
ప్రజల్లోకి ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’
ఖమ్మంవన్‌టౌన్/నేలకొండపల్లి: దేశ ఉజ్వల భవిష్యత్ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సంవిధాన్ కోఆర్డినేటర్ మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఖమ్మం 18వ డివిజన్‌తో పాటు నేలకొండపల్లిలో నిర్వహించిన సంవిధాన్ యాత్రలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి ఆమిత్‌షా వ్యాఖ్యలు అహంకారపూరితమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి తీరుతో పాటు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న కుట్రలను ప్రజలకు ఈ యాత్ర తెలియజేయాలని సూచించారు. అంతేకాక రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు లక్ష్మీమనోహర్, చామకూరి వెంకటనారాయణ, పాకాలపాటి విజయనిర్మల, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, మహ్మద్ ఖాదర్, శేషగిరి, గజ్జెల్లి వెంకన్న, పాలకుర్తి నాగేశ్వరరావు, బాణాల లక్ష్మణ్, ప్రతిభారెడ్డి, మడూరి సైదారావు, భద్రయ్య, కొడాలి గోవిందరావు, బొందయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, వెంకన్న, కడియాల నరేష్, గుండా బ్రహ్మం, లక్కం ఏడుకొండలు, మైశా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
రంగారెడ్డి