
రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత బీజేపీదే..
ఖమ్మంమామిళ్లగూడెం: కరోనా కాలం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందిస్తున్న ఘనత బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికే దక్కుతుందని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం నిధులతో సరఫరా చేసే రేషన్ బియ్యానికి కిలో కలిపి రాష్ట్రప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని ఎద్దేవాచేశారు. కాగా, కాంగ్రెస్ నియంతృత్వ పాలనను చూస్తున్న ప్రజలు పొరపాటున పట్టం కట్టామని ఆందోళన చెందుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్, గెంటేల విద్యాసాగర్, నున్నా రవి, కూసంపూడి రవీందర్, ఈ.వీ.రమేష్, వేల్పల సుధాకర్, విజయ్‌రాజ్, చింతమళ్ల వీరస్వామి, తాటికొండ రవి, కొదుమూరి రాజయ్య, తక్కెళపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు