
ఖమ్మం–కోదాడ పాత రోడ్డుకు మహర్దశ
● జాతీయ రహదారుల అథారిటీ నుంచి నిధులు ● 18 కి.మీ. మేర రహదారికి రూ.20 కోట్లు
వేసవిభత్యానికి రాంరాం..
వేసవిలో ఎండల తీవ్రత ఉన్నా పనులకు వచ్చే వారిని ప్రోత్సహించేలా కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిభత్యం చెల్లించడం ఆనవాయితీ. కానీ గత ఏడాది వేసవిభత్యం ప్రకటించకపోగా, ఈసారి కూడా అలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు వేసవిభత్యం ఉంటుందా, తొలగించారా అన్న మీమాంస నెలకొంది. కాగా, కూలీలకు తాగునీరు సమకూర్చేందుకు మాత్రం గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయనుంది. ఒక్కో కూలీకి రూ.2.50 చొప్పున జీపీలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుండగా, ఆ నిధులతో పని ప్రదేశాల్లో నీటి వసతి కల్పించాల్సి ఉంటుంది.
నేలకొండపల్లి: జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చాక పట్టించుకునే వారెవరూ లేక పాత రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. గుంతలు తేలిన ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిన నేపథ్యాన ఎట్టకేలకు జాతీయ రహదారుల అథారిటీ నుంచి ఖమ్మం–కోదాడ రహదారి అభివృద్ధికి రూ.20కోట్ల నిధులు మంజూరవడంతో త్వరలోనే కొత్తరూపు సంతరించుకోనుంది. 365(ఏ) నంబర్‌తో ఖమ్మం–కోదాడ మధ్య జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. అంతకుముందు ఖమ్మం నుంచి ముదిగొండ – నేలకొండపల్లి – పైనంపల్లి మీదుగా రాకపోకలు సాగేవి. హైవే నిర్మాణం జరిగిన నాలుగేళ్ల పాటు అంతకుముందు వేలాదిగా వాహనాలు ఇదే రోడ్డుపై వచ్చివెళ్లడంతో గుంతలమయమై అధ్వానంగా మారింది. ప్రస్తుతం కొత్త హైవేపై భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నా, పలు గ్రామాల ప్రజలకు పాత రహదారే ప్రత్యామ్నాయంగా ఉంది. కానీ తారు లేచిపోయి గుంతలు తేలడంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి వాహనాలు దెబ్బతినడమే కాక ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తున్నా శాశ్వత పనులు చేపట్టకపోగా.. చివరకు జాతీయ రహదారుల అథారిటీ నిధులు మంజూరు చేశారు.
ఆర్‌అండ్‌బీ ద్వారా పనులు
ఖమ్మం – కోదాడ మార్గంలోని పాత రహదారిపై కొత్తగా బీటీ వేసేందుకు రూ.20కోట్లు మంజూరు చేశారు. ఖమ్మం నుంచి కోదాడ వరకు 18 కి.మీ. మేర ఈ రోడ్డును అభివృద్ధి చేస్తారు. ఖమ్మం, ముదిగొండ బైపాస్, నేలకొండపల్లి, పైనంపల్లి మీదుగా కోదాడ వరకు చేపట్టే పనులకు గాను జాతీయ రహదారుల అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో నిధులు జమ చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా చేపట్టే పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.
నిధులు విడుదల అయ్యాయి..
జాతీయ రహదారి అథారిటీ నుంచి పాత రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. బైపాస్‌లు కలుపుతూ 18 కి.మీ. మేర రహదారి అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించారు. ఈ పనులను త్వరలోనే ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యాన చేపడతారు.
– దివ్య, పీడీ, నేషనల్ హైవేస్

ఖమ్మం–కోదాడ పాత రోడ్డుకు మహర్దశ