
బస్సు ఢీకొని మహిళ మృతి
పెనుబల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని వీఎం బంజర్ రింగ్‌సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. వీఎం బంజర్ రింగ్‌సెంటర్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను సత్తుపల్లి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహిళను మండలంలోని పాతకారాయిగూడెం గ్రామానికి చెందిన బాణోతు మారోణి (50)గా గుర్తించి.. పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు.

బస్సు ఢీకొని మహిళ మృతి