తీరుతో పాటు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న కుట్రలను ప్రజలకు ఈ యాత్ర తెలియజేయాలని సూచించారు. అంతేకాక రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు లక్ష్మీమనోహర్, చామకూరి వెంకటనారాయణ, పాకాలపాటి విజయనిర్మల, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, మహ్మద్ ఖాదర్, శేషగిరి, గజ్జెల్లి వెంకన్న, పాలకుర్తి నాగేశ్వరరావు, బాణాల లక్ష్మణ్, ప్రతిభారెడ్డి, మడూరి సైదారావు, భద్రయ్య, కొడాలి గోవిందరావు, బొందయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, వెంకన్న, కడియాల నరేష్, గుండా బ్రహ్మం, లక్కం ఏడుకొండలు, మైశా శంకర్ తదితరులు పాల్గొన్నారు.రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి -
శ్రీవారి పాదాలకు అష్టోత్తర కలశాభిషేకం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాలుగో రోజైన బుధవారం శ్రీవారి పాదాలకు అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించిన అర్చకులు, ఆతర్వాత స్వామి, అమ్మవార్లను అలంకరించి పల్లకీ సేవ చేశారు. అనంతరం స్వామిని గజ వాహనంపై గిరిప్రదక్షిణ చేయించగా పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4న జరిగే కల్యాణానికి హాజరుకావాలని ఖమ్మంలో కలెక్టర్ ముజ్మిమిల్ఖాన్కు ఈఓ కె.జగన్మోహన్రావు ఆహ్వాన పత్రిక అందజేశారు. -
భగవద్గీత పోటీల్లో బంగారు పతకాలు
చింతకాని/కల్లూరు: చింతకాని మండలంలోని బస్వాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డి.ఉమలత, కల్లూరుకు చెందిన ధరావత్ సామ్రాజ్యం భగవద్గీత శ్లోకాల కంఠస్త పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు గెలుచుకున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆధ్వర్యాన గత నెల 21న జాతీయ స్థాయిలో ఆన్లైన్ ద్వారా భగవద్గీతలోని 18అధ్యాయాలు, 700 శ్లోకాల కంఠస్త పోటీలు నిర్వహించగా వీరు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు ఖమ్మంవైద్యవిభాగం: విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ సూచించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఈ మెయిల్, ఫేస్ బుక్ ఖాతాలతో పాటు బెట్టింగ్ గేమ్‌ల ద్వారా నగదు మోసాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. ఈమేరకు గుర్తుతెలియని సైట్లు, వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు ఫోన్ చేయడం లేదా www. cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ సరితతో పాటు సైబర్ క్రైమ్ ఎస్సై రంజిత్‌కుమార్, ఉద్యోగులు ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాటిచెట్టు పైనుండి పడి గీతకార్మికుడు మృతి కొణిజర్ల: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుండి పడిన గీతకార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొండవనమలలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన తీగల సత్యం(57) మంగళవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కే క్రమాన కింద పడ్డాడు. దీంతో ఆయనను ఆయనను 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సత్యం భార్య స్వరూప ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మున్నేటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ముదిగొండ: మండలంలోని వల్లాపురంలో మున్నేటిలో గుర్తుతెలియని వ్యక్తి(32) మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. సదరు వ్యక్తి నేవీ బ్లూ కలర్ ప్యాంట్, నలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడని, ఆయన ఆచూకీ తెలిసిన వారు సమాచచారం ఇవ్వాలని ముదిగొండ సీఐ మురళి సూచించారు. కాగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం బుర్హాన్‌పురానికి చెందిన బత్తినేని రేణుక వద్ద రాపర్తినగర్‌కు చెందిన వెడగోట్టు హన్మంతు 2018 జూలైలో రూ.4లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2019 ఫిబ్రవరిలో రూ.4.50లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో నగదు లేక తిరస్కరణ గురైంది. దీంతో రేణుక తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈఈ కేసు విచారణ అనంతరం హన్మంతుకు ఆరు నెలల శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.4.50లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌కు నివాళి
ఖమ్మంక్రైం/వైరా రూరల్: నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ మంగళవారం రాత్రి ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బండి కృష్ణ మృతదేహం వద్ద పోలీసు ఉద్యోగులు నివాళులర్పించారు. పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, నేలకొండపల్లి, వైరా ఎస్సైలు సంతోష్, ఏవీకే.భాగ్యరాజ్ తదితరులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం కృష్ణ మృతదేహాన్ని స్వగ్రామమైన వైరా మండలం రెబ్బవరం తరలించగా 2009బ్యాచ్ కానిస్టేబుళ్లు మాతంగి విజయ్, భూక్యా బాల్య, కొలికపాక రంగారావు తదితరులు నివాళులర్పించి దహన సంస్కారాలకు రూ.10 వేల నగదు అందజేశారు. -
12ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు..
మహిళను స్వగ్రామానికి చేర్చిన ‘అన్నం’ ఖమ్మంఅర్బన్: గత 12ఏళ్ల క్రితం కుటుంబానికి దూరమైన వృద్ధురాలిని చేరదీసి చికిత్స చేయించిన ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ బాధ్యులు ఆమె కోలుకున్నాక కుటుంబం చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. గత ఫిబ్రవరిలో ఖమ్మం పాత బస్టాండ్ పరిసరాల్లో 50 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధురాలు భిక్షాటన చేస్తుందనే సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆమెకు ఆశ్రయం కల్పిస్తూనే చికిత్స చేయించారు. దీంతో ఇటీవల కోలుకున్న ఆమె తన పేరు గౌరమ్మ అని, స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామమని, భర్త పేరు నరసింహగా వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా అక్కడి పోలీసులకు, వారి ద్వారా కుటుంబానికి తెలపగా గౌరమ్మ ఫొటోను చూసిన ఆమె తమ్ముడు ప్రసాద్ 12 ఏళ్ల క్రితం తమ సోదరి కనిపించకుండా పోయిందని, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. దీంతో ఆమెను అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావును ఖమ్మం నుండి వాహనంలో పెద్దహోత్తురు తీసుకెళ్లి అలూరు సీఐ రాజు వెంకటేష్ సమక్షాన కుటుంబానికి అప్పగించారు. ఈమేరకు గౌరమ్మను అక్కున చేర్చుకున్న వారు శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. -
సన్నాల సంబురం
● రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ● పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ● సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకే మండలంలో ప్రారంభంఖమ్మంసహకారనగర్: రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ మంగళవారం ప్రారంభమైంది. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు రెండు, మూడు రోజులుగా షాపులకు చేరవేస్తున్నారు. ఈక్రమాన మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, సింగరేణి మండలం భాగ్యనగర్ తండాల్లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, అలాగే పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి లాంఛనంగా ప్రారంభించగా.. ఖమ్మం అర్బన్ మండలం చర్చి కాంపౌండ్‌లోని షాప్‌లో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీటీ విజయ్‌కుమార్, ఆర్ఐ వహీద్ తదితరులు పాల్గొన్నారు. మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సత్తుపల్లిలో మాత్రం పెనుబల్లి మండలంలోనే ప్రారంభమైంది. మిగతా మండలాల్లో బుధవారం నుంచి పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు సూచించినట్లు తెలుస్తుండగా.. విషయం తెలియని లబ్ధిదారులు షాప్‌ల చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదక్షిణలు చేశారు. షాపుల్లో డీఎస్ఓ తనిఖీ ఖమ్మంరూరల్: సన్నబియ్యం పంపిణీని ఖమ్మం రూరల్ మండలంలోని పలు షాపుల్లో డీఎస్ఓ చందన్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. పెదతండాలోని రేషన్ షాప్ తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యాన్ని లబ్ధిదారులు విని యోగించుకోవాలని సూచించారు. డీలర్లు సకాలంలో షాపులు తెరవాలని తెలిపారు. కాగా, గతంలో మాదిరిగానే జిల్లాలోని ఏ షాప్‌లోనైనా పోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకోవచ్చని డీఎస్ఓ వెల్లడించారు. మహిళల్లో ఆనందం నేలకొండపల్లి: రేషన్‌షాప్‌ల ద్వారా మంగళవారం నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారనే సమాచారంతో లబ్ధిదారులు ఉదయాన్నే షాపుల వద్దకు చేరుకున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండగా బియ్యం తీసుకున్నాక నాణ్యతను పరిశీలించడం కనిపించింది. అంతేకాక పలువురు తమ ఇళ్లలో అప్పటికప్పుడు కొద్దిపాటి బియ్యంతో అన్నం వండి ఎలా అయిందోనని పరిశీలించడమేకాక ఇరుగుపొరుగు వారితో చర్చించారు. ఇన్నాళ్లు రేషన్‌షాపుల్లో దొడ్డుబియ్యం ఇస్తుండగా లబ్ధిదారులు ఎక్కువ మంది ఆసక్తి కనబర్చలేదు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ మొదలవడంతో అందరూ తీసుకునే అవకాశముందని డీలర్లు భావిస్తున్నారు.మాలాంటి వారికి మేలు సన్నబియ్యం తీసుకోవడం ఆనందంగా అనిపించింది. రేషన్ షాపుల్లో సన్నాలు అందిస్తూ పేదలకు ప్రభుత్వం చాలా మేలు చేస్తోంది. ఇంట్లో సన్నబియ్యం ఉంటే మాలాంటి కుటుంబాలకు ఎంతో ధైర్యం. – కణతాల లీల, కోరట్లగూడెం ఇకపై రేషన్ బియ్యమే.. ఇప్పటివరకు దొడ్డు బియ్యం కావడంతో చాలా మంది షాప్‌ల్లో తీసుకోకపోయేవారు. ప్రస్తుతం సన్నబియ్యం కావడంతో అందరూ రేషన్ బియ్యమే తింటారు. ఈ పథకంతో పేదలకు ఎంతో మేలు జరగనుంది. – బచ్చలకూరి వెంకట్రావమ్మ, నేలకొండపల్లి చాలా ఆనందంగా ఉంది... రేషన్‌షాప్‌లో ప్రతీనెలా దొడ్డు బియ్యం వచ్చేవి. అవి బాగుండక ఎక్కువ ధర పెట్టి సన్నబియ్యం కొనేవాళ్లం. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుండడంతో మా బాధలు తప్పడం ఆనందంగా అనిపిస్తోంది. – మార్తి సౌవిత్రి, కోరట్లగూడెం -
నేడు ‘జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ యాత్ర’
ఖమ్మం వన్‌టౌన్: ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. బుధవారం ఉదయం 9గంటలకు ఖమ్మం 18వ డివిజన్ శ్రీరాంహిల్స్ నుంచి మొదలయ్యే యాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈసందర్భంగా అంబేద్కర్, మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మండడపు లక్ష్మి మనోహర్, పాకాలపాటి విజయ, నిర్మల శేషగిరి, ఆళ్ల నిరీష అంజిరెడ్డి, చామకూరి వెంకటనారాయణ, అలియా తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం బేఫికర్
ట్రామా కేర్ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా వందలాది కి.మీ. మేర జాతీయ రహదారులు వెళ్తున్నాయి. త్వరలోనే ఖమ్మం–దేవరపల్లి హైవే కూడా అందుబాటులోకి రానుంది. అయితే, నాణ్య మైన రహదారులు ఉండడంతో వాహనాలు రయ్రయ్ మంటూ సాగుతుండగా ప్రమాదాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు అత్యవసరంగా చికిత్స అందించేలా ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సెంటర్లు ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు లేకపోగా.. క్షతగాత్రుల చికిత్సకు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అత్యవసర చికిత్స అందక బాధితులను ఖమ్మంకే తరలిస్తున్నారు. ఇక్క డా పరిస్థితి చక్కబడకపోతే హైదరాబాద్ పంపిస్తండడం.. ఇంతలోనే విలువైన సమయం గడిచిపోయి బాధితుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. 35 కి.మీ.కు ఒకటి.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. మృతుల కుటుంబాలకు తీరని వేదన మిగులుతోంది. ఏదైనా రహదారిపై ప్రమా దం జరిగినప్పుడు తొలి అర గంట, గంటలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. దీనిని వైద్యులు గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఈనేపథ్యాన క్షతగాత్రులకు సత్వరమే వైద్యం అందేలా రాష్ట్ర వ్యాప్తంగా 90 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 35 కి.మీ. దూరానికి ఒకటి ఏర్పాటుచేయనుండగా.. భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, తల్లాడ, మధిర, పాలేరు వంటి ప్రాంతాల్లో జాతీయ రహదారులు వెళ్తుండడంతో ఉమ్మడి జిల్లాలో రెండు నుంచి మూడు సెంటర్లు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. ఈ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు అప్పగించే అవకాశం ఉంది.ఆరు నెలల్లో క్రిటికల్ కేర్ యూనిట్ పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ భవనం ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జాతీయ రహదారులపై 90 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తున్నా.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే, వీటికన్నా ముందే పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ అందుబాటులోకి వస్తుంది. – ఎస్.రాజేశ్వరరావు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్హైవేలపై సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం క్షతగాత్రులకు సత్వరమే వైద్యం అందించే ప్రయత్నం తద్వారా మృతుల సంఖ్య తగ్గించొచ్చని భావన అంతకుముందే అందుబాటులోకి రానున్న క్రిటికల్ కేర్ యూనిట్ జిల్లాలో ప్రమాదాల వివరాలు... ఏడాది ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2024 785 281 629మంది 2025 50 33 100పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ప్రతిపాధనలు పంపిస్తున్నా ఫలితం కానరాలేదు. తాజాగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడమే కాక ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ కసరత్తు పూర్తయి నిర్మాణాలు చేపట్టేలోగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందుతుంది. ఖమ్మం ఆస్పత్రి ఆవరణలో క్రిటికల్ కేర్ యూనిట్‌ను గత ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్రప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.21 కోట్లు కేటాయించింది. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆధ్వర్యాన జీ ప్లస్ 3 భవన నిర్మాణాన్ని ఆరు నెలల క్రితం ప్రారంభించడంతో మరో నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే ట్రామా కేర్ భవనాలు ఏర్పాటయ్యేవరకు జిల్లాలో ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందుతుంది. -
బాధ్యతలు స్వీకరించిన బార్ అసోసియేషన్
ఖమ్మం లీగల్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా తొండపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా మోత్కూరి విజయశాంత, కార్యదర్శిగా గద్దల దిలీప్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎం.నవీన్ కుమార్‌తో పాటు ఎస్. రాంబాబు, కే.వీ.వీ.లక్ష్మి, పి.నర్సింహారావు, పి.ఇందిర ప్రమాణం చేశారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, దిలీప్‌కుమార్ మాట్లాడుతూ కోర్టు ప్రాంగణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాక, న్యాయవాద సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, బార్ – బెంచ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు.హెచ్‌సీయూ భూముల స్వాధీనం నిలిపివేయాలిఖమ్మంమయూరిసెంటర్: దశాబ్దాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూముల స్వాధీనాన్ని నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనేక రకాల వృక్షాలు, జంతువులతో పర్యావరణానికి నిలయంగా ఉన్న 400 ఎకరాల భూములను అమ్మేలా రాష్ట్రప్రభుత్వం స్వాధీనానికి యత్నించడం సరికాదని పేర్కొన్నారు. అంతేకాక భూములు కాపాడేందుకు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడం, లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భూములను యూనివర్సిటీ ఆధీనంలో ఉంచడమే కాక అక్రమ అరెస్టులు ఆపాలని రంగారావు డిమాండ్ చేశారు.బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విజయ్సారధిఖమ్మం స్పోర్ట్స్: బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏసీపీ విజయ్ సారధికి కార్యవర్గంలో స్థానం దక్కింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతీయస్థాయిలో గుర్తింపు కలిగిన క్రీడాకారుడైన ఆయన పోలీస్ శాఖలో ఏసీపీగా కొనసాగుతున్నారు.ఇసుక లారీలు సీజ్తల్లాడ: అనుమతి లేకుండా ఏపీలోని నంది గామ నుంచి తల్లాడ మండలం మిట్టపల్లి వైపు ఇసుక తీసుకొస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. సోమవారం అర్ధరాత్రి సీజ్ చేయగా, మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొండల్రావు తెలిపారు.చోరీ కేసుల్లో ఒకరి అరెస్ట్ఖమ్మంక్రైం: జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో, బైక్‌లు చోరీ చేస్తున్న వ్యక్తిని ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. భద్రాచలానికి చెందిన కోడి శేఖర్ అలియాస్ జంపన్న మరో వ్యక్తితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు పంచాక్షరి కాలనీలో ఉన్నట్లు సమాచారం అందగా శేఖర్‌ను అరెస్ట్ చేసి నాలుగు బైకులు, 10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని, మరో నిందితుడు పారిపోయాడని సీఐ తెలిపారు. కీలకంగా వ్యవహరించిన కానిస్టేబు ళ్లు హరికృష్ణ, బోరయ్యను సీపీ సునీల్‌దత్, ఏసీపీ రమణమూర్తి అభినందించారు.కానిస్టేబుల్ ఆత్మహత్యఖమ్మంక్రైం: మూడు రోజులుగా సెలవులో ఉన్న ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఖమ్మంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... నేలకొండపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి కృష్ణ(38) మూడు రోజు లుగా సెలవులో ఉన్నాడు. ఖమ్మం ముస్తఫానగర్‌లోని ఇంటి నుంచి మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లేక సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆరా తీస్తూ పిల్లిగుట్టల వద్దకు వెళ్లారు. అప్పటికే ఆయన గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు వెల్లడించారు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ మృతదేహాన్ని సందర్శించగా, కృష్ణ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
భూసమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి
● గ్రామ పాలన అధికారులు, భూభారతి చట్టంతో పరిష్కారం ● రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: గ్రామాల్లో రైతులు, ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నందున ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈక్రమంలోనే 10,954 గ్రామ పాలన అధికారుల(జీపీఓ) పోస్టులు మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాక పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తిరిగి మాతృసంస్థలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. అలాగే, తొలిసారి 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల మంజూరు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు కోల్పోయిన అధికా రాలు భూభారతి చట్టంతో పునరుద్ధరణ జరిగా యని తెలిపారు. గతంలో జీఓ 317తో దంపతులైన ఉద్యోగులు చిన్నాభిన్నం కాగా, జేఏసీ ఉద్యమ ఫలితంగా స్పౌజ్, మెడికల్, తదితర కోణాల్లో బదిలీలను చేపట్టిందని చెప్పారు. గ్రామ పాలన అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్ర రావు మాట్లాడుతూ గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీఆర్వోలు, వీఆర్ఏలను అన్యాయంగా అర్ధరాత్రి లాటరీ పద్ధతిలో వివిధ శాఖలకు కేటాయించిన గత ప్రభుత్వం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జేఏసీ సారధ్యాన వీఆర్వోలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉద్యోగులు, సంఘాల నాయకులు డీఎస్.వెంకన్న, మంగీలాల్, బుచ్చయ్య, కోట రవికుమార్, పాక రమేష్, పూల్‌సింగ్ చౌహన్, శ్రీనివాస్, శంకర్రావు, ప్రేమ్‌కుమార్, వజ్జ రామారావు, వాంకుడోత్ వెంకన్న, పాండునాయక్, సలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ●రిటైర్డ్ ఆర్డీఓ పొట్టపెంజర రాజారావు ఇటీవల మృతి చెందగా ఆయన చిత్రపటం వద్ద లచ్చిరెడ్డి నివాళులర్పించారు. అలాగే, ఆయన కుటుంబీకులను పరామర్శించాక మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా సేవలందించడమేకాక రెవెన్యూ పత్రిక నిర్వహించడంలో రాజారావు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. -
● చిన్నారి సహా పది మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు – లారీ ఢీ వైరా: ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వైరాలోని రింగ్ రోడ్డు సెంటర్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మణుగూరుకు వెళ్తోంది. వైరా బస్టాండ్‌లో నుండి రింగ్ రోడ్డులోకి తిరుగుతున్న సమయాన తల్లాడ వైపు నుండి ఖమ్మం వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గుండాల మండలం వేపలగడ్డకు చెందిన వరమ్మ, ఆమె కోడలు భారతి, మనవడు మూడేళ్ల దేవిక్కు తీవ్ర గాయాలయ్యాయి. దేవిక్కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖమ్మం ఆస్పత్రికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరికి వైరాలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఇక కొత్తగూడెం చెందిన రియాజ్, రుద్రంపూర్‌కు చెందిన ప్రేమ్, పాల్వంచకు చెందిన శ్రావ్యకు, తల్లాడకు చెందిన జనార్దన్, భవాని, మోక్షిత్‌కు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం మణుగూరు డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. ఖమ్మం నుంచే వేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడని ప్రయాణికులు, స్థానికులు వెల్ల డించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రాజీవ్ యువవికాసం దరఖాస్తు గడువు పొడిగింపు
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఖమ్మంసహకారనగర్: యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 14 వరకు పొడిగించిందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ యువతకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం సబ్సిడీపై రూ.50 వేల యూనిట్, 90 శాతం సబ్సిడీపై రూ.లక్ష యూనిట్, 80 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల యూనిట్, 70 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల విలువైన ఏర్పాటుకు ఈ పథకం ద్వారా చేయూత అందుతుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే వార్షిక ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల లోపు ఆదాయం కలిగిన వారు అర్హులని, తెల్ల రేషన్ కార్డులో దరఖాస్తుదారుల పేరు లేకపోతే ఆదాయ సర్టిఫికెట్ సమర్పించొచ్చని తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు 21 – 55ఏళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లకు 60ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న వారికి యూనిట్ గ్రౌండింగ్, నిర్వహణలో శిక్షణ కూడా కలెక్టర్ ఓ ప్రకటనలో వివరించారు. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఖమ్మంసహకారనగర్: దేశవ్యాప్తంగా ఎన్టీఏ ఆధ్వర్యాన నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈమేరకు బొమ్మ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, ఎస్బీఐటీ, విజయ ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ పార్వతీరెడ్డి వెల్లడించారు. కాగా, 2, 3, 4, 7, 8, 9తేదీల్లో జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు షిఫ్ట్‌లుగా పరీక్షలు ఉంటాయని, ఉదయం 8–30కు, మధ్యాహ్నం 2–30గంటలకు కేంద్రాలు మూసివేస్తామని వెల్లడించారు. విద్యార్థులు సాధారణ దుస్తులు ధరించాలని రావాలని సూచించిన ఆమె, కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడమే కాక పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం మూడో రోజుకు చేరాయి. ఈసందర్భంగా స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించిన అర్చకులు మండపారాధన, మన్యు సూక్త హోమంతో పాటు సామూహిక సౌభాగ్యలక్ష్మి వ్రతం జరిపించారు. ఆతర్వాత ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై గిరి ప్రదక్షణ చేయించాక భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ పర్యవేక్షకులు కె.విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, అర్చకులు రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ‘రాజీవ్ యువవికాసం’ను సద్వినియోగం చేసుకోవాలి మధిర: అర్హులైన యువతీ, యువకులు స్వయం సమృద్ధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిర మండలం దెందుకూరులో మంగళవారం పర్యటించిన ఆమె పథకానికి దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. దరఖాస్తు గడువును ఈనెల14 వరకు పొడిగించినందున, అర్హులైన నిరుద్యోగ యువత ముందుకు రావాలని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు లేకపోతే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎంపికై న వారికి యూనిట్ ఎంపిక, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీ నవీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
సబ్స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంక్‌లు
● తద్వారా ఓల్టేజీ హెచ్చుతగ్గులకు బ్రేక్ ● విద్యుత్ పరికరాల మన్నికకు దోహదంఖమ్మంవ్యవసాయం: ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈనేపథ్యాన నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లు, ఫీడర్లలో కెపాసిటర్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఓల్టేజీ హెచ్చతగ్గులను నియంత్రించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఈ కెపాసిటర్ బ్యాంకులు దోహదపడతాయని చెబుతున్నారు. ఈమేరకు అవసరమైన ప్రాంతాల్లో వీటిని అమర్చడంపై ఎన్పీడీసీఎల్ అధికారులు దృష్టి సారించారు. కెపాసిటర్ బ్యాంక్‌లు, కెపాసిటర్లు ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ పరిధిలో విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల సామర్ధ్యం ఆధారంగా కెపాసిటర్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద 124 కెపాసిటర్ బ్యాంక్‌లు, విద్యుత్ లైన్లలో 60 కెపాసిటర్లను అమర్చారు. ఇవేకాక 11 కేవీ లైన్లలోనూ కెపాసిటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. కాగా, కెపాసిటర్ బ్యాంక్‌ల ఏర్పాటుతో సబ్ స్టేషన్లు, లైన్ల నుంచి సరఫరాలో ఓవర్ లోడ్ సమస్య ఎదురుకాదని ఎదురుచెబుతున్నారు. పరికరాలకు నష్టం ఉండదు... కెపాసిటర్ బ్యాంక్‌ల ఏర్పాటు ద్వారా విద్యుత్ పరికరాల మన్నికకు దోహదపడుతుంది. వీటి ద్వారా సరఫరాలో లోపాలు, ఓల్టేజీ హెచ్చుతగ్గులను నియంత్రించే వీలు ఉండడంతో వ్యవసాయ పంపుసెట్లు, పారిశ్రామిక ఫీడర్లలో మోటార్లు కాలిపోయే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. అలాగే, సాంకేతిక నష్టాలు సైతం తగ్గుతాయని చెబుతున్నారు. ఈనేపథ్యాన పరిశ్రమల్లోనూ కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ ప్రోత్సహిస్తోంది.కెపాసిటర్ బ్యాంక్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. జిల్లాలో ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు వినియోగదారులకు ప్రయోజనమే కాక కెపాసిటర్ల ద్వారా విద్యుత్ ఓల్టోజీ హెచ్చతగ్గులను నియంత్రించవచ్చు. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ -
ఆస్తిపన్ను వసూళ్లలో సత్తుపల్లి భేష్
● ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ముందంజ ● ఆ తర్వాత స్థానంలో ఇల్లెందు ● కేవలం 52శాతంతో జాబితాలో చివరన వైరా సత్తుపల్లిటౌన్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్ల గడువు సోమవారంతో ముగిసింది. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే సత్తుపల్లి ముందంజలో నిలిచింది. చివరిరోజు వరకు మున్సిపాలిటీ మేనేజర్ సహా రెవెన్యూ యంత్రాంగమంతా పన్ను వసూళ్లలో నిమగ్నం కావడం.. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఆరు రోజుల ముందు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా పన్ను వడ్డీపై 90 శాతం రాయితీని ప్రకటించడంతో బకాయిదారులకు మెరుగైన వసూళ్లు నమోదయ్యాయి. అంతేకాక ఆస్తి పన్ను చెల్లించకుండా మొండికేసిన వారికి జప్తు నోటీసులు జారీ చేయడం.. నల్లా కనెక్షన్లు తొలగిస్తామన్న హెచ్చరికలతో చాలా మంది మొండి బకాయిదారులు సైతం పన్ను చెల్లించారు. వసూళ్లు ఇలా... ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే సత్తుపల్లిలో రూ.4.91 కోట్లకు రూ.4.26 కోట్లు, వైరాలో రూ.4.06 కోట్లకు రూ.2.13 కోట్లు, మధిరలో రూ.2.56 కోట్లకు రూ.1.96 కోట్లు వసూలైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.7.93 కోట్లకు రూ.5.86 కోట్లు, మణుగూరులో రూ.2.42 కోట్లకు రూ.1.50 కోట్లు, పాల్వంచలో రూ.6.29 కోట్లకు రూ.4.13 కోట్లు, ఇల్లెందులో రూ.2.67 కోట్ల పన్ను డిమాండ్‌కు గాను రూ.2.20 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయగలిగారు. గత ఏడాదితో పోలిస్తే మెరుగు సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 85 శాతం పన్నులు వసూలయ్యాయి. అయితే, 2024–25లో 86.76 శాతం వసూలవడంతో గత ఏడాది కంటే మెరుగైంది. పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేలా నెల ముందు నుంచే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ రోజువారి సమీక్షలు చేస్తూ.. మొండిబకాయిదారులతో మాట్లాడడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో 86.76 శాతంతో సత్తుపల్లి ముందంజలో నిలువగా.. వైరా మున్సిపాలిటీలో కేవలం 52.46 శాతమే వసూలు కాగా చివరి స్థానంలో నిలిచింది.పన్నులు వసూలు చేస్తున్న కమిషనర్, ఉద్యోగులు (ఫైల్) ముందస్తు ప్రణాళికతో... ఆస్తిపన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో పాటు లక్ష్యసాధనకు సమష్టిగా శ్రమిం చాం. ఫిబ్రవరి నుంచి ఇంటింటికీ మా సిబ్బంది వెళ్లి పన్నులు చెల్లించాలని అవగాహన కల్పించాం. తొమ్మిది బృందాలతో ప్రతిరోజు సమీక్షలు చేస్తూ పన్నుల వసూళ్లను వేగవంతం చేశాం. వచ్చే ఏడాది నూరు శాతం పన్నుల వసూళ్లకు ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతాం. – కె.నర్సింహ, కమిషనర్, సత్తుపల్లి -
తల్లిదండ్రులే స్ఫూర్తిప్రదాతలు
మధిర: మధిర మండలంలోని చిన్న గ్రామం నాగవరప్పాడు. ఆ గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు తల్లిదండ్రులే స్ఫూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఇంకొందరికి ఆదర్శంగా నిలిచారు. నాగవరప్పాడుకు చెందిన భీమనబోయిన వెంకట నరసయ్య – రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటనరసయ్య మూడు దశాబ్దాల క్రితం హోంగార్డ్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి పొలం పనులు చూసుకునేవాడు. వ్యవసాయంపై దృష్టి పెట్టలేక హోంగార్డు ఉద్యోగం మానేశారు. అయితే, ఎస్ఐ తదితర అధికారులకు అందే విలువ, గౌరవ మర్యాదలను చూసిన ఆయన తన కుమారులిద్దరు పోలీస్ ఉద్యోగాలకు ఎంపియ్యేలా స్ఫూర్తిగా నింపారు. దీంతో పెద్ద కుమారుడు గోపీకృష్ణ 2015లో బీటెక్ పూర్తి చేసి 2017లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఇక చిన్న కుమారుడు మనోహర్ గోపి 10వ తరగతి వరకు గోసవీడు ప్రగతి స్కూల్లో, ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్యలో, బీటెక్‌లో జేఎన్టీయూలో పూర్తిచేశాక కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేలా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమై తొలిప్రయత్నంలోనే ఏఎంవీఐగా, ఏపీలో నాన్ లోకల్ కోటా కింద ఎస్సైగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు సాధించడమే కాక గ్రూప్–4లో రాష్ట్రస్థాయి 84, ఖమ్మం జిల్లాలో రెండో ర్యాంక్ సాధించారు. ఆపై పాలిటెక్నిక్ లెక్చరర్‌గానూ ఉద్యోగం సాధించిన మనోహర్ గోపి ఇటీవల మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విధుల్లో చేరాడు. తల్లిదండ్రులే రోల్ మోడల్.. వెంకట నరసయ్య హోంగార్డ్ ఉద్యోగం చేస్తూనే పొలం పనులకు వెళ్లడం, తల్లి రాధ ఆయనకు సహకరిస్తుండడం.. రోజంతా తల్లిదండ్రులకు కష్టపడుతుండడాన్ని చిన్నతనం నుంచే కళ్లారా చూశామని గోపీకృష్ణ, మనోహర్ గోపి తెలిపారు. అంతేకాక మంచిగా చదివి పెద్ద ఉద్యోగాలు సాధించాలని తల్లిదండ్రులు నింపిన స్ఫూర్తితో కష్టపడడంతోనే ఫలితం వచ్చిందని వెల్లడించారు. ఇక తాత భీమనబోయిన పెద్ద నారాయణ సైతం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కష్టాన్ని నమ్ముకుని పట్టుదలతో పనిచేసే తత్వాన్ని నేర్పించారని గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వ కొలువుల్లో ఇద్దరు కుమారులు -
టోల్గేట్ చార్జీల సవరణ
కూసుమంచి: ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ) ఆధీనంలోని టోల్గేట్ల ఫీజులను సోమవారం అర్ధరాత్రి నుండి సవరించారు. ఇందులో భాగంగా ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై నాయకన్‌గూడెం సమీపాన ఉన్న సింగరేణిపల్లి టోల్ గేట్ ఫీజులు కూడా స్వల్పంగా పెరిగాయి.పెరిగిన ఫీజుల వివరాలు వాహనం సింగిల్ జర్నీ రెండు వైపులా పాత ఫీజు పెంచిన ఫీజు పాత ఫీజు పెంచిన ఫీజు కారు, జీపు, వ్యాన్, ఎల్ఎంవీ వాహనాలు రూ.120 రూ.125 రూ.180 రూ.185 ఎల్సీవీ, మినీ బస్సులు రూ.195 రూ.200 రూ.290 రూ.300 బస్సు, ట్రక్కులు రూ.405 రూ.420 రూ.610 రూ.630ఇవేకాక హెవీ వాహనాలు, డిస్ట్రిక్ కమర్షియల్ వాహనాలు, నాన్ ఫాస్టాగ్ వాహనాలకు సైతం గతంలో ఉన్న ఫీజును వాహనాల ఆధారంగా రూ.60వరకు పెంచారు.స్వల్పంగా పెరిగిన ఫీజులు -
భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి
● ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టండి ● అధికారులకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశం భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యా ణం, పట్టాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులు ఎండల కారణంగా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధి కారులకు సూచించారు. మిథిలా స్టేడియం, ఆల య పరిసరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. సెక్టార్ల విభజన, సీఎం, వీవీఐపీ, ఇతర సెక్టార్లలో ఏర్పాట్ల గురించి అధికారులు మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎండల నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా తాగునీరు, మజ్జిగ, గాలి వీచేలా ఏర్పాట్లు చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భక్తులు కల్యాణంతో పాటు ఆ తర్వాత మూలమూర్తులను దర్శించుకునేలా చూడాలని, భక్తులందరికీ తలంబ్రాలు, ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, దేవస్థానం ఈఓ రమాదేవి, ఈఈ రవీందర్, ఆర్డీఓ దామోదర్‌రావు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి విజయంతో పాదయాత్ర
ఖమ్మంసహకారనగర్/కొణిజర్ల/వైరా: పీఆర్టీయూ టీఎస్ నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించిన నేపథ్యాన యూనియన్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు నేతృత్వాన మంగళవారం ఖమ్మం ఇందిరానగర్‌లోని వినాయక స్వామి దేవాలయం నుండి 23మందితో కొణిజర్ల మీదుగా 25 కి.మీ. పాదయాత్ర చేపట్టి వైరాలోని పాత శివాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా వైరాలోని పాత శివాలయం, రిజర్వాయర్ సమీపంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీపాల్‌రెడ్డి విజయానికి గుర్తుగా పాదయాత్ర చేపట్టామని తెలిపారు. ఆయన ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయులు, విద్యారంగం సమస్యల పరిష్కారానికి పాటుపడతారని చెప్పారు. ఈ యాత్రలో పీఆర్టీయూ జిల్లా, మండలాల బాధ్యులు వెలిశెట్టి నరసింహారావు, గోవర్ధనరెడ్డి, డి.సత్యనారాయణ, జాన్, రామచంద్రయ్య, రమేష్, హరిబాబు, శ్రీనివాసరావు, సరిత, రూప, సునీత, సతీష్, వెంకటరమణ, విజయ్ అమృతకుమార్, రత్నకుమార్, సీతారామయ్య, కుసుమ నాగేశ్వరరావు, కె.రాము, పాటి వెంకటేశ్వర్లు, టి.వెంకన్న, కె.గోపాలరావు, గార్లపాటి రామారావు, కే.వీ.నాయుడు, తాత రాఘవయ్య, పి.వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, అనంతోజు పుల్లయ్యచారి, భిక్షం, రమేష్ పాల్గొనగా.. కాంగ్రెస్ నాయకులు సూరంపల్లి రామారావు, నెల్లూరి రమేష్, చల్లగుండ్ల సురేష్ స్వాగతం పలికారు. -
జేవీఆర్ ఓసీ.. లక్ష్యసాధనలో మేటి
సత్తుపల్లిరూరల్: సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 114 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడమే కాక 112.5 లక్షల టన్నుల రవాణాతో జేవీఆర్ ఓసీ మేటిగా నిలిచిందని పీఓ ప్రహ్లాద్ తెలిపారు. ఉత్పత్తి, రవాణాలో రికార్డు సృష్టించిన నేపథ్యాన పీఓతో పాటు మేనేజర్ రాజేశ్వరరావును ఐఎన్టీయూసీ నాయకులు భాస్కర్ నాగప్రకాష్, రామారావు మంగళవారం సన్మానించారు. అనంతరం వారు కాలనీలో కమ్యూనిటీ హాల్, వాకింగ్ ట్రాక్, ఆర్వో ప్లాంట్, సింగరేణి సూపర్ బజార్, పార్కు, ఓపెన్ జిమ్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించగా పీఓ ప్రహ్లాద్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కోటి, ఐ.వీ.రెడ్డి, సురేష్, పొట్టి కిరణ్, సుదర్శన్, తిరుమలరావు, రాజేందర్, రాంచందర్, లాలు, మురలి, కిషన్‌రావు, లింగమూర్తి, చంద్రశేఖర్, సందీప్, శ్రీనివాస్, కనకరావు, రమేష్, మాలోతు అశోక్ పాల్గొన్నారు. విద్యార్థి చదువులకు రూ.65,500 ఆర్థికసాయం కల్లూరు: కల్లూరుకు చెందిన నిరుపేద విద్యార్థి చింతకాయల నరసింహారావు వరంగల్‌లో బీఎస్సీ నర్సింగ్ చదువుతుండగా, ఫీజు, హాస్టల్ ఇతర ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవిషయాన్ని స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్తో మాట్లాడగా రూ.65,500 చెక్కును మంగళవారం నరసింహారావు తల్లి సీతమ్మకు అందజేశారు. వలంటీర్లు ఉబ్బన బాబూరావు, జల్దా రామకృష్ణ, సిరసాని రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
●దారి చూపిన దేవత.. అమ్మ
సత్తుపల్లి: తండ్రి చిన్నతనంలోనే కన్నుమూశాడు.. అప్పటి నుంచి అన్నీ తానై పెంచిన తల్లి ప్రజలకు సేవ చేసే ఉద్యోగం సాధించాలని చెబుతుండేది. ఆమె కోరిక మేరకు కష్టపడి చదివిన యువకుడు గ్రూప్–1 ర్యాంకు సాధించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని తాటి సుబ్బన్నగూడెంకు చెందిన తాటి రామచంద్రరావుకు భార్య సుదర్శనమ్మతో పాటు కుమారులు ప్రమోద్‌సాయి, ప్రదీప్‌చంద్ర ఉన్నారు. పిల్లల చిన్నవయస్సులోనే రామచంద్రరావు మృతి చెందగా తల్లి అన్నీ తానై పెంచి పెద్దచేసింది. ప్రస్తుతం ఆమె సత్తుపల్లి మండలం కాకర్లపల్లి హైస్కూల్లో సోషల్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రమోద్ సత్తుపల్లిలోని వీ.వీ.విద్యాలయంలో 10వ తరగతి పూర్తిచేశాక ఇంటర్ అనంతరం హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. అయితే, సివిల్ సర్వెంట్‌గా ఉద్యోగం సాధించాలని, తద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందన్న తల్లి సూచనలతో ప్రమోద్ సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. ప్రమాదంలో తీవ్రగాయాలు సివిల్స్‌కు సిద్ధమయ్యే క్రమాన ప్రమోద్‌సాయి ఢిల్లీలోని వాజిరం కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుండగా 2019లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగాగ గాయపడ్డాడు. దీంతో ఆరేళ్ల సమయాన్ని చికిత్స కారణంగా కోల్పోయినా ఆయన ఆత్మవిశ్వా సం చెక్కుచెదరలేదు. తల్లి ప్రోత్సాహంతో ఎలాంటి శిక్షణ తీసుకోకుండా ఇంటి వద్దే సిద్ధమైన ఆయన గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 317, ఎస్టీ కేటగిరీ జోన్–1లో 10వ ర్యాంక్ సాధించడం విశేషం. తద్వారా తల్లి కోరికను నెరవేర్చారనని ప్రమోద్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.గ్రూప్–1 సాధించి తల్లి కోరిక నెరవేర్చిన యువకుడు -
జమలాపురంలో ధ్వజారోహణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత ధ్వజారోహణం చేయడమే కాక రుద్రహోమం నిర్వహించిన అర్చకులు శ్రీవారు, అమ్మవార్లను గజవాహనంపై గిరి ప్రదక్షిణ చేయించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సూపరింటెడెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.రామదాసు మందిరంలో చైన్నె భక్తుల కచేరీనేలకొండపల్లి: భక్త రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరంలో చైన్నెకి చెందిన భక్తులు కచేరీ నిర్వహించారు. దేశంలోని అన్ని రామదాసు మందిరాలను సందర్శించి కచేరీలు చేస్తున్న 15మంది బృందం సోమవారం నేలకొండపల్లికి చేరింది. ఈ సందర్భంగా రామదాసు వాడిన బావితో పాటు ఆడిటోరియంలోని పరిశీలించాక ఆయన విగ్రహం వద్ద పూజలు చేశారు. ఆతర్వాత మందిరంలో రామదాసు కీర్తనలతో కచేరీ నిర్వహించగా పలువురు స్థానికులు సైతం పాల్గొన్నారు. మందిరం పూజారి సౌమిత్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఆర్అండ్బీ ఎస్ఈగా యుగంధర్ఖమ్మంఅర్బన్: ఆర్అండ్బీ ఖమ్మం సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా వి.యుగంధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్చార్జ్ ఎస్ఈగా ఉన్న హేమలత ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఖమ్మం ఈఈ యుగంధర్‌కు ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇంజనీర్లు, కార్యాలయ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. -
ఉత్పత్తిలో సింహభాగం సత్తుపల్లిదే..
సత్తుపల్లి: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి వ్యాప్తంగా సత్తుపల్లి సింహభాగాన నిలుస్తోందని సంస్థ సీఎండీ బలరాంనాయక్ వెల్లడించారు. ఇందుకు శ్రమించిన కార్మికులు మొదలు అధికారుల వరకు అభినందనీయులని తెలిపారు. సత్తుపల్లి మండలం జేవీఆర్ ఓసీ ఆవరణలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సత్తుపల్లి ఓసీల ద్వారా గతేడాది కంటే 6లక్షల టన్నులు అధికంగా 144.55 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, 162.23 లక్షల టన్నులు రవాణా చేశామని తెలిపారు. మార్చి 28వ తేదీన 80,931లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు సృష్టించడం విశేషమన్నారు. కాగా, సత్తుపల్లి జీఎం కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని సీఎండీ వెల్లడించారు. గ్లోబల్‌గా సంస్థగా... కొత్తగూడెం వీకే ఓసీ, ఇల్లెందు రొంపెడు ఓసీలకు అనుమతులు వచ్చాయని వెల్లడించిన సీఎండీ... త్వరలోనే ఆయా గనుల్లో ఉత్పత్తి మొదలుపెడతామని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో పది మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఒప్పందం కుదిరిందని చెప్పారు. రాజస్తాన్‌లో 3,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని, ఆస్ట్రేలియాలోనూ బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు ఉన్నందున సింగరేణి గ్లోబల్‌గా సంస్థగా అవతరిస్తుందని తెలిపారు. అలాగే, బొగ్గు నాణ్యత విషయంలో గతంలో ఫిర్యాదులు వచ్చేవని.. ఇప్పుడు అవి తగ్గాయని వివరించారు. సీఎండీని కలిసిన సైలోబంకర్ బాధితులు కిష్టారం అంబేద్కర్ కాలనీకి చెందిన సైలో బంకర్ బాధితులు సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ను కలిసి వారి సమస్యలు వివరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ద్వారా మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని..త్వరలో ఒక పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, జీఎం షాలెంరాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఏసీపీ ఎ.రఘు, అధికారులు పాల్గొన్నారు. గత ఏడాదితో కంటే మెరుగైన ఉత్పత్తి, రవాణా సీఎండీ బలరాంనాయక్ -
భక్తిశ్రద్ధలతో రంజాన్
నెల పాటు ఉపవాస దీక్ష ఆచరించిన ముస్లింలు సోమవారం రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే సమీపంలోని ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రవక్త బోధనలు వినిపించడమే కాక సాటి మానవులకు సాయపడేలా ప్రవక్త బాటను అనుసరించాలని సూచించారు. అనంతరం ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆతర్వాత కులమతాలకతీతంగా స్నేహితులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఇచ్చారు. మధిరలోని పలువురు ముస్లింల ఇళ్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి శుభాకాంక్షలు తెలపగా.. ఖమ్మంలోని గొల్లగూడెం ఈద్గాలో జరిగిన ప్రార్థనలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. – ఫొటోలు 9లో...ఈద్గాల్లో సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు ● ప్రవక్త బోధనలు వినిపించిన మతపెద్దలు -
ఖమ్మం–కోదాడ పాత రోడ్డుకు మహర్దశ
● జాతీయ రహదారుల అథారిటీ నుంచి నిధులు ● 18 కి.మీ. మేర రహదారికి రూ.20 కోట్లువేసవిభత్యానికి రాంరాం.. వేసవిలో ఎండల తీవ్రత ఉన్నా పనులకు వచ్చే వారిని ప్రోత్సహించేలా కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిభత్యం చెల్లించడం ఆనవాయితీ. కానీ గత ఏడాది వేసవిభత్యం ప్రకటించకపోగా, ఈసారి కూడా అలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు వేసవిభత్యం ఉంటుందా, తొలగించారా అన్న మీమాంస నెలకొంది. కాగా, కూలీలకు తాగునీరు సమకూర్చేందుకు మాత్రం గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయనుంది. ఒక్కో కూలీకి రూ.2.50 చొప్పున జీపీలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుండగా, ఆ నిధులతో పని ప్రదేశాల్లో నీటి వసతి కల్పించాల్సి ఉంటుంది.నేలకొండపల్లి: జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చాక పట్టించుకునే వారెవరూ లేక పాత రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. గుంతలు తేలిన ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిన నేపథ్యాన ఎట్టకేలకు జాతీయ రహదారుల అథారిటీ నుంచి ఖమ్మం–కోదాడ రహదారి అభివృద్ధికి రూ.20కోట్ల నిధులు మంజూరవడంతో త్వరలోనే కొత్తరూపు సంతరించుకోనుంది. 365(ఏ) నంబర్‌తో ఖమ్మం–కోదాడ మధ్య జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. అంతకుముందు ఖమ్మం నుంచి ముదిగొండ – నేలకొండపల్లి – పైనంపల్లి మీదుగా రాకపోకలు సాగేవి. హైవే నిర్మాణం జరిగిన నాలుగేళ్ల పాటు అంతకుముందు వేలాదిగా వాహనాలు ఇదే రోడ్డుపై వచ్చివెళ్లడంతో గుంతలమయమై అధ్వానంగా మారింది. ప్రస్తుతం కొత్త హైవేపై భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నా, పలు గ్రామాల ప్రజలకు పాత రహదారే ప్రత్యామ్నాయంగా ఉంది. కానీ తారు లేచిపోయి గుంతలు తేలడంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి వాహనాలు దెబ్బతినడమే కాక ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తున్నా శాశ్వత పనులు చేపట్టకపోగా.. చివరకు జాతీయ రహదారుల అథారిటీ నిధులు మంజూరు చేశారు. ఆర్అండ్బీ ద్వారా పనులు ఖమ్మం – కోదాడ మార్గంలోని పాత రహదారిపై కొత్తగా బీటీ వేసేందుకు రూ.20కోట్లు మంజూరు చేశారు. ఖమ్మం నుంచి కోదాడ వరకు 18 కి.మీ. మేర ఈ రోడ్డును అభివృద్ధి చేస్తారు. ఖమ్మం, ముదిగొండ బైపాస్, నేలకొండపల్లి, పైనంపల్లి మీదుగా కోదాడ వరకు చేపట్టే పనులకు గాను జాతీయ రహదారుల అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో నిధులు జమ చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపట్టే పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.నిధులు విడుదల అయ్యాయి.. జాతీయ రహదారి అథారిటీ నుంచి పాత రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. బైపాస్‌లు కలుపుతూ 18 కి.మీ. మేర రహదారి అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించారు. ఈ పనులను త్వరలోనే ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యాన చేపడతారు. – దివ్య, పీడీ, నేషనల్ హైవేస్ -
సన్నబియ్యం.. సిద్ధం
ఓ రేషన్ షాప్ వద్ద ఏర్పాటుచేసిన బోర్డుచింతకాని మండలం నామవరంలోని రేషన్‌షాప్‌లో స్టాక్‌ను పరిశీలిస్తున్న డీసీఎస్ఓ చందన్‌కుమార్, ఉద్యోగులుఖమ్మంసహకారనగర్: రేషన్‌షాప్‌ల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉగాది నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బియ్యం పంపిణీని ఇటీవల సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇక జిల్లాలోని షాపుల్లో మంగళవారం నుంచి బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితంగా దొడ్డుబియ్యం తినలేక రేషన్‌కార్డులు ఉన్నా షాపులకు వెళ్లని పలువురు ఇకపై ముందుకొచ్చే అవకాశముందని భావిస్తు న్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించే అవకాశముంది. షాపులకు స్టాక్ జిల్లాలోని అన్ని రేషన్ షాప్‌ల ద్వారా నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి దుకాణాల కు బియ్యం సరఫరా చేశారు. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం ఇస్తుండడం, గత రెండు, మూడు నెలలు గా సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి. ప్రస్తుతం సన్నబియ్యం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా లబ్ధిదారులకు అందనున్నాయి. ఈ బియ్యం ఎలా? జిల్లాలోని అన్ని షాప్‌ల లబ్ధిదారులకు నెలనెలా 7,375.868 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే, గత నెల షాప్‌లకు చేరవేసిన దొడ్డు బియ్యం నిల్వలు కొన్ని చోట్ల స్టాక్ ఉన్నాయి. సన్నబియ్యం పంపిణీ చేసే క్రమాన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, ఉద్యోగులు షాపుల్లోని నిల్వ లను పరిశీలించి రిజిస్టర్లలో నమోదు చేశాక పక్కన పెట్టించారు. ఈమేరకు దాదాపు 10వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బియ్యం ఏం చేయాలనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు.అన్ని షాపుల ద్వారా పంపిణీ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నాం. ఇప్పటికే షాప్‌లకు స్టాక్ చేరవేశాం. ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా పంపిణీ చేయాలని సూచించాం. దొడ్డుబియ్యం నిల్వలపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. – కె.చందన్‌కుమార్, డీసీఎస్ఓఆహారభద్రత కార్డులు 3,83,717మొత్తం రేషన్‌కార్డులు 4,10,988రేషన్ దుకాణాలు 748లబ్ధిదారులు 11,48,031బియ్యం కేటాయింపు 7,375.868 మెట్రిక్ టన్నులుజిల్లాలో రేషన్ వ్యవస్థ వివరాలుఅంత్యోదయ 27,268అన్నపూర్ణ 03నేటి నుంచి రేషన్‌షాపుల్లో పంపిణీ జిల్లాలో 11.48లక్షల మంది లబ్ధిదారులు షాపుల్లో స్టాక్ ఉన్న దొడ్డుబియ్యంపై సందిగ్ధత -
పెంచలేదని అనకుండా..
● ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం రూ.7 పెంపు ● ఉత్తర్వులు విడుదల చేసిన కేంద్రం ● వేసవిభత్యం ఊసే ఎత్తని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఈసారి నామమాత్రంగానే వేతనం పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒక్కో కూలీకి రూ.300 చెల్లిస్తుండగా.. ఈసారి మరో రూ.7పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి కూలీలకు రూ.307 చెల్లించనున్నారు. అతి తక్కువగా వేతనం పెంచడంపై కూలీల్లో నిరాశ అలుముకుంది. నాలుగో వంతు ఏటా ఉపాధి కూలీల వేతనాన్ని రూ.15నుంచి రూ.25మేర పెంచుతున్నారు. దీంతో ప్రస్తుతం కూలీలకు రూ.300 అందుతుండగా ఈసారి అతి తక్కువగా రూ.7మాత్రమే పెంచడం గమనార్హం. 2024–25 ఏడాదికి రూ.28 పెంచిన కేంద్రం.. 2025–26కు అందులో నాలుగో వంతు మాత్రమే పెంచడంతో కూలీలు పనులపై విముఖత చూపే అవకాశం కనిపిస్తోంది. 58.28 లక్షల పనిదినాలు పూర్తి 2024–25 ఏడాదిలో 62.17 లక్షల పనిదినాలకు గాను 58.28 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో 1,419 కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేశాయి. ఈ పనుల కోసం రూ.204.99 కోట్లు వెచ్చించగా.. అందులో రూ.127.39 కోట్లు కూలీలకు వేతనంగా, రూ.67.27 కోట్లు సామగ్రి కోసం ఖర్చు చేశారు. మరో రూ.10 కోట్లు కార్యకలాపాలు, ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల నిర్వహణకు వెచ్చించారు. ఈసారి 54 లక్షల పనిదినాలే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని వేసవి సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్లడానికి కూలీలు ఆసక్తి కనబరుస్తారు. జిల్లాలోని చాలా మండలాల్లో కూలీల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈనేపథ్యాన ఉపాధి హామీ పనిదినాల లక్ష్యాలను కేంద్రమే నేరుగా పర్యవేక్షిస్తోంది. ఉపాధి పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, బ్లాక్(మండలం), జిల్లాకు పనిదినాల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈమేరకు జిల్లా నుంచి 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 54,33,704 పనిదినాలు కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాజాగా ముగిసిన ఏడాదిలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరకపోవడంతోనే ఈసారి పనిదినాల సంఖ్య తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రతిపాదనల ఆధారంగా నెలవారీ లక్ష్యాలను కేంద్రప్రభుత్వం ప్రకటించనుండగా.. అందుకు అనుగుణంగా జిల్లాలో కూలీలకు పనులు కల్పిస్తారు.జిల్లాలో ‘ఉపాధి’ వివరాలు జాబ్‌కార్డులు 3.06 లక్షలు కూలీల సంఖ్య 6.43 లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు 1.83 లక్షలు యాక్టివ్ కూలీలు 3.08 లక్షలు -
ప్రార్థనలకు రాజకీయ నాయకులు వద్దు..
● మాజీ మంత్రి పాల్గొనడంపై ముస్లింల అభ్యంతరం ● కాంగ్రెస్ నేతల ఉపన్యాసాలకూ అడ్డుఖమ్మం అర్బన్: రంజాన్ సందర్భంగా ఖమ్మం గొల్లగూడెం ఈద్గా వద్ద సోమవారం పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. అయితే, ప్రార్థనలో ముస్లింలతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొనడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. ప్రార్థనలో హిందువులు పాల్గొనవద్దని, పక్కన ఏర్పాటుచేసిన టెంట్ కింద కూర్చుని ప్రార్థన ముగిశాక శుభాకాంక్షలు తెలపాలని అన్నారు. దీంతో పువ్వాడ సమీపంలోని టెంట్ వద్దకు చేరుకుని, ఆతర్వాత ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రార్థన ముగిశాక ఈద్గాకు వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, అక్కడ మిగిలి ఉన్న వారిని ఉద్దేశించి తుమ్మల సమక్షాన ముస్లిం నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేయబోగా పలువురు అడ్డుచెప్పారు. పవిత్రమైన రంజాన్ పండుగ ప్రార్థనలో రాజకీయ ప్రసంగాలు చేయొద్దని సూచించారు. -
వ్యవసాయ శాఖకు కొత్త ఫోన్ నంబర్లు
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. జిల్లా వ్యవసాయాధికారి మొదలు కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఏడీఏలు, ఏఓలకు కొత్త నంబర్లు కేటాయించారు. ఎయిర్టెల్ నంబర్లను వ్యవసాయ శాఖ కేటాయించగా, ఇకపై ఇదే నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. – ఖమ్మంవ్యవసాయండీఏఓ మొదలు ఏఓల వరకు కేటాయింపుహోదా ఫోన్ నంబర్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం జిల్లా వ్యవసాయాధికారి 89777 47500 ఏడీఏ, టెక్నికల్ 89777 47501 ఏడీఏ, టెక్నికల్ 89777 47502 పరిపాలనా అధికారి 89777 47503 ఏఓ, టెక్నికల్ 89777 47396 ఏఓ, టెక్నికల్ 89777 47397 ఏఓ, టెక్నికల్ 89777 47398 ఏఓ, టెక్నికల్ 89777 47399 రైతు శిక్షణా కేంద్రం(ఎఫ్‌టీసీ) డిప్యూటీ డైరెక్టర్ 89777 46566 ఏడీఏ 89777 46572 వ్యవసాయాధికారి 89777 48420 వ్యవసాయాధికారి 89777 48442 వ్యవసాయాధికారి 89777 48443 వ్యవసాయాధికారి 89777 48612 బీసీ ల్యాబ్ ఏడీఏ 89777 46573 వ్యవసాయాధికారి 89777 48677 వ్యవసాయాధికారి 89777 48679 భూసార పరీక్షా కేంద్రం (ఎస్టీఎల్) ఏడీఏ 89777 47389 వ్యవసాయాధికారి 89777 47390 వ్యవసాయాధికారి 89777 47391 వ్యవసాయాధికారి 89777 47394 వ్యవసాయాధికారి 89777 47395 ఖమ్మం డివిజన్ఏడీఏ 89777 46617 ఏఓ (టెక్నికల్) 89777 46621 ఏఓ, ఖమ్మం అర్బన్ 89777 46618 ఏఓ, రఘునాథపాలెం 89777 46619 హోదా ఫోన్ నంబర్ఏఓ. కామేపల్లి 89777 46620 కూసుమంచి డివిజన్ఏడీఏ 89777 47212 ఏఓ (టెక్నికల్) 89777 47220 ఏఓ, నేలకొండపల్లి 89777 47216 ఏఓ, కూసుమంచి 89777 47217 ఏఓ, ఖమ్మం రూరల్ 89777 47218 ఏఓ, తిరుమలాయపాలెం 89777 47219 మధిర డివిజన్ఏడీఏ 89777 46574 ఏఓ (టెక్నికల్) 89777 48680 ఏఓ, మధిర 89777 46575 ఏఓ, బోనకల్ 89777 46576 ఏఓ, చింతకాని 89777 46578 ఏఓ, ముదిగొండ 89777 46579 ఏఓ, ఎర్రుపాలెం 89777 46580 వైరా డివిజన్ఏడీఏ 89777 48708 ఏఓ, వైరా 89777 48709 ఏఓ, కొణిజర్ల 89777 48710 ఏఓ, ఏన్కూరు 89777 46597 ఏఓ, కారేపల్లి 89777 46598 సత్తుపల్లి డివిజన్ఏడీఏ 89777 48722 ఏఓ (టెక్నికల్) 89777 46623 ఏఓ (భూసార పరీక్షలు) 89777 47510 ఏఓ, సత్తుపల్లి 89777 48723 ఏఓ, వేంసూరు 89777 48724 ఏఓ, పెనుబల్లి 89777 48725 ఏఓ, కల్లూరు 89777 48728 ఏఓ, తల్లాడ 89777 48729 -
కేఎంసీకి కాసుల పంట!
● ఆర్థిక సంవత్సరం చివరి రోజు రూ.3.62 కోట్ల ఆస్తిపన్ను వసూలు ● మొత్తంగా రూ.33.65 కోట్ల ఆదాయంఖమ్మంమయూరిసెంటర్: 2024–25 ఆర్థిక సంవత్సరం సోమవారంతో ముగియగా ఆస్తి పన్నుల వసూళ్లలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కాసుల పంట పండింది. గడిచిన (2023–24) ఆర్థిక సంవత్సరంంలో రూ.30.80 కోట్లు ఆస్తిపన్నుల ద్వారా రాబట్టగా.. ఈసారి సోమవారం రాత్రి 9గంటల వరకు రూ.33.65 కోట్లు వసూలవడం విశేషం. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సోమవారం ఏకంగా రూ.3.62 కోట్లు వసూలయ్యాయని అధికారులు వెల్లడించారు. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి మరీ పన్నుల వసూళ్లలో నిమగ్నం కావడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.2.85 కోట్లు అదనంగా వసూలు చేయగలిగారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కేఎంసీకి వివిధ రూపాల్లో రూ.38.72 కోట్ల ఆదాయం సమకూరింది.2024–25లో వివిధ మార్గాల ద్వారా కేఎంసీకి వచ్చిన ఆదాయం సేవలు ఆదాయం (రూ.ల్లో) సెల్ఫ్ అసెస్మెంట్ 91,48,306 మ్యుటేషన్ 5,39,801 ఆస్తి పన్ను 33,65,86,199 పంపు పన్ను 2,86,84,079 ట్రేడ్ లైసెన్సు 1,18,11,219 ఖాళీ స్థలంపై పన్ను 4,77,010 -
రంజాన్ వేళ విషాదం
● చెరువులో మునిగి తండ్రీకుమారుడి మృతి ● తండ్రిని రక్షించే క్రమాన కుమారుడు కూడా కన్నుమూత బోనకల్: ముస్లింలంతా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటుండగా ఆ కుటుంబంలో మాత్రం విషాదం నెలకొంది. చెరువులోకి దిగిన తండ్రిని కాపాడే యత్నంలో కుమారుడు కూడా గుంతలో చిక్కుకుని మృతి చెందిన ఘటన బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.... ఆళ్లపాడుకు చెందిన పఠాన్ యూసుఫ్ ఖాన్(72)కు మతిస్థిమితం సక్రమంగా ఉండడంలేదు. సోమవారం ఉదయం వారి ఇంటి ఎదురుగా ఉన్న చెరువులోకి ఓ గేదె వెళ్లడాన్ని చూసిన ఆయన సైతం దిగాడు. ఈ విషయాన్ని గమనించిన యూసుఫ్ పెద్ద కుమారుడు కరీముల్లా(45) తండ్రిని బయటకు తీసుకురావడానికి చెరువులోకి దిగాడు. అయితే, ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ చెరువులో గత ఏడాది మట్టి తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా నీట మునిగి మృతి చెందారు. దీంతో పండుగ వేళ నెలకొన్న విషాదంతో వారి కుటుంబీకుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. యూసఫ్ ఖాన్‌కు భార్య, ముగ్గురు కుమారుల ఉండగా, కరీముల్లాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆళ్లపాడు చెరువులో గతంలోనూ ముగ్గురు మృతి చెందగా, ప్రస్తుత ఘటనతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
డీసీసీబీ మాజీ చైర్మన్ వాహనానికి ప్రమాదం
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంకు ప్రమాదం తప్పింది. సోమవారం ఆయన ఖమ్మం నుండి సత్తుపల్లికి కారులో వెళ్తుండగా వీ.వీ.పాలెం వద్ద ఖమ్మం– వైరా ప్రధాన రోడ్డులో గేదె అడ్డుగా వచ్చింది. ఆ గేదెను తప్పించే క్రమాన దాన్ని ఢీకొట్టగా వాహనం ముందు భాగంలో దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న నాగభూషణం, కారులో ఉన్న లింగయ్య సురక్షితంగా బయటపడ్డారు. వీరి వాహనం ఢీకొన్న గేదె మృతి చెందింది. ఈమేరకు నాగభూషణంను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పరామర్శించగా మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రమాదంపై ఫోన్లో ఆరా తీశారు. 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం కామేపల్లి: అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సాయికుమార్ తెలిపి న వివరాలు... మండలంలోని పండితాపురానికి చెందిన ఓ వ్యాపారి శనివారం రాత్రి లారీలో బియ్యాన్ని లోడ్ చేసి తరలించేందుకు సిద్ధమవుతున్నాడనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈమేరకు 250క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, వాహనంతో సహా సివిల్ సప్లయీ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
వేమన శతకంపై విద్యార్థుల అవధానం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు అవుల పోతురాజు, కడమంచి వంశీ వేమన శతకంపై అష్టావధానం చేసి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక శ్రీజ్ఞానసరస్వతీదేవి ఆలయంలో ఈ అవధానం నిర్వహించగా.. ఎనిమిది అంశాల్లో పృచ్ఛకులు అడిగిన సమస్యలకు శతక పద్యాల ఆధారంగా సమాధానాలు చెప్పి మెప్పించారు. ఉపాధ్యాయులు రజినీదేవి, రమాదేవి ఆధ్వర్యాన ఈ అవధాన ప్రదర్శన ఏర్పాటుచేశారు. అనంతరం విద్యార్థులతో పాటు పలువురు కవులను ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొడిమెల అప్పారావు, ఎస్.ఎల్.నర్సింహారావు, మాదిరాజు పుల్లారావు, శర్మ, మల్లికార్జున్‌రావు, రమణమూర్తి, సాయిరాం, శేషాచార్యులు, రామప్ప, మాదిరాజు మాలతి, శేషగిరిరావు, గీతాకుమారి, బి.మధుసూదన్‌రాజు, రమణారావు పాల్గొన్నారు. -
గ్రూప్–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు
కాకరవాయి వాసి వంశీ ప్రతిభ తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవా యికి చెందిన కొత్తపల్లి ఖుషిల్వంశీ గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటా డు. గ్రామంలోని కొత్తపల్లి శివకుమార్ – రేణుక కుమారుడైన వంశీ 496 మార్కులతో జనరల్ కేటగిరీలో 63, రిజర్వేషన్ కేటగిరీలో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించాడు. దీంతో డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్పీ ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాడు. గతంలో ఆయన ఎస్సై ఉద్యోగానికి ఎంపికవడమే కాక ఇన్‌కం టాక్స్ అసిస్టెంట్, సెంట్రల్ పోలీస్ అసిస్టెంట్ కమాండో(డీఎస్పీ), మిలిటరీ ఆఫీసర్‌గానూ ఉద్యోగాలు సాధించాడు. కాగా, వంశీ 6నుంచి 10వ తరగతి వరకు ఖమ్మం శ్రీచైతన్య పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్ శ్రీ గాయత్రి కళాశాలలో పూర్తిచేశాక సివిల్స్ సాధనే లక్ష్యంగా డిగ్రీ హైదరాబాద్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో, పీజీ ఢిల్లీ జేఎన్‌యూలో పూర్తిచేశాడు. కాగా, వంశీ తండ్రి శివకుమార్ సూర్యాపేట జిల్లా మాస్‌లైన్ జిల్లా కార్యదర్శిగా, తల్లి రేణుక పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొనసాగుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న తల్లిదండ్రుల మాదిరే ప్రజలకు సేవ చేయడం తన లక్ష్యమని ఖుషీల్ వంశీ వెల్లడించాడు. సింధు.. 176వ ర్యాంకునేలకొండపల్లి: మండలంలోని మండ్రాజుపల్లికి చెందిన నెల్లూరి సింధు గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. ఆమె మల్టీజోన్ మహిళా కోటాలో 64వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 176వ ర్యాంకు సాధించింది. అయితే, 2016లోనే గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి ఎంపీఓగా, గ్రూప్–3 ద్వారా సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు సాధించిన సింధు ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి గ్రూప్స్ సిద్ధమయ్యాయని, రోజుకు 15గంటల పాటు చదవడంతో మంచి ఫలితం వచ్చిందని.. ఇందులో భర్త, కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని వెల్లడించింది. వ్యవసాయ కుటుంబం.. 48వ ర్యాంక్ఖమ్మం సహకారనగర్: ఖమ్మం రాపర్తినగర్లో నివాసముంటున్న గండ్ర నవీన్‌రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో 502మార్కులతో రాష్ట్రస్థాయి 42వ ర్యాంక్ సాధించాడు. ముదిగొండ మండలం మాధాపురానికి చెందిన గండ్ర మల్లికార్జున్‌రెడ్డి – లక్ష్మి వ్యవసాయ కుటుంబం కాగా కొన్నాళ్ల నుంచి ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు నవీన్ సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఓసారి ఇంటర్వ్యూకు సైతం హాజరయ్యాడు. ఇంతలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాయగా 48వ ర్యాంక్ వచ్చింది. ఎప్పటికై నా సివిల్స్ సాధించి పేదవర్గాలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని నవీన్ వెల్లడించాడు. కాగా, ప్రస్తుతం వచ్చిన ర్యాంక్ ఆధారంగా డీఎస్పీ లేదా ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశముందని తెలిపాడు. అర్చక, ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకుల, ఉద్యోగ డైరీని సోమవారం ఖమ్మం కమాన్‌బజార్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందరశర్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16,062 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నివేదిక అందించామని తెలిపారు. దీంతో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాగా, అర్చక, ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉంటూ ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీఎస్.శ్రీనివాసాచారి, అర్చకులు శేషభట్టర్ రఘునాథాచార్యులు, కాండూరి మధుసూదనాచార్యులు, వేణుగోపాలాచార్యులు, శేషభట్టార్ వెంకటాచార్యులు, ఉద్యోగులు కొండకింది వేణుగోపాలాచార్యులు, దయాకర్, బురాన్ తదితరులు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలతో మేలు ఏన్కూరు: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా పాలన కుంటుపడకపోగా నిధులు ఆదా అవుతాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు రమేష్ అన్నారు. ఏన్కూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానాన్ని 32పార్టీలు సమర్థిస్తే కాంగ్రెస్ సహా ఇంకొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ విధానం వల్ల జరిగే మేలును ప్రజలకు వివరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసమావేశంలో నాయకులు నల్లమోతు రమేష్, నరుకుళ్ల వెంకటేశ్వర్లు, మాళ్ల అంజి, చింతలబోయిన వెంకటేశ్వర్లు, మల్లెం రవి పాల్గొన్నారు. -
ప్రారంభమైన శ్రీ కోటమైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు
కారేపల్లి: కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన శ్రీ కోటమైసమ్మ తల్లి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఈఓ వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభిరామారావు నేతృత్వాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కై లాశశర్మ, వేద పండితులు కొనమంచలి ఫణికుమార్ శర్మ తొలిరోజు మృత్యుంజయ అమృత పాశుపతం హోమం నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అలాగే, ఇల్లెందు మార్గదర్శి స్కూల్ ప్రతినిధులు అర్వపల్లి రాధాకృష్ణ, వేణుగోపాల్ గుప్తా సహకారంతో ఏర్పాటుచేసిన అన్నదానాన్ని దేవాదాయ, ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం.వీరస్వామి ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు పగడాల మోహన్‌కృష్ణ, పర్సా లలిత్సాయి తదితరులు పాల్గొన్నారు. -
యాప్‌లోనే హోరాహోరీ
● ఐపీఎల్ వేళ ఆన్లైన్లో పందేల జోరు ● ప్రతీ బంతి, ఓవర్... వికెట్‌పై బెట్టింగ్ ● పాల్గొంటున్న వారిలో యువతే ఎక్కువ... ఖమ్మం స్పోర్ట్స్: ప్రతీ బాల్.. వికెట్.. ఓవర్ ఇలా చెబుతూ పోతే బెట్టింగ్‌రాయుళ్లకు దేన్నీ వదలడం లేదు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 18వ సీజన్ కొనసాగుతుండడంతో పందేలు జోరందుకున్నాయి. అయితే, ఈ బెట్టింగ్‌లో యువత ఎక్కువగా పాల్గొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ మొదలైందంటే చాలు బుకీలు యాప్‌ల ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు. దీంతో అవగాహన లేకున్నా కొందరు వివరాలు తెలుసుకుని మరీ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది. బెట్టింగ్‌కు ప్రత్యేకంగా యాప్‌లు ఉండగా.. వీటి వివరాలను యువతకు వివరిస్తూ బుకీలు పందేనికి ప్రోత్సహిస్తున్నారు. రూ.100తో ప్రారంభమయ్యే ఈ బెట్టింగ్తో రూ.వేలల్లో సులువుగా సంపాదించచ్చని ప్రచారం చేస్తుండగా.. సంపాదన మాటేమో కానీ ఎక్కువ మంది రూ.వేలల్లో పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఖమ్మం కేంద్రంగా యువకులు ఈ బెట్టింగ్‌కు పాల్పడగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సోకడంతో బుకీల ఫోన్ నంబర్లు సేకరించి మరీ యాప్‌ల ద్వారా పందేనికి సిద్ధమవున్నారు. ముందుగానే అకౌంట్ లింక్.. బుకీల చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక పందేం కాసే వ ఆరు తమ బ్యాంక్ అకౌంట్ నంబర్ , ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు నమోదు చేసుకోవాలని చెబుతున్నట్లు తెలిసింది. ఆపై పరుగు, వికెట్, ఫోర్, సిక్స్‌లకు ఎంత అని నిర్ణయించి పందేనికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ప్రతీ బెట్టింగ్‌కు కోడ్ ఇస్తూ నమ్మకం ఉంటేనే ఆ కోడ్ నమోదు చేయాలని, తద్వారా నష్టపోయే అవకాశం లేదని నమ్మబలుకుతున్నట్లు తెలిసింది. దీంతో యువకులు ఎవరికి వారు నమ్మకంగా బెట్టింగ్ కాస్తూ నష్టపోతున్నట్లు సమాచారం. బార్లలో జోరుగా బెట్టింగ్ ఖమ్మంలోని త్రీ టౌన్, టూ టౌన్, వన్న్ టౌన్‌న్ ప్రాంతాల బార్లలో బెట్టింగ్ జోరుగా కొనసాగుతుందని చెబుతున్నారు. యాప్‌ల ద్వారా కొందరు.. నేరుగా కొందరు పందేలు కాస్తున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకులు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రకరకాల కారణాలు చెబుతూ డబ్బులు అడుగుతుండడంతో.. ఐపీఎల్ ఎప్పుడు ముగుస్తుందా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. క్రికెటే కాదు మరిన్ని... బెట్టింగ్ యాప్‌లు ఇన్నాళ్లు క్రికెట్‌కే పరిమితం అయ్యాయని భావిస్తుండగా.. ఇంకొన్ని ఆటల్లోనూ ఈ సంస్కృతి మొదలైందని చెబుతున్నారు. ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ, గుర్రపు పందేలనైనా బెట్టింగ్ యాప్‌లు పని చేస్తున్నాయని సమాచారం. ఎవరికి ఏ క్రీడపై ఆసక్తి ఉందో కనుక్కుని మరీ బుకీలు ఈ యాప్‌లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. బెట్టింగ్ ఇలా... బుకీలు చెప్పేవే కాక మరికొన్ని యాప్‌ల ద్వారా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంటుంది. అంతేకాక స్క్రీన్‌పై కింద భాగంలో బెట్టింగ్ వివరాలను బుకీలు జోడిస్తుంటారు. దీంతో టాస్ ఎవరు గెలుస్తారు.. ఆటగాళ్ల వ్యక్తిగత స్కోర్, వచ్చే బంతికి ఎన్ని పరుగులు వస్తాయి, ఫలానా బౌలర్ ఈ ఓవర్లో వికెట్ తీస్తాడా, మొత్తంగా ఎవరు గెలుస్తారు ఇలా ప్రతీ అంశానికి బెట్టింగ్ కాస్తుండడంతో నమ్మకంగా ముందుకొస్తున్న యువత చివరకు నష్టపోతున్నారు. -
వాల్యూయేషన్ కేంద్రంలో పరిశీలన
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం కోసం ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ సెంటర్ కొనసాగుతోంది. ఈమేరకు కేంద్రాన్ని ఇంటర్మీడియట్ బోర్డుకు చెందిన పరిశీలకుడు సీహెచ్.యాదగిరి సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన అధ్యాపకులకు పలు సూచనలు చేయగా, డీఐఈఓ రవిబాబు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు పాల్గొన్నారు. కాగా, స్పాట్ విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని యాదిగిరికి వినతిపత్రం అందించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ సంఘాల బాధ్యులు కె.సురేష్, గుమ్మడి మల్లయ్య, వినోద్‌బాబు, విజయ్, కిషోర్‌బాబు వినతిపత్రం అందజేశారు. -
●కానిస్టేబుల్‌గా చేస్తూనే..
కల్లూరురూరల్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 ఫలితాల్లో కల్లూరు మండలంలోని పేరువంచ గ్రామానికి చెందిన మందాల సుజాత రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంక్, ఎస్సీ రిజర్వేషన్ కేటగిరిలో 11వ ర్యాంక్ సాధించింది. సుజాత ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. గ్రూప్–1 కోసం కొంతకాలంగా సెలవుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకొని పరీక్ష రాసింది. రాష్ట్రస్థాయిలో గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించినందుకు గాను సుజాతను పలువురు అభినందించారు. -
గాలిలో ప్రాణాలు...
రవాణా వాహనాల్లో ప్రయాణికుల తరలింపు ● అదనపు లోడ్‌కు తోడు డ్రైవర్ల మితిమీరిన వేగం ● వ్యాన్లు, ట్రాక్టర్లలో సామర్థ్యానికి మించి తీసుకెళ్తుండడంతో ప్రమాదాలు ● కూలీకి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న పేదలు ● కొద్దిరోజుల క్రితం బోనకల్ మండలంలో మహిళా కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ● గత గురువారం ఖమ్మం రూరల్ మండలంలోనూ వాహనం బోల్తా కొట్టగా కూలీలకు గాయాలయ్యాయి. ● ఏన్కూరు మండలం నుంచి గత శుక్రవారం మహిళా కూలీలను తరలిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. దీంతో పలువురు మహిళలు గాయపడ్డారు. ఖమ్మం క్రైం: రెక్కాడితే గాని డోక్కాడని కుటుంబాలు వారివి. ఇంటోభార్య, భర్త పనిచేస్తేగాని నోట్లోకి అన్నం వెళ్లలేని పరిస్దితి. అందుకోసం చద్దిమూట కట్టుకోని కూలీ పనులకు భర్త ఒక దిక్కు, భార్య ఓ దిక్కు వెళ్లుతుంటారు. ఈకూలీపనులకు వెళ్లి వచ్చే వరకు తమ ప్రాణాలకు గ్యారెంటీ లేకున్నా ఆవిషయం తెలిసికూడా ఇంట్లో పోయ్యి వెలగటం కోసం, తమ బిడ్డల కనీస అవసరాలను తీర్చడం కోసం దూరప్రాంతాలకు వాహనాలలో ప్రయాణం చేసి మరి మిరపతోటలకు వెళ్లుతున్నారు. ఈక్రమంలో తమను తీసుకోని వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్య డ్రైవింగ్‌కు బలవుతున్నారు. ఇటీవల కాలంలో మిరపతోటలకు వెళ్లే కూలీల వాహనాలు తరుచుగా ప్రమాదాలకు గురి అవుతున్నాయి. 10మందికి 30మందికి పైగా... వేసవి కాలంలో మిరపతోటలో కూలీ పనిచేయడానికి ఎక్కువమంది కూలీలు అవసరం అవుతారు. దీంతో మిర్చితోట యజమానులు తమ ప్రాంతానికి చెందిన ట్రాలీలు, టాటా ఏస్‌ల డ్రైవర్లతో కూలీలను తీసుకొచ్చి, మళ్లీ వారిని దింపి వచ్చేదానికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఒప్పందం చేసుకోంటారు. దీంతో ట్రాలీలు, టాటాఎస్లు నడిపే డ్రైవర్లు కూలీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు, గ్రామాల దగ్గరనుంచి, పట్టణాలు, చివరకు నగరాల నుంచి కూడా కూలీలను తీసుకోనివెళ్లుతుంటారు, వీరిలో అత్యధికంగా మహిళ కూలీలు ఉంటారు. వాస్తవానికి వారి వాహనాలలో 10నుంచి 12మంది మాత్రమే పట్టే ఖాళీగా ఉంటుంది. అయితే వీరు డిజిల్, పెట్రోల్‌తోపాటు ట్రిప్పులు తిరగటానికి ఇష్టంలేక డబ్బులకు కక్కుర్తిపడి ఒకేసారి 30మందికిపైగా కూలీలను కిక్కిరిసే విధంగా ఎక్కించి తీసుకెళ్లి, పని ముగిశాక మరలా అదే మాదిరిగా తీసుకొస్తున్నారు. మితీమిరిన వేగం, అధిక ఓవర్ లోడ్ కూలీలను తీసుకోని వచ్చే వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలను నడుపుతున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ , వాహనంలో పెద్దగా స్పీకర్లు పెడుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటంతో వాహనాలు అధికలోడ్‌తో ఉండటంతో అదుపు తప్పి క్రింద పడిపోతున్నాయి. దీంతో ట్రాలీలో కూర్చోటానికి స్దలం లేక నిలబడే ఉండే కూలీలు క్రిందపడిపోయి కొంతమంది మత్యువాత పడిపోతుండగా మరికొంతమంది క్షతగాత్రులు అవుతున్నారు. నిరుపేద కుటంబానికి చెందిన వీరి కుటుంబాలు ఈఘటనలతో నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. పట్టించుకోని రవాణాశాఖ, పోలీస్‌శాఖ రోడ్లపై ఓవర్‌లోడ్‌తో కూలీలను తీసుకోని వెళ్లేవాహనాల గురించి రవాణాశాఖ, పోలీస్ శాఖలు పట్టించుకోకపోవడంతో వారు తమ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ కూలీల ప్రాణాలు గాలిలో పెట్టి నడుపుతున్నారు, వెంటనే పోలీస్, రవాణాశాఖ పట్టించుకోని ఓవర్‌లోడ్‌తో తీసుకొని వెళ్లుతున్న వాహనాలపై కొరడా ఝుళిపించి జరిమానా విధించి వాటిని సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.... ఆటోలు, ట్రాలీలు, టాటా ఏస్‌ల్లో సామర్థ్యానికి మించి కూలీలను తీసుకెళ్లవద్దని డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. దీన్ని అరికకట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఓవర్‌లోడ్‌తో వెళ్లినట్లు తేలితే భారీ జరిమానా విధించడమే కాక వాహనాలు సీజ్ చేస్తాం. ఇప్పటికే పలు వాహనదారులకు జరిమానా విధించాం. –వరప్రసాద్, ఇన్చార్జ్ ఆర్టీఓ -
పాస్టర్ మృతికి నిరసనగా ర్యాలీ
ఖమ్మంగాంధీచౌక్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవుల ఫెలోషిప్‌ల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నాయని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంహత్రుంలు, పోలీస్ శాఖ అధికారులు ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు జకర్యా హన్మంతరావు, చల్లగుండ్ల రమేశ్‌బాబు, ఆనంద్, విజయ్‌కుమార్, డేవిడ్, శేఖర్‌బాబు, తిమోతి, వేముల సత్యం, నెలాల బాలస్వామి, కృష్ణమోహన్, సంజీవరావు, పీటర్, చిన్న డేవిడ్, రవికిరణ్, జ్యోతి సుశీల, సేవకులు సైమన్, రాము, అభిషేక్, అశోక్ యోహాను, కిశోర్, పాల్, మోషే, సామేల్, నెహేమ్యా, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ ● ఒకరికి గాయాలు సత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సత్తుపల్లి మండలం గంగారంలో ఆదివారం చోటుచేసుకుంది. గంగారానికి చెందిన కోటయ్య టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తుండగా అశ్వారావుపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీకొట్టింది. కోటయ్య కాలుకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు నేలకొండపల్లి: వాకింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని యువకులు బైక్‌తో ఢీకొట్టడంతో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంబడించగా వారు పరారయ్యారు. మండల కేంద్రానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి డి.రామారావు ఆదివారం వాకింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కూసుమంచి – నేలకొండపల్లి రహదారిపై గుర్తు తెలియని యువకులు బైక్‌పై వస్తూ.. అక్కడ ఆరబెట్టిన మొక్కజొన్నల మీదుగా వెళ్లి బైక్ అదుపుతప్పి వెనుక నుంచి వచ్చి రామారావును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా, యువకులను స్థానికులు, పోలీసులు వెంబడించినా ఆచూకీ లభించలేదు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం పెనుబల్లి: మండలంలోని పాతకారాయిగూడెం ఎన్ఎస్పీ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పాతకారాయిగూడెం ఎన్ఎస్పీ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. కుడి చేతిపై ఆంజనేయ స్వామి పచ్చబొట్టు ఉన్నట్టుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేయనున్నామని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి పెనుబల్లి: సత్తుపల్లి మండలంలోని కొత్తలంకపల్లి శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీ ట్యాంకర్‌ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కల్లూరుకు చెందిన వన్నపురపు సీతారాంప్రసాద్ (45) సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున విధులు పూర్తయిన సొంత ఊరికి వెళ్లడానికి, వైజాగ్ నుంచి ఖమ్మం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో బస్సు కొత్తలంకపల్లి శివారుకు చేరుకోగా, జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ పక్కన భాగం అంతా ధ్వంసం కాగా కండక్టర్ సీతారాంప్రసాద్తో పాటు మగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 దారా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా మరో ఇద్దరిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటుగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. -
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో జిల్లా వాసులు సత్తాచాటారు. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని ఎన్నో కష్ట, నష్టాలకోర్చి చేరుకున్నారు. పుస్తకాలతో గంటల తరబడి కుస్తీపడుతూ.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా చదివి అనుకున్నది సాధించారు. ప్రస్తుత యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. ●ఐఏఎస్ కావడమే లక్ష్యం వైరా: సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడమే లక్ష్యమని చెబుతున్న వైరాకు చెందిన యువతికి గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 129వ ర్యాంకు వచ్చింది. మల్టీజోన్–1లో 49వ ర్యాంకు సాధంచిన సంగెపు లక్ష్మీసాహితి తండ్రి వెంకటేశ్వరరావు ఎల్ఐసీలో బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి కవిత గృహిణి. ఆమె 1 నుంచి 7వ తరగతి వరకు వైరా మధు విద్యాలయం, 8 నుంచి 10 వరకు ఖమ్మం రెజొనెన్స్ పాఠశాల, ఇంటర్ శ్రీచైతన్య కళాశాలలో చదివి డిగ్రీ హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివింది. పీజీ హైదరాబాద్ రామిరెడ్డి కళాశాలలో పూర్తిచేసింది. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. 2021లో యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. ‘రెండు సార్లు సివిల్స్ రాశాను. రెండోసారి రెండు మార్కులలో ర్యాంకు కోల్పోయాను. ఎప్పటికై నా సివిల్స్ సాధించడమే లక్ష్యం’ అని లక్ష్మీసాహితి వివరించింది. -
●వరుస విజయాల రత్నేశ్వరనాయుడు
కామేపల్లి: గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల చిన్నకుమారుడు రత్నేశ్వరనాయుడు గ్రూప్1లో రాష్ట్రస్థాయిలో 277వ ర్యాంక్, జోనల్‌స్థాయిలో 120వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్స్ ఫలితాల్లో గ్రూప్–1, 2, 3, 4 ఫలితాల్లో సత్తాచాటాడు. తమ తండ్రి స్థాపించిన పాఠశాలలోనే తన సోదరుడు సాయికృష్ణమనాయుడుతో కలిసి రత్నేశ్వరనాయుడు 1 నుంచి 7వ తరగతి వరకు చదివాడు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్ సి.వి.రామన్, డిగ్రీ శ్రీచైతన్య హైదరాబాద్‌లో చదివాడు. ప్రసుత్తం రత్నేశ్వరనాయుడు ఖమ్మంలోని కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. -
●తల్లి కష్టంతో..
ఖమ్మంమయూరిసెంటర్: చిన్ననాటి నుంచి తనను చదివించేందుకు తన తల్లి పడిన కష్టాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఖమ్మం నగరం ఖానాపురానికి చెందిన ఎం.మురళి గ్రూప్–1 ఫలితాల్లో మెరిశాడు. రాష్ట్రస్థాయి 83వ ర్యాంకు, బీసీ–ఏ కేటగిరిలో 2వర్యాంక్, జోనల్‌స్థాయిలో 47వ ర్యాంకు సాధించాడు. మురళి ఇప్పటికే ఖమ్మం నగర పాలక సంస్థలో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు మురళి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, 2020లో సివిల్ కానిస్టేబుల్, 2024లో జూనియర్ అకౌంటెంట్ (గ్రూప్–4) సాధించడంతోపాటు తాజాగా గ్రూప్–1 ఫలితాల్లో 489.5 మార్కులు సాధించాడు.మురళి తండ్రి లక్ష్మీనారాయణ 1998లో చనిపోగా.. తల్లి కళావతి కేఎంసీలో ఔట్సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ చదివించుకుంది. 2020లో తల్లి కళావతికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇంటి వద్దే ఉంచి ఆమె ఆలనాపాలనా మురళి చూస్తున్నాడు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
● దీపారాధన చేసి తాళం వేసి వెళ్లిన యజమానులు ● మంటలు వ్యాపించి ఫ్లాట్ పూర్తిగా దగ్ధం ఖమ్మంక్రైం: నగరంలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి ఫ్లాట్ పూర్తిగా కాలిపోగా పైఅంతస్తు, పక్క ఫ్లాట్‌కు స్వల్పంగా నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రాణ నష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.. బుర్హాన్‌పురంలోని రవీంద్రనాథ్ ఠాగూర్నగర్లో ఇటీవల పిన్ని టవర్స్ నిర్మించారు. వీటిలో కొన్ని ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు నివాసం ఉంటున్నారు. 301 ఫ్లాట్ కొనుగోలు చేసిన సత్తిరెడ్డి ఇంకా గృహప్రవేశం చేయలేదు. కాగా, సత్తిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం పండుగ కావటంతో దేవుడి గదిలో దీపం వెలిగించి, పూజ చేసి తాళం వేసి ప్రస్తుతం ఉన్న ఇంటికి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. వారు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత కిటికీలో నుంచి పొగలు రావడాన్ని ఎదురు ఫ్లాట్ వారు గమనించి, కిటికిలో నుంచి చూశారు. వారు అరుస్తూ మంటలను ఆర్పేందుకు తమ ఇంట్లో నీళ్లను పోశారు. అయినా కూడా మంటలు అదుపులోకి రాలేదు. చివరకు వారు నివసిస్తున్న ఫ్లాట్‌కు సంబంధించిన అద్దాలు సైతం మంటల తాకిడికి పగిలిపోయాయి. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని వాచ్‌మెన్‌కు సమాచారం అందించగా.. అతను వచ్చి చూడగా అప్పటికే మంటలు పైఅంతస్తులోకి వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వారు వచ్చారు. తప్పిన ప్రాణనష్టం.. ఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది అపార్ట్మెంట్లో ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అందరినీ కిందకు వెళ్లాలని ఆదేశించారు. మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకొని మంటలను ఆర్పుకుంటూ ఆరు కుటుంబాల వారిని క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. ఒక ఫైరింజన్ సరిపోకపోవడంతో మరో ఫైరింజన్‌ను రప్పించారు. మహబూబాద్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనాథ్ రెస్క్యూ సిబ్బందిని పైకి తీసుకెళ్లి.. ఆయనే స్వయంగా మంటలను ఆర్పివేశారు. రెండు గంటలపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనతో అపార్ట్‌మెంట్‌వాసులు భయాందోళనకు గురయ్యారు. గంటలోనే అంతా జరిగిపోయిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఇదిలా ఉండగా తాము దీపం వెలిగించలేదని షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని సత్తిరెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి అజయ్ సందర్శించారు. ఖమ్మం ఫైర్ అధికారి బాలకృష్ణ, సిబ్బంది భాస్కర్‌రావు, కిరణ్‌కుమార్, రాంబాబు, నరసింహారావు, విజయ్‌కుమార్, టూటౌన్ పోలీసులు మంటలన ఆర్పడంతో సఫలీకృతమయ్యారు. కాగా, సుమారు రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
ఒకే వేదికపై రంజాన్, ఉగాది వేడుకలు
మధిర: ఒకే వేదికపై కులమతాలకు అతీతంగా ఉగాది, రంజాన్ పండుగలను ఘనంగా జరుపుకున్న ఘటన మధిర పట్టణంలోని టీచర్స్‌కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. టీచర్స్‌కాలనీలోని కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం ఉగాది పండుగ రావడం మరుసటి రోజు రంజాన్ పండుగ రావడంతో రెండు పండుగలను కలిపి ఒకే వేదికపై చేసుకోవాలని కాలనీవాసులు నిర్ణయించుకున్నారు. ఈ కాలనీలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉగాది పండుగకు సంబంధించిన పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. అనంతరం రంజాన్ పండుగను పురస్కరించుకొని సేమియా పంపిణీ చేశారు. ఆయా పండుగల విశిష్టతను కాలనీ పెద్దలు వివరించారు. కార్యక్రమంలో దేవరకొండ లక్ష్మణ్ బాబు, వెలగపూడి హనుమంతరావు, యరమల వెంకటేశ్వరరెడ్డి, వైవి పున్నారెడ్డి, సాంబయ్య, చీకటి నాగేశ్వరరావు, ముస్లిం పెద్దలు షేక్ నాగుల్ మీరా, షేక్ ఇబ్రహీం, ఎండి రఫీ, కాలనీ పెద్దలు పోతురాజు కృష్ణయ్య, తోట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
ధర స్థిరీకరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
● వచ్చే ఉగాది నాటికి కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం ● లాభాలు ఎక్కువగా వచ్చే ఆయిల్‌పామ్‌పై రైతులు దృష్టి పెట్టాలి ● ఫ్యాక్టరీ శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ ్వరరావువేంసూరు: పామాయిల్ ధర స్థిరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులకు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతీ పనికి ఆటంకం కలిగించాలని కొందరు చూస్తుంటారని, పనులు ఆగితే రాక్షసానందం పొందుతారని, సీతారామ కాల్వ తవ్వాలంటే రైతులను ప్రోత్సహించి స్టే తెప్పించారని విమర్శించారు. కొందరు బ్రోకర్లు నకిలీ మొక్కలు తెచ్చి.. ఇప్పుడు ఆయిల్‌ఫెడ్‌ను బదనాం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయిల్‌ఫెడ్ నుంచి వచ్చే మొక్కల్లో కల్తీవి ఉండవని, విదేశాల నుంచి రావడంతో ఒకటో, రెండో ఉండవచ్చు తప్ప.. మొత్తంగా నకిలీవి ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సత్తుపల్లి ప్రాంతానికి జూన్‌లోగా గోదావరి జలాలు తీసుకొస్తామని, నాగార్జున సాగర్ నిండకున్నా గోదావరి నీటితో ఈ ప్రాంత చెరువులు నింపుతామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించి పది లక్షల ఎకరాలకు రెండు పంటలకూ సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి జాతీయ రహదారి పనులు పూర్తవుతాయని, ఖమ్మం నుంచి 33 నిమిషాల్లో సత్తుపల్లికి వచ్చేలా కల్లూరు, వేంసూరులో ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆయిల్ పామ్‌కు గిట్టుబాటు ధర రూ.21 వేలు దాటేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని తెలిపారు. వేంసూరు అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు మంత్రి తుమ్మల వేంసూరు మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 65వేల మంది రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారని, వారిని ఒప్పించి 2.50లక్షల ఎకరాల్లో అయిల్ పామ్ సాగయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట సాగవుతోందని, ఏడాదికి 60 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. పామాయిల్ పంట కొనుగోలు చేశాక రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లోనే డబ్బు జమయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్‌బాబు, నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్, తుమ్మల యుగంధర్, బొబ్బరపూడి రాఘవరావు, నరేంద్ర, పుచ్చాకాయల సోమిరెడ్డి, కాసరి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సంవత్సరాదికి ఘనంగా స్వాగతం
ఖమ్మంగాంధీచౌక్ : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగకు జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి ఇష్టదైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళ్లకు మామిడాకు తోరణాలు కట్టి, షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి స్వీకరించారు. రైతులు పశువులకు రంగులు చల్లి పూజలు చేశారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన జమలాపురం, జీళ్లచెరువు గార్లొడ్డు ఆలయాలతో పాటు ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ బ్రమరాంభ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి, కమాన్ బజార్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి, కాల్వొడ్డులోని శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా విశ్వావసు నామ ఉగాది సందడి -
ప్రజారంజక పాలన అందిస్తున్నాం
● ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎర్రుపాలెం: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజా పాలన ఫలాలు దక్కేలా జన రంజక పాలన అందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని కాచారం, కొత్త గోపవరం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన పర్యటించారు. రైతులు, మహిళలు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల వారినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని చెప్పారు. కాచారంలో విద్యుత్ సరఫరా ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడగగా.. గ్రామంలో 200 వరకు కుటుంబాలు ఉన్నాయని, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు విద్యుత్ సరఫరా చాలా నాణ్యతగా వస్తోందని స్థానికులు చెప్పారు. రైతు భరోసాపై ఆరా తీయగా నాలుగైదు ఎకరాలకు వరకు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. గ్రామానికి రేషన్ దుకాణం, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరగా, భట్టి సానుకూలంగా స్పందించారు. అనంతరం కాచారం గ్రామ శివాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు, డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ సభ్యుడు శీలం ప్రతాపరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నర్సింహారావు, మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, నాయకులు బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, అనుమోలు కృష్ణారావు, మల్లెల లక్ష్మణరావు, గంటా తిరుపతమ్మ, శీలం శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి, దేవరకొండ రాజీవ్‌గాంధీ, గుడేటి బాబురావు, పిల్లి బోస్ పాల్గొన్నారు. -
నేడు ఈదుల్ ఫితర్
సత్తుపల్లి: ‘అల్లాహు అక్బర్.. అల్లాహు అక్బర్..’ అంటూ నెల రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సోమవారం అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా పరస్పరం ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. షవ్వాల్ చాంద్(నెలవంక) ఆదివారం రాత్రి చూడగానే ఈదుల్ ఫితర్(రంజాన్) పండుగ ఏర్పాట్లలో ముస్లింలు నిమగ్నమయ్యారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింల సందడితో పండుగ శోభ సంతరించుకుంది. జిల్లాలోని ఈద్గాలన్నింటినీ ముస్తాబు చేశారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్ష.. 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు రంజాన్ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. తప్పనిసరిగా తెల్లవారుజామున ‘ఫజర్’ నమాజ్ ఆచరించి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవాల్సి ఉంటుంది. నమాజ్‌కు వెళ్లే ముందు పవిత్రంగా(గుసూల్) తల స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి, అత్తరు పూసుకుంటారు. తప్పని సరిగా సేమియా(ఏదైనా తీపి పదార్థం) తిని వజూ చేసుకుని నమాజ్ కోసం ఈద్గాలకు వెళ్తారు. విధిగా ఫిత్రా దానం.. ఫిత్రాల పేరుతో ఈ పండుగను ‘ఈదుల్ ఫితర్’గా పిలుస్తుంటారు. ఆర్థికంగా ఉన్నవారు ఫిత్రా (దానం) తప్పనిసరిగా చెల్లించి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవాలి. పండుగ రోజు పుట్టిన బిడ్డకు కూడా ఫిత్రా దానం ఇవ్వాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో రెండున్నర కిలోల గోధుమల ధర ఎంత ఉంటుందో అంత ఫిత్రా చెల్లించాలి. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.80చొప్పున ప్రతి ఒక్కరు ఫిత్రా చెల్లించాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. అయితే అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చు. ఫిత్రా దానంతో పేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకునే అవకాశం ఉంటుంది.రంజాన్ వేడుకలకు ముస్తాబైన మసీదులు, ఈద్గాలు -
ముస్లింలకు పొంగులేటి శుభాకాంక్షలు
ఖమ్మంవన్‌టౌన్/ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లాలోని ముస్లింలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకునే పండుగ ఈద్ అని పేర్కొన్నారు. సహనం, త్యాగం, జాలి, దయ, సేవాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలంటూ దిశా నిర్దేశం చేసిన మాసం రంజాన్ అని తెలిపారు. పండుగను సంబురంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మరో ప్రకటన విడుదల చేశారు. మే డే పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: మే డే సందర్భంగా ఇచ్చే శ్రమ శక్తి, పారిశ్రామిక ఉత్తమ యాజమాన్య పురస్కారాల కోసం ఏప్రిల్ 10వ తేదీలోగా నామినేషన్ ఫారాలు సమర్పించాలని ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం విశిష్ట సేవలు అందించిన కార్మికులు, ట్రేడ్ యూనియన్ల నాయకులకు శ్రమ శక్తి పురస్కారాలు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులతో సఖ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రగతికి సహకరించిన మధ్య, పెద్ద తరహా పారిశ్రామిక యాజమాన్యాలకు ఉత్తమ యాజమాన్య పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు, యాజమాన్యాలు ఖమ్మం ఉప కార్మిక కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ ఫారాలు తీసుకుని పూర్తిచేశాక 10వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. బీసీ అభ్యర్థులకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణ ఖమ్మం రాపర్తినగర్: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యాన బీసీ ఆభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. నెల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇప్పించడమే కాక ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న బీసీ అభ్యర్థులు ఏప్రిల్ 8లోగా దరఖాస్తు చేసుకుంటే 12న ఆన్లైన్ ట్రైనింగ్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా 30 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వివరాల కోసం www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశానికి 20న పరీక్ష ఖమ్మంసహకారనగర్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా బీసీ గురుకుల విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.రాంబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 24 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, అందులో 6వ తరగతికి బాలికలకు 249, బాలురకు 249 సీట్లు, 7వ తరగతిలో బాలికలకు 170, బాలురకు 177, 8వ తరగతిలో బాలికలకు 97, బాలురకు 124, 9వ తరగతిలో బాలికలకు 139, బాలురకు 184 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు రూ.150 రుసుముతో ఈనెల 31వ తేదీ(సోమవారం)లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉషూలో అన్నాచెల్లెలికి పతకాలుఖమ్మం స్పోర్ట్స్ : జాతీయస్థాయి ఫెడరేషన్ కప్ ఉషూ టోర్నీలో ఖమ్మం నగరానికి చెందిన అన్నాచెల్లెలుకు పతకాలు లభించాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో ఈనెల 24 నుంచి 28 వరకు జరిగిన పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి పతకాలు దక్కించుకోవడం విశేషం. ఈ పోటీల్లో పి.పవి త్రాచారికి నాన్‌క్వాన్, ట్రెడిషనల్ సింగిల్ వెపన్‌లో కాంస్య పతకం లభించగా, పి.సత్యజిత్‌చారికి తైజిక్వాన్లో కాంస్య పతకం దక్కింది. జాతీయస్థాయిలో వీరు ప్రతిభ కనబర్చగా డీవైఎస్ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి అభినందించారు. -
●ఉద్యోగం చేస్తూనే..
ఖమ్మంక్రైం: ఖమ్మం ఏఎంవీఐగా పనిచేస్తున్న వెల్ది గోపీకృష్ణ గ్రూప్–1 ఫలితాల్లో సత్తాచాటాడు. జనరల్ కేటగిరిలో స్టేట్‌లో 70 ర్యాంక్, జోనల్లో 38 ర్యాంక్ సాధించారు. ఇటీవల రవాణాశాఖలో ఏఎంవీఐగా చేరిన గోపీకృష్ణ హనుమకొండ జిల్లాకు చెందినవారు. ఆయన గ్రూప్–1 పరీక్ష రాసే సమయంలో తండ్రి నాగేశ్వరరావు హఠాన్మరణం పొందారు. అయినా కష్టపడి చదివి గ్రూప్–1 ఫలితాల్లో ర్యాంక్ సాధించాడు. గోపీకృష్ణ ఇప్పటివరకు 10 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆయన్ను జిల్లా ఇన్చార్జ్ రవాణాశాఖాధికారి వెంకటరమణ, ఎంవీఐ వరప్రసాద్, ఏఎంవీఐ స్వర్ణలత, ఇతర సిబ్బంది అభినందించారు. -
జమలాపురంలో బ్రహ్మోత్సవాలు షురూ..
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారికి అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతంతో అభిషేకం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి వేపపువ్వు ప్రసాదం నివేదించారు. ఆలయ ప్రాంగణంలోని పుష్కరణి నుంచి ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ తదితరులు మేళతాళాలతో తీర్థపు బిందె తీసుకొచ్చారు. తొలుత విఘ్నేశ్వర పూజ చేసి పుణ్యావాచనం, అనుష్టానాలు, రుత్విక్కరణ తదితర పూజలు చేశారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అర్చకులు, వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అంతకుముందు శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు, ఉగాదిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అర్చకులు వేపపువ్వు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్తలు ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, కృష్ణమోహన్‌శర్మ, వకుళామాత స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు, ఆలయ సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
●గ్రూప్–1 ఫలితాల్లో సత్తా
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడుకు చెందిన తుమ్మలపల్లి సంజయ్ గ్రూప్–1 ఫలితాల్లో 469 మార్కులు సాధించి ఈడబ్ల్యూఎస్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్, జనరల్ విభాగంలో 249 ర్యాంక్ సాధించాడు. సంజయ్ తల్లితండ్రులు నర్సింహారావు, ఉమ బూడిదంపాడు గ్రామ సెంటర్లో హోటల్ నడుపుతున్నారు. సంజయ్ 1 నుంచి 5 వరకు బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్లో, 10వ తరగతి వరకు ఖమ్మంలోని గీతమ్స్‌లో, ఇంటర్, డిగ్రీ, గ్రూప్స్ పరీక్షల కోసం నారాయణ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు సంజయ్ తండ్రి తెలిపారు. సంజయ్‌ను పలువురు అభినందిస్తున్నారు. -
మక్క రైతులకు భరోసా
● మార్క్‌ఫెడ్ ద్వారా పంట కొనుగోళ్లకు రంగం సిద్ధం ● ఉమ్మడి జిల్లాలో 55 కేంద్రాలకు పైగా ఏర్పాటు ● ఈ వారంలోనే పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోళ్లు ఖమ్మం వ్యవసాయం: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికందుతోంది. మక్కలకు ప్రైవేటు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మక్కలు క్వింటాకు రూ.2,225 ధర ప్రకటించగా, వ్యాపారులు రూ.2వేల నుంచి రూ.2,100 మించి చెల్లించడం లేదు. దీంతో పంట కొనుగోలుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు చేసే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం ఆదేశించగా.. రాష్ట్రంలో పంట సాగు ఆధారంగా 320 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కొనుగోళ్లు మొదలుకానున్నాయి. 1.30లక్షలకు పైగా ఎకరాల్లో సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మొక్కజొన్న విస్తారంగా సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,14,901 ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 16,938 ఎకరాల్లో పంట సాగైంది. ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున రెండు జిల్లాల్లో దాదాపు 5.50 లక్షల క్వింటాళ్ల మక్కలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యాన 55కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఖమ్మం జిల్లాలో 44, భద్రాద్రి జిల్లాలో 11 నుంచి 15 కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. పీఏసీఎస్, డీసీఎంఎస్‌కు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా 38 కేంద్రాలు, డీసీఎంఎస్‌ల ద్వారా ఆరు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా 11 నుంచి 15 కేంద్రాల ఏర్పాటు చేస్తారు. వారం రోజుల్లో కొనుగోళ్లు.. పంట కోతలు, నూర్పిళ్లు ప్రారంభం కావడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన మార్క్‌ఫెడ్.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇప్పటికే పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం దిశానిర్దేశం చేసింది.ఎక్కడెక్కడ.. ఖమ్మం జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా బ్రాహ్మణపల్లి, మోటమర్రి, కలకోట, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం, పెద్దబీరవెల్లి, నారాయణపురం, బోనకల్, చిరునోముల, నాగులవంచ, పాతర్లపాడు, పొద్దుటూరు, పందిళ్లపల్లి, కొణిజర్ల, పెద్దమునగాల, పల్లిపాడు, రాజేశ్వరపురం, ముజ్జుగూడెం, మర్లపాడు, కందుకూరు, భరణిపాడు, మోటాపురం, జీళ్లచెరువు, ముదిగొండ, వనంవారి కిష్టాపురం, పెద్దమండవ, మేడేపల్లి, వీ.వీ.పాలెం, అల్లీపురం, తల్లాడ, మాధారం, కొండకొడిమ, సోమవరం, హస్నగుర్తి, కేశవాపురంలో కేంద్రాలు ఏర్పాటవుతాయి. డీసీఎంఎస్ ద్వారా రాయిగూడెం, అనాసాగరం, గువ్వలగూడెం, పెద్దగోపతి, తుమ్మలపల్లి, కొండాపురం, పమ్మి, లచ్చగూడెం గ్రామాల్లో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా టేకులపల్లి, ఆళ్లపల్లి గుండాల, మర్కోడు, శెట్టిపల్లి, కొత్తగూడెం, చల్లసముద్రం, కొమరారం, ఇల్లెందు, దమ్మపేట, అశ్వారావుపేటలో కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అవసరమైతే మరో నాలుగు నుంచి ఐదు కేంద్రాల ఏర్పాటుకు కూడా ఈ జిల్లాలో అవకాశం ఉంది. మక్కల కొనుగోళ్లకు సమగ్ర చర్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మక్కల కొనుగోళ్లకు సమగ్ర చర్యలు చేపట్టాం. పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్ సంస్థల ద్వారా పంట కొనుగోలుకు కార్యాచరణ చేశాం. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 2,225 మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. – సుునీత, మేనేజర్ మార్క్‌ఫెడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
సేవా లోపంపై వినియోగదారుల ఫోరం తీర్పు
ఖమ్మంలీగల్: అపార్ట్మెంట్లో ఫ్లాట్ విషయమై ఒప్పందాన్ని విస్మరించడంతో తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించడమే కాక నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఖమ్మం వినియోగదారుల ఫోరం సభ్యురాలు ఎ.మాధవీలత శనివారం తీర్పు చెప్పారు. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన గుగులోత్ రాంచందర్, గుగులోత్ లక్ష్మి 2016 డిసెంబర్లో ఖమ్మం వెలుగుమట్ల సమీపాన జీఆర్ఆర్ శ్రీనివాస వశిష్ఠ బ్లాక్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జీఆర్ఆర్ రియాలిటిస్ మేనేజింగ్ పార్టనర్ గుర్రం ప్రకాష్‌తో ఒప్పందం కుర్చుకుని రూ.16 లక్షలు చెల్లించారు. కానీ గడువులోగా ఫ్లాట్ ఇవ్వకపోవడమే కాక ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడంతో రాంచందర్, లక్ష్మి న్యాయవాది ద్వారా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీంతో వివరాలు పరిశీలించాక రూ.16 లక్షలను ఏడు శాతం వడ్డీతో చెల్లించాలని, నష్టపరిహారంగా రూ.3 లక్షలు, ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. కారు షోరూం యాజమాన్యానికి.. కారు మరమ్మతు చేయించినా మొరాయిస్తుండడంతో షోరూం బాధ్యులు స్పందించలేదని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. ఖమ్మం ధంసలాపురానికి చెందిన బండారు రమ్య కియా సోనెట్ కారును ఖమ్మం కియా షోరూంలో కొనుగోలు చేయగా, కొన్నాళ్లకు ప్రమాదం జరిగింది. ఈ మేరకు షోరూంలో రూ.1,97,157 వెచ్చించి మరమ్మతు చేయించినా తరచుగా సమస్య వస్తోంది. దీంతో న్యాయవాది ద్వారా ఖమ్మం వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించడంతో ఫోరమ్ ఇన్చార్జ్ చైర్మన్ లలిత వాదనలు విన్నాక కొత్త సామగ్రితో కారు మరమ్మతు చేసి ఇవ్వాలని తీర్పు చెప్పారు. అంతేకాక రూ.30 వేల పరిహారం, ఖర్చుల కింద రూ.10 వేలను ఫిర్యాదికి అందించాలని విజయవాడలోని సింహ మోటార్స్ బాధ్యులను తీర్పులో ఆదేశించారు. -
క్రోధి గతించి.. విశ్వావసు ఏతెంచె..
ఆమని రావాలి.. తెలుగు వారి తెలుగు తీయదనము ఉగాది పచ్చడి కమ్మదనము తెలుగు వారి కొత్త సంవత్సరం సంస్కతి సంప్రదాయాల కొనసాగింపు పిల్లలు కొత్త బట్టలతో కేరింతలు బంధువుల రాకతో ఇళ్లన్నీ కొత్త పలకరింపులు అందరి జీవితాల్లో ఆమని రావాలి ఇళ్లన్నీ ధాన్యపురాశులతో నిండాలి పెద్దల పూజలు పంచాగ శ్రవణం మాలోని మా శత్రువులను జయించుకొని జగమంతా వసుదైక కుటుంబంలా ఉండాలని జనుల్లో సంతోషం వెల్లివిరియాలని ఈ ఉగాది అందరిలో కొత్త కాంతులు నింపాలని జీవితమంటే చేదు కారం పులుపు తీపి ఒగరులతో కూడినదే ఈ ఉగాది తేవాలి ఉషస్సులను ఈ ఉగాది పోగొట్టాలి అందరి తమస్సులను –వేము రాములు, తెలుగు ఉపాధ్యాయుడు, మహదేవపురం హైస్కూల్ తెలుగు సంవత్సరాది.. ఉగాది తరలివచ్చింది. క్రోధి నామ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోగా.. చైత్ర మాసపు వసంత సొబగులతో విశ్వావసు కదలివచ్చింది. సమస్త జనుల్లో నూతన ఆశలను రేకెత్తిస్తూ ఏతెంచింది. గత కాలపు కష్టనష్టాలు, అవమానాలు, అనుమానాలకు సెలవిచ్చి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ కొత్త ఏడాదిలో ఆత్మీయ అనురాగాలతో ప్రశాంత పూల పరిమళాలు వెదజల్లుతూ ముందుకు సాగుదాం. నేడు ఏరువాక సాగే రైతుల లోగిళ్లు సిరి సంపదలతో తులతూగాలని ఆశిద్దాం. పండుగ ప్రాశస్త్యం, షడ్రుచుల విశిష్ఠతను ఆవిష్కరించిన సమసమాజ స్వాప్నికులు.. మన కవుల కృతులను ఆలకిద్దాం. – సాక్షి నెట్వర్క్ఉగాదిజం.. షడృచుల సంవత్సరాది, మన ఉగాది.. కాదది హిందూ మాత్రపు పర్వదినం సర్వ మానవాళికి మార్గదర్శనం.. భారతీయ సంస్కతిని ప్రతిబింబించే ఓ జీవన విధానం.. ఉగాది పచ్చడిలా కలిసి బతకమని చాటి చెప్పిన భారతావని ‘భాయి’చారాలు. బాహ్యం కాదు ఆత్మ సౌందర్యం చూడమని సృష్టి చెప్పే ప్రవచనాలు.. కుల మతాలు ఎన్నున్నా, వర్ణ గోత్రాలెన్నున్నా.. ఉగాది పచ్చడిలా అంతా కలిసిపోయి ఒదిగి పొవాలని.. ఐకమత్య భారతావనై వెలుగొందాలని చాటుతోంది ఉగాది.. –ఎం.డీ.మొహియుద్దీన్, శ్రీనగర్‌కాలనీ, ఖమ్మం ● -
ఒకేచోట ఆ మూడు చెట్లు!
ఖమ్మంగాంధీచౌక్: ఉగాది పచ్చడి తయారీలో వినియోగించే ముడిపదార్థాలను ఇచ్చే మూడు రకాల చెట్లు ఒకే చోట ఉండడం విశేషం. ఖమ్మం శ్రీనివాసనగర్ టీచర్స్‌కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న రైస్ మిల్లు ఆవరణలో మామిడి, వేప, చింత చెట్లతో పాటు కొబ్బరి చెట్టు కూడా ఉంది. షడ్రుచుల్లో వగరు రుచి కోసం మామిడి, పులుపు కోసం చింతపండు, వేపను చేదు కోసం ఉపయోగిస్తారు. ఈ మూడు చెట్లుమిల్లు ఆవరణలో ఉండగా.. ఏటా ఉగాదికి మిల్లులోని హమాలీలేకాక స్థానికులు మామిడి కాయలు, చింతకాయలు, వేప పూత కోసుకునే అవకాశం లభిస్తోంది. -
టెల్గూ న్యూ ఇయర్..
గూడు లేని గండుకోయిల దాగేందుకు గున్నమావి గుబురులు కానరాక తినేందుకు ఎర్రెర్రని చిగురులు లేక అంతరంగాన సమస్యల సుడిగండాల సుళ్లు తిరుగుతున్నా అరంగుళం మందాన వేసుకున్న మేకప్‌తో కప్పిపుచ్చుతున్న అతివలా గొంతెత్తి కూస్తోంది కుహూ కుహూ మంటూ తీయగా ఏ.ఐ. కోయిల అవతారమెత్తి! వాట్సాప్ సందేశాల వెల్లువలో మునుగుతూ సంప్రదాయమంతా అంతర్జాల చిత్రాల్లో తప్ప ప్రత్యక్షంగా కాంచలేక చిత్తరువులైన జనులు విశ్వాసం కోల్పోయి వసిస్తున్నా నూతన పదం ఆకర్షణకు లోనై ఆశను శ్వాసిస్తూ విశ్వావసు నామ సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ! –దీకొండ చంద్రకళ, చర్చికాంపౌండ్, ఖమ్మం -
ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య
సత్తుపల్లిటౌన్: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని మసీద్‌రోడ్డుకు చెందిన షేక్ అలీబాబా అలియాస్బన్ను (24) ఇటీవల డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి భాషావలీ అనారోగ్యంతో నాలుగేళ్ల కిందట మృతి చెందాడు. సోదరుడు భాషా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా తల్లి హసీన కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, మృతుడి స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి కావటంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అక్కడికి తరలించారు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థిని...తిరుమలాయపాలెం: ప్రమాదంలో గాయపడిన బీటెక్ విద్యార్థిని చికిత్స అనంతరం కూడా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంనకు చెందిన బాతుల ఉపేందర్ – ఉమ దంపతుల కుమార్తె ఉదీప (20) ఖమ్మంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆరు నెలల కిందట కళాశాలలో కింద పడిన ఆమె తలకు బలమైన గాయం కాగా, హైదరాబాద్‌లో చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. అయితే, మందులు వాడుతున్నా ఏమి గుర్తురాక ఇబ్బంది పడుతున్న ఆమె మానసికంగా వేదన చెందుతోంది. మూడు రోజుల కిందట తిరుమలాయపాలెంలో ఉండే మావయ్య మండల భిక్షం ఇంటికి వచ్చిన ఉదీప శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.జగదీశ్ తెలిపారు.ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతికొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు.. మండలంలోని పల్లిపాడుకు చెందిన కార్పెంటర్ నంచర్ల శివయ్యచారి (58) శనివారం తన ద్విచక్రవాహనంపై పాల కోసం వెళ్తూ పల్లిపాడు సెంటర్లో రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుంచి మియాపూర్ వెళ్తున్న రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివయ్య బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు పరబ్రహ్మాచారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా, గతంలో శివయ్యచారి తమ్ముడు కూడా ఇదేవిధంగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు.చిన్నారులపై కుక్క దాడినేలకొండపల్లి: మండలంలోని రాయగూడెంలో ఇద్దరు చిన్నారులపై శనివారం కుక్క దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారులు జాహ్నవి, వేదాన్ష ఆడుకుంటుండగా ఓ కుక్క వెంట పడి దాడి చేసింది. దీంతో స్థానికులు కుక్కను తరిమివేయగా అప్పటికే చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో నేలకొండపల్లిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. -
అభివృద్ధిలో జిల్లాకు తిరుగులేదు..
ఖమ్మంగాంధీచౌక్: విశ్వవసు నామ సంవత్సరంలో రాష్ట్రంలోనే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పంచాంగకర్త ఇంగువ రాజేశ్వరశర్మ స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా పంచాగం రాయడంతో పాటు ఉగాది రోజున పంచాంగ పఠనం చేసే ఆయన బోనకల్ మండలం రావినూతల వాసి. అంతేకాక పంచామృత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులుగా కొనసాగుతున్న ఆయన వద్ద పలువురు పలువురు ప్రముఖులు తమ రాశి ఆధారంగా మంచీచెడు చెప్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ఫలితాలను వివరించారు. ‘జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సరిపడా వర్షాలు కురుస్తాయి. జిల్లాలో నదీ జలాలు సమృద్ధిగా ఉండి పంటలు ఆశించిన స్థాయిలో పండుతాయి. మిర్చి ధర క్రమంగా పెరిగే అవకాశముంది. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు కలిసొస్తుంది. జిల్లాలో రాజకీయ నాయకుల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం గోచరిస్తోంది. 3, 4వ తరగతుల ఉద్యోగులకు బాగుంటుంది. అయితే, వ్యాపార రంగం కొంత మేర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు బాగుంటాయి. ఇంజనీరింగ్, సైన్స్ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి’ అని ఆయన వెల్లడించారు. 15 ఏళ్లుగా ఉగాది పచ్చడి పంపిణీ సత్తుపల్లిటౌన్: తెలుగు వారి లోగిళ్లలో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ సందర్భంగా అందరి ఇళ్లలో పచ్చడి చేసుకుని స్వీకరిస్తారు. అయితే, ఇళ్లలో చేసుకోలేని వారు, ప్రయాణంలో ఉన్న వారి కోసం సత్తుపల్లికి చెందిన మానుకోట (మాధురి) మధు పదిహేనేళ్లుగా పచ్చడి పంపిణీ చేస్తున్నారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి పంపిణీ చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంచాంగ కర్త ఇంగువ రాజేశ్వరశర్మ 25 ఏళ్లుగా పంచాంగం రాయడమే కాక పఠనం -
వీకే –7 ఓసీకి ఈసీ అనుమతి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వీకే –7 ఓపెన్ కాస్ట్ గనికి ఎట్టకేలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్(ఈసీ) అనుమతులు లభించాయి. దీంతో మరో రెండు నెలల్లో ఇక్కడ ఓబీ (ఓవర్ బర్డెన్) పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయితే 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా నుంచి సుమారు 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసీ అనుమతుల కోసం దాదాపు మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. లక్ష్య సాధనకు మార్గం.. సింగరేణి సంస్థ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అయితే వీకే –7 ఓసీకి ఈసీ అనుమతులు లభించడంతో 2025 – 26 ఆర్థిక సంవత్సర లక్ష్యాల సాధన కొంత సులువు కానుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో ఆఫ్ లోడింగ్, ఓసీలో హాల్రోడ్లు, మెటీరియల్ సరఫరా తదితర పనులు పూర్తి చేసుకుంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత వార్షిక లక్ష్యం 76 మిలియన్ టన్నులు చేరుకునేందుకు మార్గం సుగమం కానుంది. దీంతో పాటు ఒడిశాలోని నైనీబ్లాక్‌లో కనీసం ఆరు మిలియన్ టన్నులు తోడయితే 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఫారెస్ట్ క్లియరెన్స్.. సుమారు 1,114 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 190 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు ఎక్స్‌ప్లోరేషన్ అధికారుల అంచనా. దాదాపు 35 సంవత్సరాల జీవితకాలం ఉన్న వీకే –7 ఓసీలో 1000 మందికి ఉపాధి కలగనుంది. అయితే ఈ గనికి 773 హెక్టార్లలో అటవీ భూములు అవసరం అవుతాయి. ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో 341 హెక్టార్ల స్థలం ఉండగా.. అది కూడా వివిధ కాలనీల రూపంలో ఉందని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేస్తారని తెలుస్తోంది. ప్రైవేట్ భూ యజమానుల సమస్య పరిష్కారం అయినప్పటికీ, అటవీ భూముల సమస్య జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా, వేరేచోట భూమి ఇచ్చినా ఆ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు రాకముందే టండర్ ఖరారు.. వీకె–7 ఓసీకి గతేడాది అనుమతులు వస్తాయని భావించిన యాజమాన్యం రెండు సంవత్సరాల క్రితమే ఓబీ టెండర్‌ను ఖరారు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఓసీకి అనుమతులు వస్తాయని, పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి, టెండర్లను కూడా ఖరారు చేయడంతో సదరు కాంట్రాక్టర్లు కంపెనీపై ఒత్తిడి పెంచుతున్నారు. అనుమతులు రాకముందే టెండర్లు ఎలా కట్టబెట్టారని, మూడేళ్ల పాటు తామేం చేయాలని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఓబీ పనులు అనుమతి రావడం హర్షణీయం వీకె–7 భూగర్భ గని మూడబడడంతో గత మూడేళ్లుగా ఏరియాలో ఉత్పత్తి కొంత తగ్గింది. జీకే ఓసీలో నిక్షేపాలు అడుగంటగా ఈ లోటును జేవీఆర్ ఓసీ పూడ్చుతున్నప్పటికీ.. ఈ రెండు గనుల్లో సుమారు 1,400 మంది కార్మికుల సర్దుబాటు కష్టమైంది. ఇప్పుడు వీకే ఓసీ స్టేజ్–1కు అనుమతి రావడం హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తే ఇంత జాప్యం అయ్యేది కాదు. – ఎం. శాలెంరాజు, కొత్తగూడెం ఏరియా జీఎం -
నువ్వు వస్తున్నావు సరే..
మానవీయ విలువలు మృగ్యమవుతున్నవి విశ్వావసు ఉగాదికి భారమైన హృదయంతో స్వాగతం పలకాల్సి వస్తున్నది. స్వార్థపరుల అంతులేని ఆశకు కుచించుకు పోతున్న అరణ్యాలు. కనుమరుగవుతున్న పచ్చదనం.. వెదజల్లుతున్న కాలుష్యం ఇవ్వన్నీ సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. విశ్వావసూ నువ్వువస్తున్నావు సరే! రేపటి పౌరుల భవిష్యత్‌ను గమనిస్తున్నావా? విశ్వావసూ.. విపరీతాల మధ్య నువ్వొస్తున్నావు! మార్గ దర్శనం చేస్తావని, ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నా! –బొల్లేపల్లి మధుసూదన్‌రాజు, సత్తుపల్లి -
జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించడంతో పాటు పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీసేవ చేశారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. -
తీపి.. చేదు సమ్మిళితం !
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ఇచ్చి హామీ మేరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే, ఈ పథకాలతో జిల్లాలో లబ్ధి పొందిన వారు ఆనందంగా ఉండగా... దరఖాస్తు చేసుకున్నా పథకాలు అందని వారు నిరీక్షిస్తున్నారు. రైతుభరోసా, రుణమాఫీ, రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు పొందిన వారంతా విశ్వావసు నామ సంవత్సరంలోకి ఆనందంగా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా వారు మాత్రం ఉగాది పండుగ రోజు పచ్చడి రుచి మాదిరిగానే పథకాలు అందుతాయన్న ఆశల తీపి.. ఎప్పుడు అందుతాయో తెలియని వగరు రుచి ఎదుర్కోనున్నారు. కానీ ఇది చేదుగా మాత్రం మారొద్దని వారి ఆకాంక్షగా చెబుతున్నారు. సొంత ఇంటిలో చేరాలని.. ప్రభుత్వం పథకాలకు సంబంధించి నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 850 మంది లబ్ధిదారులను ప్రకటించగా.. ఇందులో 500 మందికి గ్రౌండింగ్ పూర్తయింది. దీంతో వీరంతా విశ్వావసు నామ సంవత్సరంలో సొంత గూటికి చేరుకుని తీపి వేడుక జరుపుకోనున్నారు. మరో 350 మందికి ఆర్థిక, ఇతర కారణాలతో ఆలస్యం అవుతుండగా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 3,40,923 మంది దరఖాస్తు చేసుకోగా 60,747 మంది అర్హులను గుర్తించారు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మరో 4,536 మంది అర్హులుగా తేలారు. వీరంతా అద్దె ఇళ్లు, గుడిసెల్లో గడుపుతున్న చేదు జీవనం నుంచి తీపి జ్ఞాపకంగా సొంతింట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. రైతులకు కలిసి వచ్చేనా.. జిల్లాలో రైతు భరోసా కింద 3,51,592 మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.371.06 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకు 2,65,392 మంది రైతుల ఖాతాల్లో రూ.215.78 కోట్లు జమ అయ్యాయి. అందరికీ సోమవారం లోగా అందుతాయని మంత్రి తుమ్మల ప్రకటించినా ఖాతాలో జమ అయితేనే తమకు తీపి కబురు చెప్పినట్లని వారు భావిస్తున్నారు. ఇక జిల్లాలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వరకు 3,73,157 మంది రైతులు బ్యాంకుల ద్వారా రూ.4,307.58 కోట్ల రుణాలు తీసుకున్నారు. మూడు విడతలుగా చేస్తే 1,15,627 మందికి రూ.770.95 కోట్లే మాఫీ అయ్యాయి. దీంతో మిగతా వారి గొంతులో చేదు గుళికలు కరిగిపోవడం లేదు. అంతేకాక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధర గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది రూ.14 వేల లోపే ధర వస్తుండడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. రేషన్‌కార్డులు వస్తేనే.. జిల్లాలో రేషన్‌కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా కార్డుల జారీ లేకపోవడంతో కొన్ని సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ ఏడాది జనవరి 26న కొత్తగా 484రేషన్‌కార్డులు మంజూరు చేయగా, వీటి ద్వారా 862 మందికి బియ్యం అందుతోంది. అయితే, గ్రామసభల ద్వారా 66,115, మీ సేవ కేంద్రాల ద్వారా అందిన 6,966 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్ 1నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనుండడంతో దరఖాస్తుదారులంతా తమకు కొత్త సంవత్సరంలో కార్డులు అందాలని ఆశిస్తున్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందక అర్హత ఉన్న వారి ఎదురుచూపులు ఈ ఏడాది సొంతింటి కల నెరవేరుతుందని ఆశలు రుణమాఫీ కాక.. మిర్చి ధర తగ్గడంతో రైతుల్లో నిరాశ అందరి ఆశలను ‘విశ్వావసు’ తీర్చాలని ఆకాంక్షరాజీవ్ యువవికాసం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. యువత సొంత వ్యాపారాలు, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణ సాయం అందనుంది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్రిస్టియన్, గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుండగా, ఇప్పటివరకు బీసీ యువత నుంచి 8,720, ఎస్సీల నుంచి 5,741, మైనార్టీల నుంచి 1,102, క్రిస్టియన్ల నుంచి 19, గిరిజనుల నుంచి 3వేల దరఖాస్తులు అందాయి. వీరి అర్హతల ఆధారంగా సబ్సిడీ రుణం జూన్, జూలైలో మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. తమ జీవితం ‘విశ్వావసు’ నామ సంవత్సరంలో కొత్త మలుపు తిరగనుందని ఆకాంక్షిస్తున్నారు. -
ఉగాది ప్రేమికుడు.. దినేశ్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంరూరల్ మండలం పెదతండాకు చెందిన చింతల దినేశ్‌కు మొక్కలు పెంపకం ఇష్టం. ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు, పూలు, పండ్ల మొక్కల చెట్లు పెంచుతుంటారు. మామిడి చెట్టు, వేప చెట్టు నాటగా.. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో ఉన్న చింత చెట్టును సైతం సంరక్షిస్తున్నారు. దీంతో ఏటా ఉగాది పండుగ సందర్భంగా కాలనీవాసులు, స్నేహితులు దినేశ్ ఇంటికి క్యూ కడతారు. మామిడి కాయలు, వేప పూతతో పాటు చింత పండును కవర్లలో పెట్టి ఇంటికి వచ్చిన వారందరికీ ఇవ్వడాన్ని దినేశ్ ఆనవాయితీగా మార్చుకున్నాడు. -
దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం
● ప్రతీ షాప్‌నకు 50 క్వింటాళ్లు తగ్గకుండా సరఫరా ● ఏప్రిల్ 1నుంచి పంపిణీకి ఏర్పాట్లు నేలకొండపల్లి: రేషన్‌షాప్‌ల ద్వారా వచ్చేనెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక జిల్లాలో కూడా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు పౌరసరఫరాల శాఖ గోదాంల నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు బియ్యం చేరవేస్తున్నారు. ఆపై రేషన్‌షాపులకు పంపిస్తున్నారు. అయితే, గడువు తక్కువగా ఉండడంతో ప్రతీ షాప్‌నకు కనీసం 50క్వింటాళ్లకు తగ్గకుండా సన్న బియ్యం చేరవేస్తుండగా, పెద్ద గ్రామాల్లోనైతే కావాల్సిన బియ్యంలో 80–90 శాతం మేర సన్నబియ్యమే పంపిస్తున్నారు. సరఫరా చేసేది ఎలా? ఇన్నాళ్లు లావు రకాల బియ్యం సరఫరా చేస్తుండడంతో రేషన్ లబ్ధిదారులు చాలా మంది తీసుకోవడం లేదు. కానీ సన్నబియ్యం పంపిణీ మొదలైతే అందరూ ముందుకొచ్చే అవకాశముంది. అయితే, ప్రభుత్వం ఏప్రిల్ నెలకు కావాల్సిన మొత్తం బియ్యం సన్నరకాలు పంపడం లేదు. దీంతో లబ్ధిదారులకు తామేం సమాధానం చెప్పాలని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకటి, రెండురోజుల్లోనే సన్నం బియ్యం స్టాక్ అయిపోయి, ఆతర్వాత దొడ్డు బియ్యం ఇస్తే కార్డుదారులు తిరగబడే ప్రమాదముందని వాపోతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తొలి విడత ఇచ్చిన సన్నబియ్యం ఖాళీ కాకముందే మరోదఫా పంపిణీ చేయాలని అధికారులను కోరుతున్నారు. -
ఇక సాఫీగా వేతనాల చెల్లింపు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్మికుల వేతనాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పెండింగ్ బిల్లులు చెల్లించడమే కాక బెడ్ల సంఖ్య పెంచాలని కోరుతూ కాంట్రాక్టర్ హైకోర్టులో కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.పడకలు తగ్గడంతో...పెద్దాస్పత్రిలోని వివిధ విభాగాల్లో 259 మంది కార్మికులు పనిచేస్తుండగా.. నిర్వహణ బాధ్యతలను చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. ప్రభుత్వం నుంచి సంస్థకు, వారి ద్వారా సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్ కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. అయితే నెలనెలా సక్రమంగా జీతాలు రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వీరికి నెలకు రూ.14,500 మంజూరు చేస్తుండగా కటింగ్ పోను రూ.13వేలు ఖాతాలో జమ చేస్తారు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు 575 పడకలకు అనుమతి ఉండేది. ఆ సామర్ధ్యం మేర రూ.50,88,239 చెల్లించేవారు. అయితే 2023 నవంబర్ నుండి పెద్దాస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఈ) పరిధిలోకి వెళ్లాక 430 పడకలే పరిగణనలోకి తీసుకుంటూ చెల్లిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్‌కు రూ.35.40లక్షలే వస్తుండగా, గతంతో పోలిస్తే రూ.15,48,239 తగ్గడంతో కార్మికులకు వేతనాల చెల్లింపులో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. నెలల పాటు ఎదురుచూడడం, ఆందోళన చేసినప్పుడు ఒక నెల వేతనం ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు ద్వారా సమస్యకు పరిష్కారం లభించింది. ఇకపై ప్రతీనెల కాంట్రాక్టర్‌కు పూర్తిస్థాయిలో చెల్లించడమేకాక 2023 నవంబర్ నుండి ఉన్న బకాయిలు కూడా విడుదల చేయనున్నారు. కోర్టు తీర్పు ఆధారంగా రూ.2,63,20,063ను కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ఉత్తర్వులు సైతం విడుదలయ్యాయి.