ఖమ్మం సహకారనగర్: ఇంటర్‌మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం కోసం ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ సెంటర్ కొనసాగుతోంది. ఈమేరకు కేంద్రాన్ని ఇంటర్‌మీడియట్ బోర్డుకు చెందిన పరిశీలకుడు సీహెచ్.యాదగిరి సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన అధ్యాపకులకు పలు సూచనలు చేయగా, డీఐఈఓ రవిబాబు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు పాల్గొన్నారు. కాగా, స్పాట్ విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని యాదిగిరికి వినతిపత్రం అందించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ సంఘాల బాధ్యులు కె.సురేష్, గుమ్మడి మల్లయ్య, వినోద్‌బాబు, విజయ్, కిషోర్‌బాబు వినతిపత్రం అందజేశారు.