వేమన శతకంపై విద్యార్థుల అవధానం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు అవుల పోతురాజు, కడమంచి వంశీ వేమన శతకంపై అష్టావధానం చేసి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక శ్రీజ్ఞానసరస్వతీదేవి ఆలయంలో ఈ అవధానం నిర్వహించగా.. ఎనిమిది అంశాల్లో పృచ్ఛకులు అడిగిన సమస్యలకు శతక పద్యాల ఆధారంగా సమాధానాలు చెప్పి మెప్పించారు. ఉపాధ్యాయులు రజినీదేవి, రమాదేవి ఆధ్వర్యాన ఈ అవధాన ప్రదర్శన ఏర్పాటుచేశారు. అనంతరం విద్యార్థులతో పాటు పలువురు కవులను ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొడిమెల అప్పారావు, ఎస్.ఎల్.నర్సింహారావు, మాదిరాజు పుల్లారావు, శర్మ, మల్లికార్జున్‌రావు, రమణమూర్తి, సాయిరాం, శేషాచార్యులు, రామప్ప, మాదిరాజు మాలతి, శేషగిరిరావు, గీతాకుమారి, బి.మధుసూదన్‌రాజు, రమణారావు పాల్గొన్నారు.


