కల్లూరురూరల్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 ఫలితాల్లో కల్లూరు మండలంలోని పేరువంచ గ్రామానికి చెందిన మందాల సుజాత రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంక్, ఎస్సీ రిజర్వేషన్ కేటగిరిలో 11వ ర్యాంక్ సాధించింది. సుజాత ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. గ్రూప్–1 కోసం కొంతకాలంగా సెలవుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకొని పరీక్ష రాసింది. రాష్ట్రస్థాయిలో గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించినందుకు గాను సుజాతను పలువురు అభినందించారు.