
నువ్వు వస్తున్నావు సరే..
మానవీయ విలువలు మృగ్యమవుతున్నవి
విశ్వావసు ఉగాదికి భారమైన హృదయంతో స్వాగతం పలకాల్సి వస్తున్నది.
స్వార్థపరుల అంతులేని ఆశకు కుచించుకు పోతున్న అరణ్యాలు.
కనుమరుగవుతున్న పచ్చదనం.. వెదజల్లుతున్న కాలుష్యం
ఇవ్వన్నీ సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
విశ్వావసూ నువ్వువస్తున్నావు సరే!
రేపటి పౌరుల భవిష్యత్‌ను గమనిస్తున్నావా?
విశ్వావసూ.. విపరీతాల మధ్య నువ్వొస్తున్నావు!
మార్గ దర్శనం చేస్తావని, ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నా!
–బొల్లేపల్లి మధుసూదన్‌రాజు,
సత్తుపల్లి