
అభివృద్ధిలో జిల్లాకు తిరుగులేదు..
ఖమ్మంగాంధీచౌక్: విశ్వవసు నామ సంవత్సరంలో రాష్ట్రంలోనే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పంచాంగకర్త ఇంగువ రాజేశ్వరశర్మ స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా పంచాగం రాయడంతో పాటు ఉగాది రోజున పంచాంగ పఠనం చేసే ఆయన బోనకల్ మండలం రావినూతల వాసి. అంతేకాక పంచామృత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులుగా కొనసాగుతున్న ఆయన వద్ద పలువురు పలువురు ప్రముఖులు తమ రాశి ఆధారంగా మంచీచెడు చెప్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ఫలితాలను వివరించారు. ‘జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సరిపడా వర్షాలు కురుస్తాయి. జిల్లాలో నదీ జలాలు సమృద్ధిగా ఉండి పంటలు ఆశించిన స్థాయిలో పండుతాయి. మిర్చి ధర క్రమంగా పెరిగే అవకాశముంది. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు కలిసొస్తుంది. జిల్లాలో రాజకీయ నాయకుల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం గోచరిస్తోంది. 3, 4వ తరగతుల ఉద్యోగులకు బాగుంటుంది. అయితే, వ్యాపార రంగం కొంత మేర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు బాగుంటాయి. ఇంజనీరింగ్, సైన్స్ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి’ అని ఆయన వెల్లడించారు.
15 ఏళ్లుగా ఉగాది పచ్చడి పంపిణీ
సత్తుపల్లిటౌన్: తెలుగు వారి లోగిళ్లలో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ సందర్భంగా అందరి ఇళ్లలో పచ్చడి చేసుకుని స్వీకరిస్తారు. అయితే, ఇళ్లలో చేసుకోలేని వారు, ప్రయాణంలో ఉన్న వారి కోసం సత్తుపల్లికి చెందిన మానుకోట (మాధురి) మధు పదిహేనేళ్లుగా పచ్చడి పంపిణీ చేస్తున్నారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి పంపిణీ చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పంచాంగ కర్త ఇంగువ రాజేశ్వరశర్మ
25 ఏళ్లుగా పంచాంగం రాయడమే
కాక పఠనం

అభివృద్ధిలో జిల్లాకు తిరుగులేదు..