
పది.. పరీక్షలు ముగిసాయోచ్!
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించగా, 16,417 మంది విద్యార్థుల్లో 16,383 మంది హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. జిల్లా స్థాయి పరిశీలకులు నాలుగు సెంటర్లు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఒక సెంటర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో 39 సెంటర్లతో పాటుతాను ఏడు సెంటర్లలో తనిఖీ చేశామని డీఈఓ వెల్లడించారు. కాగా, చివరి పరీక్ష రాసి సెంటర్ల నుంచి బయటకు రాగానే విద్యార్థులు స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారిని తల్లిదండ్రులు, బంధువులు లగేజీతో సహా స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మిత్రులకు భారంగా వీడ్కోలు పలుకుతూ సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది.
– ఫొటోలు : స్టాఫ్ ఫొటోగ్రాఫర్