
మంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరముందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ అన్నారు. హెచ్‌సీయూ భూముల వేలాన్ని నిలిపివేయాలనే డిమాండ్‌తో గురువారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ మేరకు శ్రీశ్రీ సర్కిల్ నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వైపు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకుని అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత రామకృష్ణతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శులు ప్రవీణ్, మస్తాన్, ఎం.సురేశ్ మాట్లాడారు. అక్రమ అరెస్టులను నిలిపివేసి యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాగం లోకేశ్, సుధాకర్, శివ, నాగుల్‌మీరా, రాజు, అజయ్, వంశీ, వినోద్, మనోజ్, సాగర్, భాను, ఉదయ్, ప్రతాప్, గోపి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న
పోలీసులు

మంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం