
●వెలుగుమట్ల అటవీపార్కులో మంటలు
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల అటవీ పార్కులో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్క్‌ను ఆనుకుని ఉన్న రైతుల పొలాల్లో చెత్తకు నిప్పు పెట్టగా.. గాలిదుమారంతో ఆ మంటలు పార్క్ వైపునకు వ్యాపించాయి. దీంతో చెట్లు, ఎండుగడ్డి తగలబడుతూ మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అటవీ, అగ్నిమాపక శాఖల ఉద్యోగులు మూడు ఫైరింజన్లు ద్వారా మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. తొలుత ఒక ఫైర్ ఇంజన్ రాగా, మరో రెండు వాహనాలను కూడా తెప్పించినట్లు ఖమ్మం ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వరరావు తెలిపారు. రాత్రి కావడం, గాలికి మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో అటు సిబ్బంది, ఇటు వాహనాలు లోపలకు వెళ్లే పరిస్థితి లేకున్నా అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాద సమాచారం తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు.

●వెలుగుమట్ల అటవీపార్కులో మంటలు