
జమలాపురంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈసందర్భంగా యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, పలువురు అర్చకులు మహా పూర్ణాహుతి నిర్వహించి ధ్వజపతాకాన్ని అవతనం చేశారు. ఆతర్వాత ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం జరిపించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత గుదే వెంకటేశ్వరరావు దంపతులు, సూపరింటెండెంట్ విజయకుమారి, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారంలో పట్టాభిషేకం
ముదిగొండ: ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీ సీతారామంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం 7గంటలకే ప్రత్యేక పూజలు మొదలుపెట్టగా, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు ఆధ్వర్యాన పట్టాభిషేకం ముగిశాక తిరువీధి సేవ నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకటనాగేశ్వరరావు, స్థలదాత కంకిపాటి హన్మంతరావు, ఆలయ చైర్మన్ తుళ్లూరి జీవన్, పాలకమండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ వారికి చక్రస్నానం, మహా పూర్ణాహుతి

జమలాపురంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు