
● శుభలేఖలు పంచుతూ రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి ● అతడి త
హైకోర్టు జడ్జిని కలిసిన ‘బార్’ అధ్యక్షుడు
ఖమ్మంలీగల్ : హైకోర్టు జడ్జి నందాను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం వచ్చిన ఆమెను బార్ అధ్యక్షుడితోపాటు జాయింట్ సెక్రటరీ గద్దల దిలీప్‌కుమార్, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ బిచ్చాల తిరుమలరావు, దిరిశాల కృష్ణారావు, కర్లపూడి శ్రీనివాసరావు, పొన్నెకంటి నరసరావు, మల్సూరు తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ముగిసిన మత్స్యకారుల శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు, వలలను అందజేశారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కేవీకే సీనియర్ సైంటిస్ట్ లవకుమార్, పాలేరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డాక్డర్ జి.విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడారు. చేపల పెంపకంలో, ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు పాటించాలని, అందుకు తగిన శిక్షణ అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నాగరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరురోజుల్లో పెళ్లి..
అంతలోనే అనంతలోకాలకు..
కల్లూరు: మరో ఆరు రోజుల్లో వివాహం కావాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన కల్లూరు మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని ఓబులరావుబంజర గ్రామానికి చెందిన బానోత్ వేణు(24)కు ఈనెల 11న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై తండ్రి చిన్నికృష్ణతో కలిసి బంధు, మిత్రులకు పెళ్లి పత్రికలు పంచి తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో కల్లూరులోని ఓ రెస్టారెంట్ సమీపంలో మరో ద్విచక్ర వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బైక్‌పై ఉన్న బయ్యారపు జస్వంత్ సాయి, ఇందుకాంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. వేణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

● శుభలేఖలు పంచుతూ రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి ● అతడి త