ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి విజయంతో పాదయాత్ర
ఖమ్మంసహకారనగర్/కొణిజర్ల/వైరా: పీఆర్‌టీయూ టీఎస్ నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించిన నేపథ్యాన యూనియన్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు నేతృత్వాన మంగళవారం ఖమ్మం ఇందిరానగర్‌లోని వినాయక స్వామి దేవాలయం నుండి 23మందితో కొణిజర్ల మీదుగా 25 కి.మీ. పాదయాత్ర చేపట్టి వైరాలోని పాత శివాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా వైరాలోని పాత శివాలయం, రిజర్వాయర్ సమీపంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీపాల్‌రెడ్డి విజయానికి గుర్తుగా పాదయాత్ర చేపట్టామని తెలిపారు. ఆయన ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయులు, విద్యారంగం సమస్యల పరిష్కారానికి పాటుపడతారని చెప్పారు. ఈ యాత్రలో పీఆర్‌టీయూ జిల్లా, మండలాల బాధ్యులు వెలిశెట్టి నరసింహారావు, గోవర్ధనరెడ్డి, డి.సత్యనారాయణ, జాన్, రామచంద్రయ్య, రమేష్, హరిబాబు, శ్రీనివాసరావు, సరిత, రూప, సునీత, సతీష్, వెంకటరమణ, విజయ్ అమృతకుమార్, రత్నకుమార్, సీతారామయ్య, కుసుమ నాగేశ్వరరావు, కె.రాము, పాటి వెంకటేశ్వర్లు, టి.వెంకన్న, కె.గోపాలరావు, గార్లపాటి రామారావు, కే.వీ.నాయుడు, తాత రాఘవయ్య, పి.వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, అనంతోజు పుల్లయ్యచారి, భిక్షం, రమేష్ పాల్గొనగా.. కాంగ్రెస్ నాయకులు సూరంపల్లి రామారావు, నెల్లూరి రమేష్, చల్లగుండ్ల సురేష్ స్వాగతం పలికారు.


