
భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి
● ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టండి ● అధికారులకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యా ణం, పట్టాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులు ఎండల కారణంగా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధి కారులకు సూచించారు. మిథిలా స్టేడియం, ఆల య పరిసరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. సెక్టార్ల విభజన, సీఎం, వీవీఐపీ, ఇతర సెక్టార్లలో ఏర్పాట్ల గురించి అధికారులు మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎండల నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా తాగునీరు, మజ్జిగ, గాలి వీచేలా ఏర్పాట్లు చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భక్తులు కల్యాణంతో పాటు ఆ తర్వాత మూలమూర్తులను దర్శించుకునేలా చూడాలని, భక్తులందరికీ తలంబ్రాలు, ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, దేవస్థానం ఈఓ రమాదేవి, ఈఈ రవీందర్, ఆర్‌డీఓ దామోదర్‌రావు పాల్గొన్నారు.