ఆడపిల్ల ఉన్నవారు అదృష్టవంతులు | - | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల ఉన్నవారు అదృష్టవంతులు

Apr 4 2025 12:20 AM | Updated on Apr 4 2025 12:20 AM

ఆడపిల్ల ఉన్నవారు అదృష్టవంతులు

ఆడపిల్ల ఉన్నవారు అదృష్టవంతులు

కామేపల్లి: ఆడపిల్ల ఇంటికి వరమని, ఆడపిల్ల జన్మించిన కుటుంబీకులు అదృష్టవంతులని కల్టెకర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. మండలంలోని కొత్తలింగాల, గోవింద్రాల గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. కొత్తలింగాలకు చెందిన ఉండేటి అమృత–సుధాకర్‌ దంపతులకు ఇటీవల ఆడపిల్ల జన్మించగా వారితో పాటు సుధాకర్‌ తల్లిదండ్రులను కలెక్టర్‌ ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ లో భాగంగా సన్మానించి స్వీట్లు, పండ్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలే ముందు నిలుస్తున్నందున ఆడపిల్లలను చిన్నచూపు చూడకుండా చదివించాలని సూచించారు. ఆతర్వాత ఖమ్మంకు చెందిన డాక్టర్‌ జానకీరామయ్య–సరోజని మనమడు అభి కొత్తలింగాల అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.5 లక్షల విలువైన సోలార్‌ ఇన్వెర్టర్లు అందించగా కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం గోవింద్రాలలో బానోత్‌ లక్ష్మణ్‌నాయక్‌ సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించారు. సాగు విధానం, సేంద్రియ విధానంలో పండ్లు మాగబెట్టడం, మార్కెటింగ్‌పై ఆరాతీశారు. ఈ కార్యక్రమాల్లో డీడబ్ల్యూఓ రామ్‌గోపాల్‌రెడ్డి, ఉద్యాన శాఖాధికారి మధుసూదన్‌రావు, ఏడీఏ వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ సుధాకర్‌, ఎంపీడీఓ రవీందర్‌, ఏఓ తారాదేవితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, నాయకులు శ్రీనివాసులు, సతీశ్‌, వేణు, శ్రావణి, సక్రు, ప్రభాకర్‌రెడ్డి, ఉషా, జగదీశ్వర్‌, వెంకటమ్మ, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement