
కర్షకుల కళ్లలో కన్నీళ్లు
ఆకాల వర్షంతో పంటలకు నష్టం
అనుకోని వర్షం అన్ని పంటలను
దెబ్బకొట్టింది.. మండే వేసవిలో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి.. ఇక పంట చేతికి
వస్తుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లు
కుమ్మరించింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆకాలంగా వచ్చిన వాన అన్నదాతల కంట కన్నీళ్ల వరదలు పారించింది. జిల్లాలోని తిరుమలాయపాలెం, వైరా, తల్లాడ, ఏన్కూరు, కల్లూరు, కామేపల్లి, కొణిజర్ల, కూసుమంచి మండలాల్లో
గురువారం అర్ధరాత్రి, శుక్రవారం
సాయంత్రం వర్షప్రభావం కనిపించింది.
ఆతర్వాత కూడా ఆకాశం మేఘావృతమై
ఉండగా, పంటలు రక్షించేందుకు రైతులు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు.

కర్షకుల కళ్లలో కన్నీళ్లు

కర్షకుల కళ్లలో కన్నీళ్లు