
సన్నబియ్యం.. సిద్ధం
ఓ రేషన్ షాప్ వద్ద ఏర్పాటుచేసిన బోర్డు
చింతకాని మండలం నామవరంలోని రేషన్‌షాప్‌లో స్టాక్‌ను పరిశీలిస్తున్న డీసీఎస్‌ఓ చందన్‌కుమార్, ఉద్యోగులు
ఖమ్మంసహకారనగర్: రేషన్‌షాప్‌ల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉగాది నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బియ్యం పంపిణీని ఇటీవల సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇక జిల్లాలోని షాపుల్లో మంగళవారం నుంచి బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితంగా దొడ్డుబియ్యం తినలేక రేషన్‌కార్డులు ఉన్నా షాపులకు వెళ్లని పలువురు ఇకపై ముందుకొచ్చే అవకాశముందని భావిస్తు న్నారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించే అవకాశముంది.
షాపులకు స్టాక్
జిల్లాలోని అన్ని రేషన్ షాప్‌ల ద్వారా నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి దుకాణాల కు బియ్యం సరఫరా చేశారు. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం ఇస్తుండడం, గత రెండు, మూడు నెలలు గా సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి. ప్రస్తుతం సన్నబియ్యం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా లబ్ధిదారులకు అందనున్నాయి.
ఈ బియ్యం ఎలా?
జిల్లాలోని అన్ని షాప్‌ల లబ్ధిదారులకు నెలనెలా 7,375.868 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే, గత నెల షాప్‌లకు చేరవేసిన దొడ్డు బియ్యం నిల్వలు కొన్ని చోట్ల స్టాక్ ఉన్నాయి. సన్నబియ్యం పంపిణీ చేసే క్రమాన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, ఉద్యోగులు షాపుల్లోని నిల్వ లను పరిశీలించి రిజిస్టర్లలో నమోదు చేశాక పక్కన పెట్టించారు. ఈమేరకు దాదాపు 10వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బియ్యం ఏం చేయాలనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు.
అన్ని షాపుల ద్వారా పంపిణీ
జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ
చేయనున్నాం. ఇప్పటికే షాప్‌లకు స్టాక్ చేరవేశాం. ఎక్కడా ఇబ్బంది
ఎదురుకాకుండా పంపిణీ చేయాలని సూచించాం. దొడ్డుబియ్యం నిల్వలపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది.
– కె.చందన్‌కుమార్, డీసీఎస్‌ఓ
ఆహారభద్రత కార్డులు
3,83,717
మొత్తం రేషన్‌కార్డులు
4,10,988
రేషన్ దుకాణాలు
748
లబ్ధిదారులు
11,48,031
బియ్యం కేటాయింపు
7,375.868 మెట్రిక్ టన్నులు
జిల్లాలో
రేషన్ వ్యవస్థ
వివరాలు
అంత్యోదయ
27,268
అన్నపూర్ణ
03
నేటి నుంచి రేషన్‌షాపుల్లో పంపిణీ
జిల్లాలో 11.48లక్షల మంది లబ్ధిదారులు
షాపుల్లో స్టాక్ ఉన్న దొడ్డుబియ్యంపై సందిగ్ధత

సన్నబియ్యం.. సిద్ధం

సన్నబియ్యం.. సిద్ధం

సన్నబియ్యం.. సిద్ధం