
బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే
ఖమ్మంఅర్బన్: వరద ముంపు ఎదురుకాకుండా మురుగునీరు సాఫీగా సాగేలా ఖమ్మంలోని ఖానాపురం అలుగు వాగు సమీపాన రూ.290 కోట్ల అంచనా వ్యయంతో పైపులైన్ పనులు చేపడుతున్నారు. వాగుకు ఇరువైపుల కాలనీల నుంచి మురుగు నీటిని ఈ పైపులైన్ ద్వారా తరలించడంతో పాటు శుద్ధిచేసేలా ప్లాంట్లు సైతం నిర్మించనున్నారు. ఈక్రమంలోనే వాగు రికార్డుల ప్రకారం ఎంత మేర విస్తీర్ణంలో ఉండాలనే అంశాన్ని తేల్చేందుకు సర్వే చేపట్టారు. సుమారు 9కి.మీ. మేర ప్రవహించే వాగు సమగ్ర రూపాన్ని సర్వే చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. రెండు రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ ఉద్యోగులతో కూడిన ఈ బృందాలు సర్వే చేస్తున్నారు. వాగుకు ఇరువైపులా బఫర్‌జోన్‌లో ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, అందులో పేదల ఇళ్లు ఎన్ని, ఎన్ని ఇళ్లలో నివాసం ఉంటున్నారనే వివరాలు ఆరా తీస్తుండగా, పది రోజుల్లో నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.
అలుగువాగు పరీవాహకంలో
ఆక్రమణల గుర్తింపుపై దృష్టి