
శ్రీవారి పాదాలకు అష్టోత్తర కలశాభిషేకం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాలుగో రోజైన బుధవారం శ్రీవారి పాదాలకు అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించిన అర్చకులు, ఆతర్వాత స్వామి, అమ్మవార్లను అలంకరించి పల్లకీ సేవ చేశారు. అనంతరం స్వామిని గజ వాహనంపై గిరిప్రదక్షిణ చేయించగా పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4న జరిగే కల్యాణానికి హాజరుకావాలని ఖమ్మంలో కలెక్టర్ ముజ్మిమిల్‌ఖాన్‌కు ఈఓ కె.జగన్మోహన్‌రావు ఆహ్వాన పత్రిక అందజేశారు.