
ఈ నెల 10 నుంచి ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు
తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు వేంకటాచలపతి దేవస్థానం కమిటీ బాధ్యులు వెల్లడించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జట్లు పాల్గొంటాయని తెలిపారు. మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లకు దాతల చేయూతతో రూ.70,116, రూ.50116, రూ.40116, రూ.30116, రూ.25,116, రూ.20116, రూ.15,116, రూ.10,116 అందజేస్తామని పేర్కొన్నారు.
ఒకేషనల్ పరీక్షకు
733 మంది హాజరు
ఖమ్మంసహకారనగర్: ఎస్సెస్సీ ఒకేషనల్ పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 751 మంది విద్యార్థులకు గాను 733 మంది హాజరు కాగా, 18 మంది గైర్హాజరయ్యారని డీఈఓ తెలిపారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు తాను పలు సెంటర్లలో పరిశీలించామని వెల్లడించారు.
కలెక్టరేట్‌లో కార్మికురాలికి పాముకాటు
ఖమ్మంసహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని గార్డెన్‌ను శుభ్రం చేస్తున్న క్రమాన ఓ కార్మికురాలిని పాము కాటు వేసింది. కార్మికులంతా గురువారం గార్డెన్‌లో పనిచేస్తుండగా రఘునాథపా లెం మండలం వీ.వీ.పాలెంకు చెందిన ఆదిలక్ష్మి కాలిపై పాముకాటు వేయడంతో ఆమె ఆందోళ నకు గురైంది. దీంతో కలెక్టరేట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మిని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు చెప్పగా మెరుగైన వైద్యం అందించాలని సూచించిన కలెక్టర్ ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కలెక్టరేట్ ఏఓ అరుణ, హార్టికల్చర్ ఆఫీసర్ మధుసూదన్, కలెక్టరేట్ కేర్ టేకర్ వెంకన్న పాల్గొన్నారు.
‘యువ వికాసం’కు దరఖాస్తు చేసుకోండి
ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ నిరుద్యోగులు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్ సూచించారు. అర్హత కలిగిన వారు టీఎస్‌ఓబీఎంఎంఎస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలు
నేలకొండపల్లి: శ్రీరామనవమి సందర్భంగా మండల కేంద్రంలోని రామదాసు ధ్యాన మందిరంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల భక్తులు మూడు రోజుల నుంచి గోటి తలంబాలు చేస్తుండగా, గురువారం పసుపు, కుంకుమ కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు. అనంతరం శ్రీరామ నామంతో ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు సౌమిత్రి రమేశ్, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణుడి ఆలయంలో చోరీ
పెనుబల్లి: మండలంలోని పాతకారాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు బుధవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగులగొట్టి సుమా రు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయా న్ని గురువారం ఉదయం గమనించిన నిర్వాహకులు గ్రామపెద్దలకు సమాచారం ఇవ్వగా వీఎం బంజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నెల 10 నుంచి ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు