
రైతులకు గుర్తింపు కార్డులు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో కూరగాయలు సాగు చేస్తూ ఖమ్మం రైతుబజార్‌లో విక్రయించే రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తెలిపారు. మండలంలోని రైతులకు ఆయన శుక్రవారం కార్డులు పంపిణీ చేశాక మాట్లాడారు. అర్హులైన రైతులకు కార్డులు జారీ చేయడం ద్వారా, రైతుబజార్‌లోకి దళారులు రాకుండా అడ్డుకట్ట వేయనున్నామని తెలిపారు. ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం సొసైటీ చైర్మన్ తాత రఘురాంతో పాటు శివరామకృష్ణ, వాంకుడోత్ దీప్లానాయక్, చెరుకూరి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.