
పేదలందరికీ సంక్షేమ పథకాలు
● ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● మేడేపల్లిలో వంతెనకు శంకుస్థాపన, కేజీబీవీలో భోజనం
ఏన్కూరు: రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. అయితే, అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. ఏన్కూరు మండలం మేడేపల్లిలో పీఎంజేఎస్‌వై నిధులు రూ.4.50 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ వంతెనకు ఎంపీ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సీ్త్ర టీ స్టాల్‌ను ప్రారంభించి నిర్వాహకులు నాగేంద్రమ్మను అభినందించారు. ఆతర్వాతఎంపీ మాట్లాడుతూ హెచ్‌సీయూ భూముల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రుణమాఫీ కాని రైతుల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా, జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని ఎంపీ తెలిపారు. అనంతరం రేపల్లెవాడ సమీపంలోని రాజీవ్ లింక్ కెనాల్ పనులను పరిశీలించిన ఎంపీ, ఏన్కూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంటగదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించాక మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను ఆరా తీశారు. ఆపై వారితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశారు. ఈకార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటరెడ్డి, డీఈ కరుణాకర్‌రెడ్డి, నాయకులు గుత్తా వెంకటేశ్వరావు, వేముల కృష్ణప్రసాద్, స్వర్ణ నరేందర్, మేడ ధర్మారావు, చందూలాల్, భూక్యా లాలు, వాసిరెడ్డి నాగేశ్వరావు, కొప్పుల ప్రభావతిరెడ్డి, వాసిరెడ్డి నాగేశ్వరావు, తాళ్లూరి నవీన్, దళపతి భువనేశ్వర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.