ట్రామా కేర్
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా వందలాది కి.మీ. మేర జాతీయ రహదారులు వెళ్తున్నాయి. త్వరలోనే ఖమ్మం–దేవరపల్లి హైవే కూడా అందుబాటులోకి రానుంది. అయితే, నాణ్య మైన రహదారులు ఉండడంతో వాహనాలు రయ్‌రయ్ మంటూ సాగుతుండగా ప్రమాదాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు అత్యవసరంగా చికిత్స అందించేలా ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సెంటర్లు ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు లేకపోగా.. క్షతగాత్రుల చికిత్సకు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అత్యవసర చికిత్స అందక బాధితులను ఖమ్మంకే తరలిస్తున్నారు. ఇక్క డా పరిస్థితి చక్కబడకపోతే హైదరాబాద్ పంపిస్తండడం.. ఇంతలోనే విలువైన సమయం గడిచిపోయి బాధితుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.
35 కి.మీ.కు ఒకటి..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. మృతుల కుటుంబాలకు తీరని వేదన మిగులుతోంది. ఏదైనా రహదారిపై ప్రమా దం జరిగినప్పుడు తొలి అర గంట, గంటలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. దీనిని వైద్యులు గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఈనేపథ్యాన క్షతగాత్రులకు సత్వరమే వైద్యం అందేలా రాష్ట్ర వ్యాప్తంగా 90 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 35 కి.మీ. దూరానికి ఒకటి ఏర్పాటుచేయనుండగా.. భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, తల్లాడ, మధిర, పాలేరు వంటి ప్రాంతాల్లో జాతీయ రహదారులు వెళ్తుండడంతో ఉమ్మడి జిల్లాలో రెండు నుంచి మూడు సెంటర్లు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. ఈ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు అప్పగించే అవకాశం ఉంది.
ఆరు నెలల్లో క్రిటికల్ కేర్ యూనిట్
పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ భవనం ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జాతీయ రహదారులపై 90 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాకు స్థానం
దక్కనున్నట్లు తెలుస్తున్నా.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే, వీటికన్నా ముందే పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ అందుబాటులోకి వస్తుంది. – ఎస్.రాజేశ్వరరావు,
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
హైవేలపై సెంటర్ల ఏర్పాటుకు
ప్రభుత్వ నిర్ణయం
క్షతగాత్రులకు సత్వరమే
వైద్యం అందించే ప్రయత్నం
తద్వారా మృతుల సంఖ్య తగ్గించొచ్చని భావన
అంతకుముందే అందుబాటులోకి రానున్న
క్రిటికల్ కేర్ యూనిట్
జిల్లాలో ప్రమాదాల వివరాలు...
ఏడాది ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2024 785 281 629మంది
2025 50 33 100
పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్
క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ప్రతిపాధనలు పంపిస్తున్నా ఫలితం కానరాలేదు. తాజాగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడమే కాక ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ కసరత్తు పూర్తయి నిర్మాణాలు చేపట్టేలోగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందుతుంది. ఖమ్మం ఆస్పత్రి ఆవరణలో క్రిటికల్ కేర్ యూనిట్‌ను గత ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్రప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.21 కోట్లు కేటాయించింది. టీఎస్‌ఎమ్‌ఎస్‌ఐడీసీ ఆధ్వర్యాన జీ ప్లస్ 3 భవన నిర్మాణాన్ని ఆరు నెలల క్రితం ప్రారంభించడంతో మరో నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే ట్రామా కేర్ భవనాలు ఏర్పాటయ్యేవరకు జిల్లాలో ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందుతుంది.
ప్రాణం బేఫికర్
ప్రాణం బేఫికర్
ప్రాణం బేఫికర్
ప్రాణం బేఫికర్
ప్రాణం బేఫికర్
ప్రాణం బేఫికర్