
దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వండి..
ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి రశీదు ఇవ్వాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణను మంగళవారం ఆయన పరిశీలించారు. పలువురు దరఖాస్తుదారులతో మాట్లాడి ఏ యూనిట్‌ను ఎంచుకున్నారు, అందులో ఎంత మేర అనుభవం ఉందని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ వరకు గడువు ఉందని, ఆన్‌లైన్‌లో సమస్య ఎదురైతే మున్సిపాలిటీ లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు ఇవ్వొచ్చని తెలిపారు. కేఎంసీలో ఐదు కౌంటర్ల ద్వారా దరఖాస్తు తీసుకుంటున్నందున సామాజికవర్గాల వారీగా రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని ఉద్యోగులకు కలెక్టర్ సూచించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా, సుజాత పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్