శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

Apr 5 2025 12:11 AM | Updated on Apr 5 2025 12:11 AM

శిక్ష

శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తి ఉన్న సీనియర్‌ క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణా శిబిరాల ఏర్పాటుపై దృష్టి సారించగా, ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలని తెలిపారు. నిర్వాహకులకు గౌరవ వేతనంగా రూ.4వేలు చెల్లిస్తామని, దరఖాస్తులను ఖమ్మం పటేల్‌ స్టేడియంలోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

హెచ్‌సీ కుటుంబానికి భద్రతా పరిహారం చెక్కు

ఖమ్మంక్రైం: ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ పాపా కుటుంబానికి రూ.8లక్షల భద్రతా పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా చెక్కును సీపీ సునీల్‌దత్‌ శుక్రవారం అందజేసి మాట్లాడారు. శాఖాపరంగా కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు.

మెడికల్‌ కాలేజీకి

29 మంది ఎస్‌ఆర్‌లు

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 29 మంది సీనియర్‌ రెసిడెంట్లను కేటాయించారు. ఇటీవల పీజీ పూర్తి చేసిన వీరు ఏడాది పాటు వైద్యసేవలు అందించనుండగా, ఇప్పటికే 26 మంది విధుల్లో చేరారు. అనస్తీసియా, జనరల్‌ సర్జరీ విభాగాల్లో ముగ్గురు చొప్పున, రేడియో డయాగ్నసిస్‌, ఆప్తమాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్‌, గైనిక్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల్లో ఇద్దరు చొప్పున, రెస్పిరేటర్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, పిజియాట్రిక్‌, మైక్రోబయాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున విధుల్లో చేరారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత నేపథ్యాన ఎస్‌ఆర్‌ల కేటాయింపుతో వైద్యసేవల్లో ఇబ్బందులు తొలగనున్నాయి.

విద్యుత్‌ సరఫరాను పరిశీలించిన సీఈ

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్రంలో విద్యుత్‌ సరఫరా తీరుతెన్నులు, సబ్‌స్టేషన్లలో అభివృద్ధి పనులను ఎన్పీడీసీఎల్‌ సీఈ రాజుచౌహాన్‌ శుక్రవారం పరిశీలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి సబ్‌ స్టేషన్‌లో రూ.1.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే 8 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించిన ఆయన ఖిలా ఏరియాలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వేసవిలో ఎంత డిమాండ్‌ పెరిగినా మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యాన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి సూచించారు. ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈ నంబూరి రామారావు, ఏడీఈలు నాగార్జున, యాదగిరి, ఏఈలు పాల్గొన్నారు.

మక్కల కొనుగోళ్లు ప్రారంభం

చింతకాని: మొక్కజొన్నలకు మద్దతు ధర దక్కేలా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యాన కొనుగోళ్లు ప్రారంభించారు. ఈసందర్భంగా చింతకానిలో ఏర్పాటుచేసిన కేంద్రాన్ని శుక్రవారం మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సునీత ప్రారంభించి మాట్లాడారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. తేమ 14శాతంలోపు ఉన్న మొక్కజొన్నలు క్వింటాకు రూ.2,225 మద్దతు ధర లభి స్తుందని తెలిపారు. తహసీల్దార్‌ కె.అనంతరాజు, ఏఓ మానస, సొసైటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్లు కె.శేఖర్‌రెడ్డి, ఎం.రవి, సీఈఓ శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ డైరక్టర్‌ కె.గోవిందరావుతో పాటు కోటేశ్వరరావు, మనోహర్‌బాబు, కోటయ్య, వెంకటేశ్వర్లు, గోపి పాల్గొన్నారు.

శిక్షణ శిబిరాల  నిర్వహణకు దరఖాస్తులు
1
1/2

శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

శిక్షణ శిబిరాల  నిర్వహణకు దరఖాస్తులు
2
2/2

శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement