
అన్నంలో బొద్దింక.. ఇడ్లీలో ఇసుక
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని సింగరేణి జేవీఆర్ ఓసీ క్యాంటీన్‌లో సరఫరా చేసే భోజన పదార్థాలు నాసిరకంగా ఉండడమే కాకా పురుగులు వస్తున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు సోమవారం అన్నంలో బొద్దింక రాగా, మంగళవారం ఇడ్లీలో ఇసుక తగిలిందని తెలిపారు. సింగరేణి కార్మికులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో సింగరేణి ఆధ్వర్యాన నడిచిన క్యాంటీన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో ఈ పరిస్థితి నెలకొందని హెచ్‌ఎంఎస్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, తదితరులు ఆరోపించారు. ఈమేరకు అధికారులతో పాటు గుర్తింపు సంఘాల నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ సింగరేణి క్యాంటీన్ దుస్థితి