
సంవత్సరాదికి ఘనంగా స్వాగతం
ఖమ్మంగాంధీచౌక్ : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగకు జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి ఇష్టదైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళ్లకు మామిడాకు తోరణాలు కట్టి, షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి స్వీకరించారు. రైతులు పశువులకు రంగులు చల్లి పూజలు చేశారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన జమలాపురం, జీళ్లచెరువు గార్లొడ్డు ఆలయాలతో పాటు ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ బ్రమరాంభ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి, కమాన్ బజార్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి, కాల్వొడ్డులోని శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
జిల్లా వ్యాప్తంగా విశ్వావసు నామ
ఉగాది సందడి

సంవత్సరాదికి ఘనంగా స్వాగతం