గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు

Apr 1 2025 12:27 PM | Updated on Apr 1 2025 3:24 PM

గ్రూప

గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు

కాకరవాయి వాసి వంశీ ప్రతిభ

తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవా యికి చెందిన కొత్తపల్లి ఖుషిల్‌వంశీ గ్రూప్‌–1 ఫలితాల్లో సత్తా చాటా డు. గ్రామంలోని కొత్తపల్లి శివకుమార్‌ – రేణుక కుమారుడైన వంశీ 496 మార్కులతో జనరల్‌ కేటగిరీలో 63, రిజర్వేషన్‌ కేటగిరీలో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించాడు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌ లేదా డీఎస్పీ ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాడు. గతంలో ఆయన ఎస్సై ఉద్యోగానికి ఎంపికవడమే కాక ఇన్‌కం టాక్స్‌ అసిస్టెంట్‌, సెంట్రల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమాండో(డీఎస్పీ), మిలిటరీ ఆఫీసర్‌గానూ ఉద్యోగాలు సాధించాడు. కాగా, వంశీ 6నుంచి 10వ తరగతి వరకు ఖమ్మం శ్రీచైతన్య పాఠశాలలో, ఇంటర్‌ హైదరాబాద్‌ శ్రీ గాయత్రి కళాశాలలో పూర్తిచేశాక సివిల్స్‌ సాధనే లక్ష్యంగా డిగ్రీ హైదరాబాద్‌ శ్రీ చైతన్య ఐఏఎస్‌ అకాడమీలో, పీజీ ఢిల్లీ జేఎన్‌యూలో పూర్తిచేశాడు. కాగా, వంశీ తండ్రి శివకుమార్‌ సూర్యాపేట జిల్లా మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శిగా, తల్లి రేణుక పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొనసాగుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న తల్లిదండ్రుల మాదిరే ప్రజలకు సేవ చేయడం తన లక్ష్యమని ఖుషీల్‌ వంశీ వెల్లడించాడు.

సింధు..

176వ ర్యాంకు

నేలకొండపల్లి: మండలంలోని మండ్రాజుపల్లికి చెందిన నెల్లూరి సింధు గ్రూప్‌–1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. ఆమె మల్టీజోన్‌ మహిళా కోటాలో 64వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 176వ ర్యాంకు సాధించింది. అయితే, 2016లోనే గ్రూప్‌–2లో ప్రతిభ కనబరిచి ఎంపీఓగా, గ్రూప్‌–3 ద్వారా సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగాలు సాధించిన సింధు ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి గ్రూప్స్‌ సిద్ధమయ్యాయని, రోజుకు 15గంటల పాటు చదవడంతో మంచి ఫలితం వచ్చిందని.. ఇందులో భర్త, కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని వెల్లడించింది.

వ్యవసాయ కుటుంబం..

48వ ర్యాంక్‌

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం రాపర్తినగర్‌లో నివాసముంటున్న గండ్ర నవీన్‌రెడ్డి గ్రూప్‌–1 ఫలితాల్లో 502మార్కులతో రాష్ట్రస్థాయి 42వ ర్యాంక్‌ సాధించాడు. ముదిగొండ మండలం మాధాపురానికి చెందిన గండ్ర మల్లికార్జున్‌రెడ్డి – లక్ష్మి వ్యవసాయ కుటుంబం కాగా కొన్నాళ్ల నుంచి ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు నవీన్‌ సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఓసారి ఇంటర్వ్యూకు సైతం హాజరయ్యాడు. ఇంతలోనే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో పరీక్ష రాయగా 48వ ర్యాంక్‌ వచ్చింది. ఎప్పటికై నా సివిల్స్‌ సాధించి పేదవర్గాలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని నవీన్‌ వెల్లడించాడు. కాగా, ప్రస్తుతం వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా డీఎస్పీ లేదా ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశముందని తెలిపాడు.

అర్చక, ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ

ఖమ్మంగాంధీచౌక్‌: దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకుల, ఉద్యోగ డైరీని సోమవారం ఖమ్మం కమాన్‌బజార్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేందరశర్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16,062 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నివేదిక అందించామని తెలిపారు. దీంతో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాగా, అర్చక, ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉంటూ ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీఎస్‌.శ్రీనివాసాచారి, అర్చకులు శేషభట్టర్‌ రఘునాథాచార్యులు, కాండూరి మధుసూదనాచార్యులు, వేణుగోపాలాచార్యులు, శేషభట్టార్‌ వెంకటాచార్యులు, ఉద్యోగులు కొండకింది వేణుగోపాలాచార్యులు, దయాకర్‌, బురాన్‌ తదితరులు పాల్గొన్నారు.

జమిలి ఎన్నికలతో మేలు

ఏన్కూరు: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా పాలన కుంటుపడకపోగా నిధులు ఆదా అవుతాయని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు రమేష్‌ అన్నారు. ఏన్కూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ విధానాన్ని 32పార్టీలు సమర్థిస్తే కాంగ్రెస్‌ సహా ఇంకొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ విధానం వల్ల జరిగే మేలును ప్రజలకు వివరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసమావేశంలో నాయకులు నల్లమోతు రమేష్‌, నరుకుళ్ల వెంకటేశ్వర్లు, మాళ్ల అంజి, చింతలబోయిన వెంకటేశ్వర్లు, మల్లెం రవి పాల్గొన్నారు.

గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు
1
1/2

గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు

గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు
2
2/2

గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement