
మోడల్ కెరీర్ సెంటర్‌లో రేపు జాబ్‌మేళా
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో ఈనెల 9వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప న శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. అపోలో ఫార్మా కంపెనీ బాధ్యులు పాల్గొని ఫార్మసిస్ట్, ట్రెనింగ్ ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో బుధవారం ఉదయం 10గంటలకల్లా హాజరుకావాలని సూచించారు.
నేడు యూడీఐడీ శిబిరం
ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్ల స్థానంలో యూనిక్ డిసేబులిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ)లు జారీ చేయనుండగా, మంగళవారం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటుచేశారు. ఈ కార్డులు జారీ చేయాలన్న ఆదేశాలతో కొంతకాలంగా సదరమ్ క్యాంపులు నిలిపివేశారు. ఈమేరకు తొలిసారి మంగళవారం ఏర్పాటుచేస్తున్న క్యాంప్‌లో 80 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహిస్తామని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ తెలి పారు. ఇందులో అర్హత సాధించిన వారికి కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన
జీవనశైలి తప్పనిసరి
ఖమ్మంవైద్యవిభాగం: అనారోగ్యం దరిచేరవద్దంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, నిత్యం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవా లని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతా, శిశు సంరక్షణ కోసం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తూ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రమాదాల నుంచి తప్పించడం, నాణ్యమైన సేవలందించేందుకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ప్రతిన బూనాలని చెప్పారు. ఈసమావేశంలో వివిధ విభాగాల అధికారులు సైదులు, చందునాయక్, వి.సుబ్రహ్మణ్యం, దుర్గ తదితరులు పాల్గొన్నారు.