ఖమ్మం మామిళ్లగూడెం: ముస్లింలు ఐకమత్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. ఖమ్మం షాదీఖానాలో శుక్రవారం ఏర్పాటుచేసిన ఈద్ మిలాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏ మతమైనా అందరి మంచినే కోరుకుంటుందని తెలిపారు. ఈవిషయాన్ని గుర్తించి అందరూ సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలని, అన్ని మతాల వారు ఎదుటివారి సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. ఈకార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండీ.ఖమర్, కార్పొరేటర్లు, నాయకులు కర్నాటి కృష్ణ, షేక్ మగ్బూల్, కూరాకుల వలరాజు, కోటేశ్వరావు, జ్యోతిరెడ్డి, షంసుద్దిన్, ముజాహిద్, ఫిరోజ్, ఇజార్, ఛోటు, మున్నా, చంటి, పగడాల నాగారాజు, విజయ్‌కుమార్, ఎండీ.తాజుద్దీన్, న్యాయవాదులు కొల్లి సత్యనారాయణ, ఎం.డీ.తౌఫిక్, సీపీఎం, సీపీఎం నాయకులు నాగుల్‌మీరా, సీపీఐ నాయకులు షేక్ జానీమియా, అబ్దుల్ ఘనీ, సుధాకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
‘ఈద్ మిలాప్’లో మాజీ మంత్రి పువ్వాడ