
ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు
● మధురై నుంచి ఖమ్మం చేరిన సీపీఎం నేత శ్రీకాంత్ మృతదేహం ● నివాళులర్పించిన వివిధ పార్టీలు, సంఘాల నాయకులు
ఖమ్మంమయూరిసెంటర్: మధురైలో జరిగిన సీపీఎం అఖిలభారత 24వ మహాసభలకు ప్రతినిధిగా వెళ్లి ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు మృతదేహం ఇక్కడకు చేరుకోగా, పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా మమత ఆస్పత్రికి, అక్కడి నుంచి సీపీఎం జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈక్రమంలో వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. కాగా, సంతాప సభ అనంతరం శ్రీకాంత్ మృతదేహాన్ని శ్రీనివాస్‌నగర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. శ్రీకాంత్ ముగ్గురు కుమారుల్లో ఒకరు అమెరికాలో ఉన్నందున ఆయన వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
శ్రీకాంత్ మరణం తీరనిలోటు..
సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సంతాప సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ శ్రీకాంత్ మరణం ప్రజా ఉద్యమాలకే కాక పార్టీకి తీరని లోటన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ మధురైలో శ్రీకాంత్ అస్వస్తతకు గురైనట్లు తెలియగానే అక్కడి అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. కానీ రెండో సారి స్ట్రోక్ రావడంతో మృతి చెందాడని ర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ అఖిలభారత మహాసభలకు మొదటిసారి ప్రతినిధిగా ఎంపిక కావడంపై శ్రీకాంత్ సంతోషపడ్డాడని, అందరం రైలులో వెళ్లి వచ్చేటప్పుడు ఆయన తమతో లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాస్‌లైన్ నాయకుడు గుర్రం అచ్చయ్య తదితరులు మాట్లాడారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కొండబాల కరుణాకర్, దేవరెడ్డి విజయ్, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, మధు, వంగూరి రాములు, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై.విక్రమ్, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, డాక్టర్ సి.భారవి, అఫ్రోజ్ సమీనా, ఆవునూరి మధు, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, అన్నం శ్రీనివాసరావు, లింగాల రవికుమార్, దాసరి పూర్ణచందర్. నాగిశెట్టి రాధాకృష్ణ, ఆకుల గాంధీ, పార నాగేశ్వరరావు, కే.వీ.కృష్ణారావు, పసుపులేటి నాసరయ్య, గులాం జాఫర్ తదితరులు నివాళులర్పించారు.
రేపు ఖమ్మం మార్కెట్‌కు సెలవు
ఖమ్మంవ్యవసాయం: ీసపీఎం నాయకుడు యర్రా శ్రీకాంత్ అకాల మృతికి సంతాప సూచకంగా.. కార్మిక సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యర్ధనతో బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించాలని సూచించారు.

ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు