
ఉగాది ప్రేమికుడు.. దినేశ్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంరూరల్ మండలం పెదతండాకు చెందిన చింతల దినేశ్‌కు మొక్కలు పెంపకం ఇష్టం. ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు, పూలు, పండ్ల మొక్కల చెట్లు పెంచుతుంటారు. మామిడి చెట్టు, వేప చెట్టు నాటగా.. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో ఉన్న చింత చెట్టును సైతం సంరక్షిస్తున్నారు. దీంతో ఏటా ఉగాది పండుగ సందర్భంగా కాలనీవాసులు, స్నేహితులు దినేశ్ ఇంటికి క్యూ కడతారు. మామిడి కాయలు, వేప పూతతో పాటు చింత పండును కవర్లలో పెట్టి ఇంటికి వచ్చిన వారందరికీ ఇవ్వడాన్ని దినేశ్ ఆనవాయితీగా మార్చుకున్నాడు.