
క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన యువకుడు హఠాన్మరణం
రఘునాథపాలెం: క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని కోటపాడుకు చెందిన కాముని సామేలు, విజయలక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు వినయ్ (22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీలోనే మిత్రులతో కలిసి మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి మిత్రులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. గుండెపోటుతో యువకుడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. కాగా, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదివేందుకు అసరమైన పరీక్షలు రాసి, సిద్ధమవుతున్న తరుణంలో వినయ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏకై క సంతానం మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.