
చిన్నారుల పోషణపై ప్రత్యేక దృష్టి
కొణిజర్ల: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పోషకాహార లోపం ఎదురుకాకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూనే కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సూచించారు. కొణిజర్ల – 2, 4 అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం తనిఖీ చేసిన ఆమె పిల్లల బరువు, ఎత్తు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాలకు చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా చూడాలని తెలిపారు. సీడీపీఓ కమలప్రియ, ఉద్యోగులు కొమ్మినేని బాబు, కె.జ్యోతి, షాలిని తదితరులు పాల్గొన్నారు.