
నెలాఖరులోగా ప్లాస్టిక్ రహితం
ఖమ్మంసహకారనగర్: ఈ నెలాఖరు నాటికి అన్ని మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్లాస్టిక్ నియంత్రణపై సమీక్షించారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని, ఏప్రిల్ తర్వాత ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని తెలిపారు. అలాగే, కార్యాలయాల వద్ద చలివేంద్రాల నిర్వహణను పర్యవేక్షించాలని, గ్రామాలు, మున్సిపాలిటీల్లోని బస్టాప్‌లు, ఆటో స్టాండ్ల వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీ నవీన్‌బాబు, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ అధికారులు జ్యోతి, విజయలక్ష్మి, డాక్టర్ బి.పురంధర్, ఎల్‌డీఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళి
ఖమ్మంమయూరిసెంటర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నివాళులర్పించారు. కలెక్టరేట్‌లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, కలెక్టరేట్ ఏఓ అరుణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గౌడ సంఘం నాయకులు మిత్రు గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన అవసరం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మంజూరు చేస్తున్న యూనిట్లలో నాణ్యత పాటిస్తూ వ్యాపారాలు విస్తరించుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్ బస్టాప్ వద్ద ఇందిరా మహిళా శక్తి సీ్త్ర టీ స్టాల్‌ను పరిశీలంచిన ఆయన నిర్వాహకురాలితో మాట్లాడారు. వేసవి దృష్ట్యా బటర్ మిల్క్, పండ్ల రసాలు, లస్సీ అమ్మకాలపై దృష్టి సారించాలని సూచించిన ఆయన ఆమె వినతితో టీ తాగారు.
మహనీయుల జయంతి వేడుకలు
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో సూచించారు. ఈనెల 5న జగ్జీవన్ రామ్, 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్ని మండల కార్యాలయాల్లో అమలు
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్