
జమలాపురంలో ఎదుర్కోలు ఉత్సవం
ఎర్రుపాలెం: శ్రీ వేంంకటేశ్వర స్వామి కొలువైన జమలాపురం ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు ఉత్సవం జరిపించారు. స్వామి తరఫున ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్‌శర్మ, వేద పండితులు సాయి అభిలాష్, అమ్మవార్ల తరఫున వేద పండితులు విజయకృష్ణ, అర్చకులు కాసులనాటి రామకృష్ణశాస్త్రి, మారుతీ రఘురామకృష్ణ, మారుతి వెంకటరమణ చేరి వారి గోత్రప్రవరలు, గుణగణాలను ఆసక్తిగా వివరించారు. ఇరువర్గాల నడుమ సంవాదం ఉత్సాహంగా కొనసాగింది. క్రతువు బ్రహ్మగా శ్రీపురాణం రవికుమార్‌శర్మ వ్యవహరించగా ఈఓ కె.జగన్‌మోహన్‌రావు, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.