
బీజేపీ బలోపేతానికి కృషి
ఖమ్మం మామిళ్లగూడెం/ఖమ్మం అర్బన్: జిల్లాలో బీజేపీ బలోపేతానికి విస్తృత కృషి జరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని కార్యాలయంతో పాటు 9వ డివిజన్ రోటరీనగర్‌లో ఆదివారం ఆయన పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఈనేపథ్యాన ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, అల్లిక అంజయ్య, శ్యాంరాథోడ్, రవీందర్‌రావు, సుధాకర్, కుమిలి శ్రీనివాసరావు, నీలిమ, సీతారాములు, నరేందర్, హుస్సేన్, రాము తదితరులు పాల్గొన్నారు.
పాలేరు నియోజకవర్గంలో...
ఖమ్మంరూరల్/నేలకొండపల్లి: పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ పతాకాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు జాతీయ వాదం, దేశ సమగ్రత, అట్టడుగు వర్గాలకు న్యాయమే లక్ష్యంగా కృషి జరుగుతోందని తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన వక్ఫ బోర్డు సవరణ బిల్లుతో పేద ముస్లింలకు లబ్ధి జరుగుతుందనే విషయమై పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని సూచించారు. బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు పాగర్తి సుధాకర్, చావా కిరణ్, బానియా నాయక్, రామయ్య, వెంకట్, వెంకన్న, అనంతు ఉపేందర్ గౌడ్, సంతోష్‌రెడ్డి, షేక్ షర్పొద్దీన్, గెల్లా చక్రపాణి, సయ్యద్ మోహినుద్దీన్, మూడ్ రమేష్, ఎలిగేటి గిరి, కందరబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ బలోపేతానికి కృషి