
సబ్‌స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంక్‌లు
● తద్వారా ఓల్టేజీ హెచ్చుతగ్గులకు బ్రేక్ ● విద్యుత్ పరికరాల మన్నికకు దోహదం
ఖమ్మంవ్యవసాయం: ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈనేపథ్యాన నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లు, ఫీడర్లలో కెపాసిటర్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఓల్టేజీ హెచ్చతగ్గులను నియంత్రించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఈ కెపాసిటర్ బ్యాంకులు దోహదపడతాయని చెబుతున్నారు. ఈమేరకు అవసరమైన ప్రాంతాల్లో వీటిని అమర్చడంపై ఎన్పీడీసీఎల్ అధికారులు దృష్టి సారించారు.
కెపాసిటర్ బ్యాంక్‌లు, కెపాసిటర్లు
ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ పరిధిలో విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల సామర్ధ్యం ఆధారంగా కెపాసిటర్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద 124 కెపాసిటర్ బ్యాంక్‌లు, విద్యుత్ లైన్లలో 60 కెపాసిటర్లను అమర్చారు. ఇవేకాక 11 కేవీ లైన్లలోనూ కెపాసిటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. కాగా, కెపాసిటర్ బ్యాంక్‌ల ఏర్పాటుతో సబ్ స్టేషన్లు, లైన్ల నుంచి సరఫరాలో ఓవర్ లోడ్ సమస్య ఎదురుకాదని ఎదురుచెబుతున్నారు.
పరికరాలకు నష్టం ఉండదు...
కెపాసిటర్ బ్యాంక్‌ల ఏర్పాటు ద్వారా విద్యుత్ పరికరాల మన్నికకు దోహదపడుతుంది. వీటి ద్వారా సరఫరాలో లోపాలు, ఓల్టేజీ హెచ్చుతగ్గులను నియంత్రించే వీలు ఉండడంతో వ్యవసాయ పంపుసెట్లు, పారిశ్రామిక ఫీడర్లలో మోటార్లు కాలిపోయే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. అలాగే, సాంకేతిక నష్టాలు సైతం తగ్గుతాయని చెబుతున్నారు. ఈనేపథ్యాన పరిశ్రమల్లోనూ కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ ప్రోత్సహిస్తోంది.
కెపాసిటర్ బ్యాంక్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత
నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. జిల్లాలో ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు వినియోగదారులకు ప్రయోజనమే కాక కెపాసిటర్ల ద్వారా విద్యుత్ ఓల్టోజీ హెచ్చతగ్గులను నియంత్రించవచ్చు.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ

సబ్‌స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంక్‌లు

సబ్‌స్టేషన్లలో కెపాసిటర్ బ్యాంక్‌లు