‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’ | - | Sakshi
Sakshi News home page

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’

Apr 9 2025 1:00 AM | Updated on Apr 9 2025 1:00 AM

‘బీజే

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’

●సన్న బియ్యం.. సకల జనుల ఆసక్తి
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయాం

ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా ఈనెల నుంచి సన్న బియ్యం పంపిణీ ఆరంభించింది. దీంతో కార్డు ఉన్నా ఇన్నాళ్లు రేషన్‌షాపులకే వెళ్లని పలువురు కూడా ఈసారి ఆసక్తి కనబరుస్తున్నారు. బియ్యం తిన్నా, తినకపోయినా సన్నబియ్యం ఎలా ఉంటాయోననే ఆసక్తితో తీసుకునేందుకు వస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని పలు రేషన్‌షాపుల వద్ద మునుపెన్నడూ లేని విధంగా క్యూలైన్లు కనిపిస్తుండడం విశేషం.– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కల్లూరు/పెనుబల్లి: తీవ్రగాయాలతో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందిన ఘటన ఇది. పెనుబల్లి మండలం ముత్తగూడెం – కల్లూరు మండలం ముగ్గువెంకటాపురం గ్రామాల మధ్య రోడ్డు పక్కన మంగళవారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో వ్యక్తి పడి ఉన్నాడు. ఆయన ఒంటిపై చొక్కా లేకపోగా, తీవ్ర గాయాలై ఉండడంతో ఓ లారీ డ్రైవర్‌ పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు 108 సిబ్బందికి తెలపడంతో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సదరు వ్యక్తి పడి ఉన్న ప్రాంతం కల్లూరు మండల పరిధిలోకి రావడంతో ఎస్‌ఐ హరిత విచారణ చేపట్టారు. మృతుడి కుడి భుజంపై సూర్యుడి గుర్తు పచ్చబొట్టు ఉందని, ఆయన ఆచూకీ తెలిసిన వారు 87126 59171, 87126 59172 నంబర్లలో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.

మతిస్థిమితం లేని వ్యక్తి..

ఏన్కూరు: మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(45) మండలంలోని హిమామ్‌నగర్‌ సమీపాన మంగళవారం మృతి చెందాడు. గ్రామ సమీపాన కోళ్లఫారం వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకుని పోలీసులు, గుర్తించారు. ఆయనకు కుడి చేయి లేకపోగా, ఒంటిపై నిక్కర్‌ మాత్రమే ఉండడంతో మృతదేహన్ని అన్నం ఫౌండేషన్‌ బాధ్యుల సహకారంతో మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ రఫీ తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు...

వేంసూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వేంసూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వెంకటాపురంలో బంధువుల ఇంటికి వచ్చిన ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహరావుపురానికి చెందిన నక్క రామస్వామి సోమవారం రాత్రి నడుస్తూ స్వగ్రామానికి వెళ్తున్నాడు.ఈక్రమాన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ వీరప్రసాద్‌ ఆయన మృతదేహాన్ని సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

వడదెబ్బతో వ్యవసాయ కూలీ...

తల్లాడ: మండలంలోని మల్లవరంలో వడదెబ్బకు గురైన వ్యవసాయ కూలీ మంగళవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన గుడిపల్లి వెంకమ్మ(60) ఈనెల 4న గ్రామంలో పొలం పనులకు వెళ్లి వచ్చింది. ఆరోజు నుంచి నీరసమై వాంతులు, విరోచనాలు అవుతుండడంతో నారాయణపురంలో చికిత్స చేయించి, మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స మొదలైన గంటలోనే వెంకమ్మ మృతి చెందింది. ఆమె భర్త భాస్కర్‌రావు ఆరు నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందగా, వారికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

ఇంటి ఎదుట నిలిపిన బైక్‌ చోరీ

నేలకొండపల్లి: మండల కేంద్రానికి పిట్టల వినయ్‌ ఇంటి ఎదుట పార్క్‌ చేసిన బైక్‌ను మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. అందులో ఒకరు హెల్మెట్‌ ధరించగా, మరొకరు రుమాలు, టోపీతో ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఘటనపై సీసీ పుటేజీలో నమోదైన చిత్రాల ఆధారంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మధిర/ఎర్రుపాలెం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున, ప్రతిఒక్కరు ఆ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శ్రావణ్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మధిర, ఎర్రుపాలెంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్‌ శ్రేణుల సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని నిర్వీర్యం బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు నిలుస్తాయని పేర్కొన్నారు. ఈనేపథ్యాన ప్రజలంతా ఏకమై మోదీ ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. ఈ విషయంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఇంటింటా వివరించాలని సూచించారు. ఈసమావేశాల్లో మధిర మార్కెట్‌ చైర్మన్‌ బండారు నరసింహారావు, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఓబీసీ సెల్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, మధిర బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చావా వేణుతో పాటు మండలాల అధ్యక్షులు, నాయకులు సూరంశెట్టి కిషోర్‌, మిరియాల వెంకటరమణ గుప్తా, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, తూమాటి నవీన్‌రెడ్డి, చావా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం మామిళ్లగూడెం/ఖమ్మం వన్‌టౌన్‌: సీపీఎం నాయకుడు యర్రా శ్రీకాంత్‌ మృతితో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గుండెపోటుతో ఆదివారం మృతి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్‌ మృతదేహం వద్ద ఆయన మంగళవారం నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ శ్రీకాంత్‌ కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమై పనిచేసిందని, దశాబ్దాలుగా కార్మికులు, పేదల సంక్షేమం, హక్కుల సాధనకు పోరాడారని తెలిపారు. వివిధ పార్టీలు, యూనియన్ల నాయకులు బాగం హేమంతరావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, తాటి నిర్మల, ఏనుగు వెంకటేశ్వరరావు, నూనె శశిధర్‌, జ్వాలా నర్సింహారావు, ఎన్‌.శంకరరావు, రవీందర్‌, విజయ్‌ తదితరులు ఉన్నారు. అలాగే, యర్రా శ్రీకాంత్‌ మృతదేహం వద్ద ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా నివాళులర్పించారు. వివిధ పార్టీల నాయకులు వై.లెనిన్‌, నవీన్‌రెడ్డి, జబ్బార్‌, మిక్కిలినేని నరేందర్‌, కొప్పుల చంద్రశేఖర్‌, కానుగల రాధాకృష్ణ, ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్‌ పాల్గొన్నారు.

ఖమ్మం మయూరిసెంటర్‌: సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మంగళవారం ఖమ్మంలో కలిసి యోగక్షేమాలు ఆరా తీశారు.

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

ఖమ్మంక్రైం: ఖమ్మం శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను ఎకై ్సజ్‌ స్టేషన్‌–1 పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. చింతకాని మండలం బొప్పారానికి చెందిన ఖలీల్‌ పాషా, ఖమ్మంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పశువుల ఉదయ్‌కుమార్‌, బత్తుల వెంకటేష్‌, కొమ్మరబోయిన నవీన్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో గంజాయి విక్రయిస్తుండగా మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 670 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సీఐ కృష్ణతో పాటు ఉద్యోగులు సాయిబాబా, రేష్మసుల్తానా తదితరులు పాల్గొన్నారు.

‘సంవిధాన్‌’ సమావేశాల్లో కాంగ్రెస్‌ నేతలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’1
1/4

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’2
2/4

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’3
3/4

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’4
4/4

‘బీజేపీ తీరుతో రాజ్యాంగానికి ముప్పు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement